Friday, 16 March 2018 15:06

భూమిని కాపాడుతున్నది బాబే

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది కైలాసం. పార్వతీ పరమేశ్వరులు హాల్‌లో కూర్చుని జెమిని టీవీలో వస్తున్న 'కొడితే మొగుడినే కొట్టాలి' సీరియల్‌ చూస్తుంటే... వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి మాత్రం బయట క్రికెట్‌ ఆడు కుంటున్నారు. పది ఓవర్లలో సుబ్ర హ్మణ్యం స్వామి 90 పరుగులు తీసాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ వినాయకుడిది. అన్నీ సిక్సర్లే... ఏంట్రా సీన్‌ అని చూస్తే... సుబ్రహ్మణ్యం స్వామి వేసిన బంతులను వినాయకుడు బ్యాట్‌తో కొట్టకుండా తొండంతో పట్టుకుని గాల్లోకి విసురు తుంటే అవి బౌండరీ లైన్‌ అవతల పడ సాగాయి. ఇలా అన్నీ సిక్సర్లే... అలా మూడు ఓవర్లకే టార్గెట్‌ చేధించే పరి స్థితి. స్కోర్‌ 85 పరుగులున్నప్పుడు సుబ్ర హ్మణ్యం స్వామి వేసిన బంతిని గణపతి తొండంతో పట్టుకుని గట్టిగా విసిరాడు. ఆ బాల్‌ నేరుగా పోయి హాల్‌లో సీరి యస్‌గా సీరియల్‌ చూస్తున్న శివయ్య మూడోకన్నుకు తగిలింది. అబ్బా... అంటూ బాధతో ఆయన రెండో ఆలోచన లేకుండా మూడోకన్ను తెరిచాడు. ఆయన మూడోకన్ను తెరవడాన్ని పార్వతీదేవి చూసి... స్వామీ, ఎంత పని చేశారు. మీరు మూడోకన్ను తెరిస్తే లోకమంతా ప్రళయమే కదా... నక్షత్రాలు పేలిపోవా? గ్రహాలు గుద్దుకోవా? అసలు భూమి అన్నది ఉంటుందా? భూమ్మీద జీవరాశి అంతరించిపోదా... ఈ పాటికే భూలోకం అల్లకల్లోలమై వుంటుంది. ఒక్కసారి భూలోకంలో ఏం జరుగుతుందో ఆ గూగల్‌ సెర్చ్‌ ఓపెన్‌ చేసి చూడండి... అని ఆదుర్దాగా చెప్పింది. అయ్యో ఎంత పొరపాటు జరిగింది దేవి... భూమి నాశనాన్ని ఆపడం ఇక ఎవరి తరమూ కాదే అంటూ తన ల్యాప్‌టాప్‌ తీసి గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్ళి భూగ్రహం మీద ఏం జరుగుతుందో చూడసాగారు. ఆశ్చర్యం... భూమ్మీద అంతా ప్రశాం తంగానే ఉంది. ఎలాంటి ప్రళయాలు, విలయాలు లేవు. శివుడు ఒక్క నిముషం ఆలోచనలో పడ్డాడు. తాను కన్ను తెరిస్తే ప్రళయం వస్తుందని చెప్పే ఇంతకాలం అది పనిగా మూడో కన్నును మూసిపెట్టు కున్నాను. ఆ కన్ను తెరిస్తే ఏమీ జరగని దానికి ఇంతకాలం మూసి పెట్టుకోవడ మెందుకు అనుకుంటూ వెంటనే వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా బ్రహ్మ, విష్ణుమూర్తిలను కైలాసానికి రావాల్సిందిగా కోరాడు.

అరగంటకల్లా వాళ్ళు కైలాసానికి వచ్చారు. ఏం మహేశ్వరా... ఎందుకు ఈ అర్జంట్‌ మీటింగ్‌ అని బ్రహ్మ అడిగాడు. అందుకు శివయ్య... ఒక్కటి చెప్పండి... నా మూడో కంటికేమన్నా పవర్‌ తగ్గిందా? లేక మన దైవ లోకాల కంబైన్డ్‌ రాజ్యాంగంలో సవరణలు ఏవన్నా జరిగాయా? నేను మూడోకన్ను తెరిస్తే ప్రళయం వచ్చి భూమి అంతమవు తుందనే ప్రచారం ఇంతవరకు వుంది. కాని, నేను ఇంతకుముందే క్రికెట్‌ బంతి తగిలి పొరపాటున మూడో కన్ను తెరచినా భూలోకంలో ఏ మార్పులు లేవు. అక్క డంతా ప్రశాంతంగానే ఉంది. ఎందు కిలా జరిగింది. నాకిప్పుడే తెలియాలి అంటూ ఆవేశంగా కూర్చున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి కలుగజేసుకుని... అదా మీ బాధ... మీరు మీ మూడోకన్ను తెరిస్తే ప్రమాదమని ఇంతకాలం జాగ్ర త్తగా వుంటున్నట్లున్నారు. కాని ఇప్పుడు మనకు అంత సీన్‌ లేదు. మన పవర్‌ అంతా కూడా భూలోకంలో కొందరు రాజకీయ నాయకులచేతుల్లోకి వెళ్ళి పోయింది. వాళ్ళ చేతుల్లోనే భూమి భవి ష్యత్‌ వుందని చెప్పాడు. దానికి శివయ్య... అదెట్లా, నాకు అర్ధం కావడం లేదని అన్నాడు. నీకు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్‌ చూపిస్తాను చూడు... ఇది జస్ట్‌ ఇమ్మాజి నేషన్‌ పిక్చర్‌ అంటూ వేలితో గాల్లో స్క్రీన్‌ గీసి పిక్చర్‌ ప్లే చేసాడు విష్ణుమూర్తి.

్య్య్య్య్య

అది ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. మోడీ మీడియాతో మాట్లాడుతూ... 2014లో జరిగిన విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. మేము అధికా రంలోకి వస్తే పదేళ్ళపాటూ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాము... ఆ మాటకు కట్టుబడే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తున్నా మని చెప్పాడు.

్య్య్య్య్య

ప్రపంచంలోని పాతిక టాప్‌ సిటీలను మిక్సీలో వేసి తీసిన అమరావతి నగర మది. ఉండవల్లిలోని హైటెక్‌రత్న, ఆంధ్ర సిఎం చంద్రబాబు నివాసం. ఆయనతో పాటు మంత్రులు పి.నారాయణ, సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కె.ఇ.కృష్ణమూర్తి, పత్తిపాటి పుల్లారావు తదితరులున్నారు. మీడియా సమావేశం మొదలైంది. చంద్ర బాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులకిచ్చిన ఋణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేకపోయాం... ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకుని తప్పు చేసాం. పోలవరం ప్రాజెక్ట్‌లో అనవసరంగా అంచనాలు పెంచాం. పుష్కరాలు, పట్టిసీమ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగింది. ప్రతి సంవత్సరం సిఐఐ సమ్మిట్‌లు అంటూ సదస్సులు పెట్టి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నా యంటూ ఊదరగొడుతున్నాం కాని అదంతా వట్టిదే... ముఖ్యంగా అమరా వతి రాజధాని పేరుతో విదేశాలన్నీ తిరుగు తున్నాం, కాని అక్కడ చేసిందేమీ లేదు అని చెప్పాడు. అంతే ఒక్కసారిగా అక్కడ భూమి కదలసాగింది. చెట్లు భయం కరంగా ఊగుతున్నాయి. ఈదురు గాలులు... చెట్లు కూలుతున్నాయి... భవనాలు కదులుతున్నాయ్‌... సము ద్రంలో సునామీ వచ్చి ఊర్లను ముంచెత్త సాగింది.

ఈ సీన్‌లన్నింటిని ఎయిర్‌ స్క్రీన్‌పై చూస్తున్న శివయ్య బిత్తరపోయాడు. ఏంటి ఇదంతా అని అడిగాడు. దానికి విష్ణు మూర్తి... లేటెస్ట్‌ సిచ్యుయేషన్‌ ఇదే... మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా, చంద్రబాబు నిజం మాట్లాడినా ప్రళయం వచ్చి భూమి మీద యుగాంతం జరుగు తుంది. చంద్రబాబు కేవలం భూమి మీద జీవరాశి అంతరించకూడదనే ఉద్దేశ్యం తోనే నిజాలు మాట్లాడలేకపోతున్నాడు. నువ్వు లోకం కోసం గరళాన్ని కంఠంలో దాచుకున్నట్లు ఆయన భూమి భద్రత కోసం నిజాలను కడుపులో దాచుకుని మనస్సాక్షి అంగీకరించకపోయినా అబద్దాలు మాట్లాడుతున్నాడని చెప్పి తమ లోకానికి బయలుదేరాడు.

Read 46 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter