Friday, 16 March 2018 15:15

ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ ఆస్థి పన్నులపై ఏదీ?

Written by 
Rate this item
(0 votes)

nmcనెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌ 75 వేలు, కమర్షియల్‌ 25వేలు, కాలువగట్లు, రైల్వే స్థలాల్లోని అసెస్‌మెంట్లు 11వేలు ఉన్నాయి. డబుల్‌ ఎంట్రీలు, నాట్‌ట్రేసింగ్‌ కింద మరో 5వేలు అసిస్‌మెంట్లున్నాయి. గత కొన్నేళ్ళుగా కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం రూ.4కోట్ల పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఈ ఏడాది రూ.33కోట్లు వసూలు చేసారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.33కోట్లు పన్నులు వసూలు చేయాల్సివుంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.22కోట్లు మేర పన్నులు వసూలు కావాల్సి వుంది. గూడూరు మునిసిపాలిటీలో 11659, కావలిలో 21947, సూళ్ళూరుపేటలో 9258, నాయుడుపేటలో 10170, ఆత్మ కూరులో 7334, వెంకటగిరిలో 12000 అసెస్‌మెంట్లు ఉన్నాయి. దాదాపు రూ.36 కోట్లు పన్నుల వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.13కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. రెవెన్యూ అధికారులు పేద, మధ్య తరగతి ప్రజలు పన్నులు కట్టకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు తప్ప, బడాబాబుల జోలికి వెళ్ళడం లేదు. నెల్లూరు నగరంలో ప్రముఖ హోటళ్ళు, లాడ్జీలు, కమర్షియల్‌ భవనాలు పెద్ద మొత్తాలలో పన్ను బకాయిలు వున్నా, వారికి రాజకీయ నాయకుల పలుకుబడి ఉండడంతో అధికారులు వారి జోలికి వెళ్ళడం లేదు. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్ళ గడువు ఈ నెల 31వ తేదీ నాటికి ముగియ నుంది. ఉన్నతాధికారులు రెవెన్యూ వసూళ్ళ పై సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాని పన్నుల వసూళ్ళలో సిబ్బంది పనితీరు సరిగా లేకపోవడంతో వెనుకబడుతున్నారు. దీంతో మునిసిపాలిటిలు అభివృద్ధిలో కుంటుపడుతున్నాయి.

Read 555 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter