23 March 2018 Written by 

ఢిల్లీలో వైసిపి సత్తా చూపుతున్న మరో మొనగాడు

vijay saiఆయన్నొక సాధారణ ఆడిటర్‌ అనుకున్నారు... ఆయనకు లెక్కలు తప్ప రాజకీయాల్లో ఎక్కాలు తెలియవనుకున్నారు. ఆయనను రాజ్యసభకు పంపు తుంటే... ఈ ఆడిటర్‌ పార్లమెంటుకు వెళ్ళి ఏం చేస్తాడన్నారు. వై.యస్‌.కుటుంబం పట్ల విశ్వాసం చూపినందుకే రాజ్యసభకు పంపించారన్నారు.

నిజమే... వై.యస్‌. కుటుంబం పట్ల ఆయన చూపి స్తున్నది విశ్వాసం కాదు, అంతకుమించిన ప్రేమ, అభిమానం. అంతటి అభిమానం ఉండబట్టే జగన్‌తో పాటే కేసుల్లో ఇరుక్కున్నాడు. జగన్‌తో పాటే జైలులో గడిపాడు. ఈరోజు జగన్‌ కోసమే ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ప్రత్యర్థులను షేక్‌ చేస్తున్నాడు.

ఈరోజు వరకు కూడా రాజ్యసభలో వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వున్న ఒకే ఒక సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ఒక్కడైతేనేం వందమందితో సమానం. సభలోని 250 మందికి లెక్కలు చెప్పగల నైజం ఆయనది. పార్లమెంటు సమావేశాలలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. రాజకీయంగా అనుభవం లేకపోయినా, ఎంతో పరిణితి ప్రదర్శిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో వైసిపి 8 లోక్‌సభ స్థానాలను గెలిచింది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉండడం, కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం, బీజేపీ కంటే కాంగ్రెస్సే బద్ధశత్రువు కావడం మూలంగా జాతీయ రాజకీయాల్లో వైసిపి ప్రభావం పెద్దగా లేకుండా పోయింది.

అయితే రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎప్పుడు అడుగుపెట్టాడో అప్పుడే పొలిటికల్‌ సీన్‌ మారిపోయింది. జాతీయ రాజకీయాల్లోనూ, ఢిల్లీలోనూ వైసిపికి ఒక ట్రాక్‌ ఏర్పడింది. విజయసాయిరెడ్డి పార్లమెంటులో అడుగుపెట్టనంతవరకు జగన్‌ లక్ష కోట్లు తిన్నాడన్న టీడీపీ నేతల వాయిస్సే అక్కడ వినిపిస్తుండేది. కాని, విజయసాయిరెడ్డి ఢిల్లీలో అడుగుపెట్టాక ఏపి నుండి నిజాలు మాత్రమే వెళ్ళసాగాయి. జగన్‌పై పెట్టిన కేసుల్లో దురుద్దేశ్యాన్ని, అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంలో విజయసాయిరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. చంద్రబాబు మితిమీరిన అధికార దుర్వినియోగాన్ని దుబారాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడం వల్లే కేంద్రం ఈరోజు ఏపికి ఇస్తున్న నిధులపై గట్టిగా లెక్కలు అడుగుతోంది. ఆ లెక్కలు అడగబట్టే తన బొక్కలు బయటపడతాయని చంద్రబాబు ప్రత్యేకహోదా సొడ్డు పెట్టి ఎన్డీఏ నుండి బయటకొచ్చాడు.

ప్రత్యేకహోదా ఉద్యమం విషయంలోనూ జగన్‌కు విజయసాయిరెడ్డి కొండంత అండగా నిలిచాడు. జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్ర పరిధిలు దాటకుండా ఇక్కడే ఉద్యమానికి రూపకల్పన చేస్తుంటే, ఉద్యమ సెగలను పార్లమెంటును తాకేలా చేసింది విజయసాయిరెడ్డే! ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంలోను, దానికి అన్ని పక్షాల మద్దతు కూడగట్టడంలోనూ ఆయన చేసిన ప్రయత్నాలు అనిర్వచనీయం. బీజేపీకి అమిత్‌షా, రాంమాధవ్‌, కాంగ్రెస్‌కు అహ్మద్‌పటేల్‌, గులాంనబీ ఆజాద్‌, సమాజ్‌వాదీకి ఒకప్పుడు అమర్‌సింగ్‌ లాంటి నాయకులు ఎలా ఆయువుపట్టుగా వుండేవాళ్ళో, ఇప్పుడు వైసిపికి విజయసాయిరెడ్డి ఆయువుపట్టయ్యాడు. నాడు వై.యస్‌. కుటుంబానికి, నేడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి నమ్మినబంటు అయ్యాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. తాను కేవలం లెక్కల మాంత్రికుడినే కాదు, రాజకీయ తాంత్రికుడిని కూడా అని రుజువు చేసుకుంటున్నాడు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter