23 March 2018 Written by 

రైతును ముంచేస్తున్నారు

karuvuజిల్లాలోని మెట్ట ప్రాంతాలు కరువు వాతపడ్డాయి. ఒకవైపు నీటి కొరత, మరోవైపు అకాల వర్షాలతో పంట పొలాలు దెబ్బతినడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా మెట్టలో చెరువులు దొరువుల్లో చుక్కనీరు లేక సేద్యం కుదేలైపోయింది. అప్పుల పాలై రైతన్నలు లబోదిబోమంటున్నారు. సాగునీటి వసతులు అంతంతమాత్రంగానే వుండడంతో ఎంతగా కష్టించి పనిచేసినా పంటలు సక్రమంగా పండక మెట్ట రైతులు పడే అవస్తలు అన్నిన్ని కావు. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని అనేక మండలాలు కరువుతో విలవిల్లాడుతున్నా ప్రభుత్వం అన్నదాతల గోడును పట్టించుకోకపోవడం విచారకరం.

ప్రతి ఏడాదీ జిల్లాలోని మెట్ట ప్రాం తాలు కరువుతో అల్లాడుతూనే ఉన్నాయి. లేదంటే అకాల వర్షాలు వచ్చి కొంప ముంచి పోతున్నాయి. గత కొద్ది సంవత్స రాలుగా వరుసగా వస్తున్న ఈ ప్రకృతి విపత్తులు మెట్ట ప్రాంతాల రైతులను అప్పుల సుడిగుండంలోకి నెడుతున్నాయి. అటు సాగునీరు లేక, ఇటు తాగునీరుకు కూడా కష్టాల పాలవుతున్నా రైతుల ఇబ్బం దులను పట్టించుకునేవారు లేకపోవడం బాధాకరం. ఇక్కడ భూముల్లో అధికశాతం వర్షాధార భూములే. వరుణుడి కరుణ ఉంటే తప్ప ఇక్కడ చేలల్లో పంటలు పండవు. బోర్లు, బావుల కింద పంటలు సాగుచేసుకునే రైతుల పరిస్థితి కూడా దాదాపు అంతే. భూగర్భజలాలు అడు గంటిపోవడంతో పంటపొలాలకు చుక్క నీరు అందక రైతులు దిగాలుపడిపోయారు. సుమారు నాలుగువందల అడుగుల లోతుకు బోరు వేసినా నీటి చుక్క అందక పోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మూగజీవాలకు తాగేందుకు కూడా నీరు దొరక్కపోవడంతో వాటి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా ఎండకు ఎండిన నేలలే తప్ప పచ్చదనం అన్నది కనిపించడం లేదు. కొండలు గుట్టలన్నీ వెదికినా మూగ జీవాలకు గడ్డి దొరకడం లేదు. పాడిపశువులున్న రైతులు ఆ మూగజీవాలను ఎలా కాపాడుకోవాలో తెలియక కంటనీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఈ కరువులో పంటలు పండక సేద్యానికి చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది నిరుపేద రైతులు సతమతమవుతున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకో వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. పొలాల్లో పనులు లేకపోవడంతో మెట్ట ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న వ్యవసాయ కూలీలు ఇక్కడ పనులు లభించక, ఉన్న ఊరు వదిలిపెట్టి పొట్టచేత పట్టుకుని పనులున్న చోటికి వలసలు పోతున్నారు. మెట్ట చుట్టూ కరువు కమ్మేయడంతో ఈ ప్రాంతాల్లో వేసిన వరి తదితర పైర్లన్నీ అత్యధికశాతం నిలువునా ఎండిపో యాయి. ఒక్క ఉదయగిరి వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోనే వరి సాగు సాధారణ విస్తీర్ణం 3,815 హెక్టార్లుంటే, ఇందులో వరిపంట సాగైంది కేవలం 358హెక్టార్లలో మాత్రమే. ఇదీ దుస్థితి. దీంతో వరి రైతుల కష్టాలకు అంతేలేదు. వరితో పాటు అనేక ప్రాంతాల్లో వేసుకున్న మొక్కజొన్న, జొన్న, రాగి, మినుము తదితర పంటలు కూడా వానలు లేక ఎండిపోయాయి. పండ్ల తోటలు కూడా ఈసారి కనీవినీ ఎరుగని నష్టాలకు గురయ్యాయి. నీరు లేక బత్తాయి, మామిడి, నిమ్మ తదితర తోటలన్నీ ఎండి పోవడంతో రైతన్న కన్నీటిపర్యంతం అవు తున్నాడు. ప్రభుత్వం జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని 10 మండలాలలను కరువు మండలాలుగా ప్రకటించిందే తప్ప, కరువు కాటుకు గురైన ఆయా మండలాల్లోని రైతుల స్థితిగతులను అసలు పట్టించుకోవడం లేదు. ఆదుకునే వారు లేక రైతుల జీవన పరిస్థితులు దయనీయంగా మారాయి. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇకనైనా కరువు బారిన పడిన మెట్ట ప్రాంత రైతు లను ఆదుకునేందుకు తక్షణచర్యలు తీసు కోవాలని రైతులు కోరుతున్నారు.

కన్నీట ముంచిన...అకాలవర్షాలు

ఒకవైపు నీటిచుక్క లేక, అదనుకు వానలు కురవక పొలాలు ఎండిపోయి రైతులు బాధపడుతుతన్న తరుణంలో, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు ఆయా ప్రాంతాల రైతులను కన్నీట ముంచాయి. కోతకు వచ్చిన పంట భారీవర్షానికి నీట మునిగిపోవడంతో రైతులు కన్నీట మునిగిపోయారు. ఈ నెల 16వ తేది అర్ధరాత్రి దాటాక నాయుడుపేట, వెంకటగిరి, ఓజిలి, మనుబోలు, పెళ్ళకూరు, దొరవారిసత్రం, ఓజిలి తదితర మండలాల్లో అకాల వర్షాలు కురిశాయి. రెండురోజుల పాటు కురిసిన ఈ వర్షాల వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. అనేకచోట్ల పంటలు దెబ్బతినడంతో పాటు, కల్లాల్లో ఆరబెట్టుకుని ఉన్న ధాన్యం కూడా నీటమునిగిపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. సుమారు 2800 టన్నుల ధాన్యం నీటమునిగి ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ఈ అకాల వర్షాల వల్ల రైతాంగానికి కనీసం 48 కోట్ల దాకా నష్టం ఉంటుందని అంచనా. పంటచేలతో పాటు పండ్లతోటలకు కూడా అపారనష్టం కలిగింది. మామిడిపూత నేలరాలిపోవడంతో మామిడి రైతులు గోడుగోడుమంటున్నారు. అన్ని రకాల పంటలు ఈ అకాలవర్షాలకు అపారంగా నష్టానికి గురయ్యాయి. ప్రభుత్వం వెంటనే అటు కరువు బాధిత రైతాంగానికి, ఇటు అకాలవర్షాలతో నష్టపోయిన రైతాంగానికి చేయూతను అందించాల్సి ఉంది. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఈ నష్టాల అంచనాలను ప్రభుత్వానికి నివేదించి సత్వరం అన్నదాతలను ఆదుకోవాల్సి ఉంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter