Friday, 23 March 2018 11:26

అన్ని సీట్లూ ఇక తమ్ముళ్ళకే!

Written by 
Rate this item
(0 votes)

tdp logoఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి వాటి ప్రభావాన్ని బీజేపీ మీదకు తోసేయవచ్చు. రెండోది పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే సీట్ల నుండి ఇక తెలుగు తమ్ముళ్ళే పోటీ చేయవచ్చు. అది లోక్‌సభ అయినా, శాసనసభ అయినా, జడ్పీటీసీ అయినా, మున్సిపల్‌ వార్డు మెంబర్‌ అయినా!

ప్రతి ఎన్నికలలోనూ పొత్తులో భాగంగా బీజేపీకి ఒకటి, అరా సీట్లివ్వడం, ఆ పార్టీ ఓడిపోవడం జరుగుతూ వస్తోంది. 1985లో టీడీపీ-బీజేపీ పొత్తుకు బీజం పడింది. ఆ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఆత్మకూరు సీటిచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిగా వెంకయ్యనాయుడే ఓడిపోయాడు. 1989ఎన్నికల్లోనూ మళ్ళీ పొత్తు ధర్మంగా ఆత్మకూరునే ఆ పార్టీకిచ్చారు. ఈసారి కూడా ఆ పార్టీ అభ్యర్థి కర్నాటి ఆంజనేయరెడ్డి గెలిచినంత పనిచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు తెగిపోయింది. మళ్ళీ 1999 ఎన్నికల్లో కలిసారు. ఆ ఎన్నికల్లో సిటింగ్‌ ఎమ్మెల్యే టి.రమేష్‌రెడ్డికి చెక్‌ పెట్టాలని నిర్ణయించుకున్న చంద్రబాబు నెల్లూరు సీటును బీజేపీకి ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా డేగా నారసింహారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. నెల్లూరు నగరంలో తెలుగుదేశం పతనం అప్పుడే మొదలైంది. మళ్ళీ 2004 ఎన్నికల్లోనూ పొత్తులో భాగంగా నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు నెల్లూరు అసెంబ్లీ సీటును, అలాగే ఆత్మకూరు అసెంబ్లీ సీటును బీజేపీకివ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో మూడు చోట్లా పరాభవమే! 2009 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకున్నా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నెల్లూరురూరల్‌ సీటును సీపీఎంకు ఇవ్వడం తెలిసిందే! ఇక్కడా సీపీఎం ఓడిపోయింది. 2014 ఎన్నికలకొచ్చే సరికి మళ్ళీ బీజేపీతో పొత్తు ముడిపడిపోయింది. ఈసారి తిరుపతి లోక్‌సభ, నెల్లూరురూరల్‌ అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇచ్చారు. రెండు చోట్లా పరాజయమే!

ఇలా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీలో వున్న ఆశావహులను పక్కనపెడుతూ బీజేపీకి సీట్లిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకు రావడంతో ఆ సమస్య లేదు. ఆ పార్టీకి సీట్లిచ్చే పని లేదు. కాబట్టి తెలుగుదేశం నాయకులకే ఆ సీట్లు దక్కనున్నాయి.

Read 354 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter