03 April 2018 Written by 

విజయభారత్‌

gslvభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు కొరుకుడుపడని కొయ్యగా మారి పలు సందర్భాల్లో మొండికేసి ఇబ్బంది పెట్టిన జిఎస్‌ఎల్‌వి మెడలను ఆ సంస్థ ఎట్టకేలకు వంచింది. క్రమంగా దారి తప్పుతున్న జిఎస్‌ఎల్‌వి సిరీస్‌ను ఒక దారిలో పెట్టింది. ఇస్రోకు పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి రెండూ ముద్దుబిడ్డలే! కాకపోతే పీఎస్‌ఎల్‌వి ముందుగానే దారిలో పడి 'ఇస్రో' చెప్పినట్లు క్రమశిక్షణతో నడుచుకుంటుంది. జిఎస్‌ఎల్‌వి మాత్రం అప్పుడప్పుడూ మొండికేస్తుండేది. అలాంటి మొండిఘటాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దారికి తెచ్చారు. అంతరిక్ష ప్రయోగాల పరంపరలో మరో మైలురాయిని అధిగమించారు. జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలలో మరో విజయాన్ని నమోదు చేశారు.

మార్చి 29వ తేదీ సాయంత్రం 4.56గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌08 విజయవంత మైంది. ఈ ప్రయోగం ద్వారా 2,140 కిలోల బరువుగల జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్వదేశీ ఉపగ్రహం. దేశీయ మొబైల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థకు మల్టీబీమ్‌ ప్రసారాలను ఇది అందించనుంది. మొబైల్‌ బ్రాడ్‌బాండ్‌ సేవలకు ఎస్‌ బాండ్‌ బీమ్‌లు ఉపయోగపడనున్నాయి. ఈ ఉపగ్రహం తయారీకి దాదాపు 210 కోట్లు ఖర్చయ్యింది. పదేళ్ళ పాటు ఇది తన సేవలను అందించనుంది. మొత్తం 17.46 నిముషాలలో ప్రయోగం పూర్తయ్యింది. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌తో పాటు షార్‌ శాస్త్రవేత్తలు ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు తెలుపుకున్నారు. జిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ఇది 12వ ప్రయోగం. భారీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి జిఎస్‌ఎల్‌వి సిరీస్‌ ఉపయోగపడుతుంది. 2001 నుండి 2010దాకా రష్యా క్రయోజనిక్‌ ఇంజన్‌లతో ఆరుసార్లు జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు చేసారు. వాటిలో రెండు మాత్రమే విజయవంతమయ్యాయి. 2010లో రష్యా క్రయోజనిక్‌ ఇంజన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించడం నిలిపేసింది. దీంతో ఇస్రోనే సొంతంగా క్రయోజనిక్‌ టెక్నాలజీని రూపొందించుకుంది. ఇంతవరకు సొంత టెక్నాలజీతో 5ప్రయో గాలు జరుపగా మొదటిది తప్ప మిగతా నాలుగు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఆరవ ప్రయోగం కూడా విజయవంతం కావడంతో జిఎస్‌ఎల్‌వి సిరీస్‌పై నమ్మకం మరింత పెరిగింది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter