03 April 2018 Written by 

ఆనం పెత్తనంకు తెర

anam brosవి.ఆర్‌ విద్యాసంస్థలు... ఒకప్పుడు వెంకటగిరి రాజా విద్యాసంస్థలు అని పేరు. గత మూడు దశాబ్దాలుగా వివేకా నందరెడ్డి విద్యాసంస్థలుగా పేరుబడ్డాయి. ఈ విద్యాసంస్థలు ఆనం కుటుంబం చేతు ల్లోకి వచ్చాక వెంకటగిరి రాజాల పేరు మరుగునపడిపోయింది. వాళ్ళ పేరు సంబంధిత విద్యాసంస్థల డాక్యుమెంట్లలో తప్పితే ఎక్కడా కనిపించేది కాదు. విద్యా సంస్థలపై మొత్తం పెత్తనం ఆనందే అయ్యింది. కరస్పాండెంట్లు వాళ్ళే, కోశాధి కారులు వాళ్ళ మనుషులే. విఆర్‌ విద్యా సంస్థలను దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిం చారు. అయితే ఇన్నేళ్ళ పాటూ విఆర్‌ విద్యాసంస్థలు వారి చేతుల్లో అక్రమంగానే వున్నాయనే విషయం నిన్నటి సుప్రీం కోర్టు తీర్పుతో వెల్లడైంది. 1986లో జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నికైన పాలకవర్గం ఎన్నిక చెల్లదంటూ 27వ తేదీన సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇదే ఫైనల్‌ తీర్పు కావడంతో విఆర్‌ విద్యా సంస్థలపై ఆనం ప్రాభవానికి తెరదించి నట్లయ్యింది. ఈ ఏడాది జులై లోపు కొత్త కమిటీని ఎన్నుకోవాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది.

హిందూ మత ప్రాధాన్యతతో వెంకట గిరి రాజాలు 1875లో విఆర్‌ విద్యాసంస్థ లను ప్రారంభించారు. ఇవి అంచెలం చెలుగా విస్తరిస్తూ వచ్చాయి. 1940 నుండి విఆర్‌ విద్యాసంస్థల పాలకవర్గానికి ఎన్ని కలు నిర్వహించసాగారు. విఆర్‌ విద్యా సంస్థల కమిటీకి 1950, 1960, 1970 లలో ఎన్నికలు జరిగాయి. 1970లో ప్యాట్రన్‌గా వున్న పెద్ద రాజా యాచేంద్ర చనిపోయారు. అప్పుడు అధ్యక్షుడిగా వున్న కుమార రాజాను ప్యాట్రిన్‌గా, ఆనం వెంకటరెడ్డిని కొత్త అధ్యక్షుడిగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ప్రతి ఐదేళ్ళకోసారి నిర్వహించాల్సిన ఎన్నికలను జరపకుండా ఆనం వాళ్ళు కాలాన్ని నెట్టుకు రాసాగారు. 1985లో విఆర్‌ విద్యాసంస్థల పాలక వర్గానికి ఎన్నికలు జరపాలంటూ ఏబివిపి నాయకులైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆమం చర్ల శంకరనారాయణ, నందిమండలం చంద్రశేఖర్‌రాజులు నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ దాకా వెళ్లడంతో ఆయన స్పందిం చారు. నెల్లూరొచ్చి విఆర్‌ పాలకవర్గానికి ఎన్నికలు జరిపిస్తానని హామీ ఇచ్చి వీరిచేత దీక్షను విరమింపజేసారు. వీళ్ళు ఎన్నికల నైతే పెట్టించగలిగారు గాని ఆనం వాళ్ళు ఇంకో రూట్లో వెళ్ళి వీరి ప్రయత్నాలకు గండికొట్టారు. అప్పటి వరకు కమిటీలో సభ్యులుగా మెజార్టీవాళ్ళు ఆనంకే మద్ద తుగా వుండడంతో బైలాను సవరించారు. పూర్వవిద్యార్థులకు ఓట్లు లేకుండా చేసి 1986లో ఎన్నికలు నిర్వహించారు. అయితే పూర్వవిద్యార్థులు దీనిపై నెల్లూరు సివిల్‌ కోర్టులో కేసు వేయడంతో ఫలితాలు వెల్లడించలేదు. 1993లో పూర్వవిద్యార్థు లకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీంతో 1986లో జరిగిన ఎన్నికలకు సంబంధించి 1993లో ఫలితాలను వెల్ల డించారు. ఆ ఫలితాల ద్వారా ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌గా భారీ మెజార్టీతో గెలిచాడు. పూర్వవిద్యార్థుల ఓట్లు వుంటే ఫలితం ఇంకో విధంగా ఉండేదేమో! ఆనంవాళ్ళు దీనిని గ్రహించే పూర్వవిద్యార్థులకు ఓట్లు లేకుండా చేసారు.

అయితే పూర్వవిద్యార్థులైన ఆమంచర్ల శంకరనారాయణ, గూడూరు విజయరామి రెడ్డి, పోతుల రమణయ్యలు నెల్లూరు సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై 1996లో హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 15ఏళ్ళ తర్వాత ఈ కేసు 2015లో విచారణకొచ్చింది. ఆడిటర్‌ ఆమంచర్ల శంకరనారాయణ పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ కేసు గురించి పోరాడాడు. వాదోపవాదనల తర్వాత 2017 మార్చి 6వ తేదీన ఆనం వివేకా నందరెడ్డి కరస్పాండెంట్‌గా కొనసాగుతున్న పాలకవర్గం చెల్లదని హైకోర్టు తీర్పుని చ్చింది. వెంటనే విఆర్‌ విద్యాసంస్థలకు ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పును పునఃపరిశీ లించాలని ఆనం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో చివరి ప్రయత్నంగా ఆనం సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీ లించిన సర్వోన్నత న్యాయస్థానం ఆనంకు వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది. అంటే ఈ తీర్పు ప్రకారం 1993 నుండి ఇప్పటివరకు దాదాపు 35ఏళ్ళ పాటు చట్టవిరుద్ధంగానే విఆర్‌ విద్యాసంస్థలపై ఆనం వాళ్ళు పెత్తనం చెలాయించారన్నది అర్ధమవు తుంది. విఆర్‌ విద్యాసంస్థల చరిత్రలో వెలుగు, చీకట్లు అన్నీ కూడా ఈ 35ఏళ్ల లోనే జరిగిపోయాయి. విఆర్‌ విద్యాసంస్థ లలో సీటు దొరకడం గగనం అనే పరిస్థితి నుండి, అసలు సీట్లే భర్తీకాని నేటి పరిస్థితి వరకు ఎన్నో మలుపులు చూసాం. విఆర్‌ ప్రాథమిక పాఠశాల నుండి హైస్కూల్‌, ఇంటర్‌, డిగ్రీ, న్యాయకళాశాల, విఆర్‌ ఐఏఎస్‌, విఆర్‌ ఐపిఎస్‌, విఆర్‌ బి.ఇడి... ఇలా అన్ని దశలనూ చూసాం. హిందూ విద్యాసంస్థలుగా నెలకొల్పబడ్డ విఆర్‌ విద్యాసంస్థల ముందు అన్యమత విగ్రహాలు నెలకొల్పడం చూసాం. విఆర్‌ విద్యాసం స్థలు విద్యారంగంలో వెలిగిపోవడం కాని, కాలక్రమేణా గత వైభవాన్ని కోల్పోవడం కాని... అంతా ఈ మూడున్నర దశాబ్దాల కాలంలోనే జరిగింది.

ఆనం బ్రదర్స్‌ రాజకీయాలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో, ఈ విద్యాసంస్థలపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చారు. కేవలం విద్యాసంస్థలను తమ చేజారకుండా కాపాడుకోవడం కోసమే తెలుగుదేశంలో చేరారు. ఆఖరకు మంత్రి నారాయణను సైతం ప్రసన్నం చేసుకునే పరిస్థితికొచ్చారు. 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వున్నంత వరకు విఆర్‌ విద్యాసంస్థల వ్యవహారాలలో ఎవరు కూడా వేలుపెట్టడానికి సాహసించే వాళ్ళు కాదు. కాని తెలుగుదేశం అధికారం లోకి వచ్చాక మంత్రి నారాయణ విఆర్‌ విద్యాసంస్థల కార్యకలాపాలలో తల దూర్చినా, ఆనంవాళ్ళు ఆయనను నిలువ రించలేకపోయారు. విఆర్‌ను చేజార కుండా చూడడానికి వాళ్ళు ఎంతగా పాకు లాడినా... సుప్రీం కోర్టు తీర్పుతో ఆ ప్రయ త్నాలన్నీ వృధాగానే మిగిలిపోయాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter