03 April 2018 Written by 

అడుగంటుతున్న జలం... అల్లాడుతున్న జనం!

baviమానవాళికి ప్రాణాధారమైన జలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. గుక్క తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అనేక ప్రాంతాల్లో జనం అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి ఈనాటిదేమీ కాదు. ఏళ్ళ తరబడి వెంటాడుతూ ఉన్నదే. అయినా, ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఈ దుస్థితిని మార్చలేకపోతున్నారు. ప్రతినీటి చుక్కను కాపాడుకుందామనే బరువైన నినాదాలు ఇస్తుంటారే తప్ప ప్రజల దాహార్తి తీర్చే అమృతం లాంటి జలాలను శాశ్వత ప్రాతిపదికపైన పరిరక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో, జలం పాటికి జలం కాలక్రమేణా అడుగంటిపోతూనే ఉంది. జనం పాటికి జనం యధారీతిగా దాహమో! రామచంద్రా అంటూ విలవిల్లాడిపోతూనే ఉన్నారు.

ఒక్క మానవులకే కాదు, పశుపక్ష్యాదులకు, చెట్టు చేమలకు అన్నిటికీ నీరే జీవనాధారం..ప్రాణాధారం. నీరు లేకుండా ప్రాణం నిలబడదు. గుక్క తడుపుకోకుండా దేహం బతకదు. అందరికీ ప్రాణాలు నిలబట్టే ఆ నీటిని మాత్రం మానవుడు తన అవసరాలకు తగ్గట్టుగా సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తరాలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన పవిత్రమైన కర్త వ్యాన్ని మాత్రం విస్మరిస్తున్నాడు. అటు సాగునీటి జలాలు, ఇటు తాగునీరు అందరికీ ఎంతో అవసర మైనప్పటికీ, దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో నిత్యం నీటికి కటకటలు పడుతూనే ఉన్నారు. మనదేశంలో కనీసం 84 కోట్ల మందికి పైగానే ప్రజలు తాగేందుకు చుక్క నీరు దొరక్క దుర్భర పరిస్థితుల్లో ఉన్నారంటూ గణాంకాలు చెప్తున్నాయి. రానురాను ఈ నీటికరువు మరింతగా కోరలు చాస్తుందని, దేశంలో సగభాగానికి పైగానే ప్రజలకు జలగండం తప్పదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయినా, ప్రభుత్వాల్లో కదలిక ఉండడం లేదు. వేసవి వస్తే చాలు..అనేక ప్రాంతాల్లో ప్రజలకు నీటి బాధలు మరింత వెక్కిళ్ళు పెట్టిస్తుం టాయి. కుండలు బిందెలు చేతపట్టుకుని ఎంతో మంది తల్లులు, గృహిణులు ఇంటిపనులు వదిలిపెట్టుకుని, మైళ్ళ దూరంలో ఉన్న ఏ పంటపొలాల్లోనో

ఉన్న వ్యవసాయబావుల వద్దకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఆ తెచ్చుకునే బిందెడు నీరు వంటకే చాలదు..ఇక తాగేందుకు మళ్ళీ కుండ చేత పట్టుకుని బావుల వద్దకు వెళ్ళాలి. అవి కూడా దొరక్క ఎక్కడెక్కడ నీటి వనరులున్నాయో వెదుక్కంటూ ఏ గుంటల్లోనో, నీటి చెలమల్లోనూ నీళ్ళు తోడుకుని వచ్చి, ఆ మురికినీటినే వడకట్టుకుని తాగి ప్రాణం నిలబెట్టుకునే ప్రజలు కోట్లాదిగానే ఉంటారంటే అతిశయోక్తి కాదు. ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాల్సిన పాలకులు ప్రజల దాహార్తి తీర్చేందుకు, గ్రామాల్లో ఉన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు పాలకులు మారినా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడమే బాధాకరం. అందువల్లనే నేటికీ దేశంలోని ఎన్నో ప్రాంతాల్లోని జనం తమ పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు, గొంతులు తడారిపోతున్నాయంటూ ప్రజలు తల్లడిల్లిపోతూనే ఉన్నారు. బోర్లెండిపోతూనే ఉంటాయి.. నోర్లెండి పోతూనే ఉంటాయి. కాకి అరుస్తూనే ఉంటుంది..కరవాడ ఎండుతూనే ఉంటుంది.. అయినా, పట్టించుకునే నాధులెవరు?.. జనానికి ఈ మండే ఎండల్లో ఉండే బాధలు చాలవన్నట్లు వేసవిలో నీటి కష్టాలు చెప్పుకుంటూ పోతే కడివెడు కన్నీటి కథలే అవుతాయి. అందులోనూ, నీటిలో కలుషిత నీరు వేరయా అన్నట్లు.. అంతటా కాలుష్యం ప్రబలిపోతున్న ఈ రోజుల్లో నీరు కూడా కాలుష్యపు కాటుకు గురువుతూనే ఉంది. నదులు, కాలువలు, చెరువులు, దొరువులన్నీ రకరకాల వ్యర్థాలతో భరించలేనంత కాలుష్యానికి గురై, ఆ నీరు తాగిన ప్రజలు నానా రకాల వ్యాధులతో అవస్తలు పడుతూనే ఉన్నారు. నీటి వనరులను పరిరక్షించు కోవడానికి, కాలుష్యభూతాన్ని తరిమికొట్టడానికి ప్రభుత్వాలు తగు శ్రద్ధ తీసుకోవడం లేదు. దేశంలో సుమారు 450కి పైగానే నదీనదాలున్నా, ఇటీవలి కాలంలో కాలుష్యానికి గురైన నదుల సంఖ్య 275కి పైగానే పెరిగిందని కేంద్ర కాలుష్య నివారణ మండలి చెప్తున్నా పాలకులకు అది శ్రవణపేయంగానే

ఉంటోందే తప్ప, ఆ కఠోర వాస్తవాల్ని జీర్ణించుకునే స్థితిలో ఉండడం లేదు. దీంతో, దేశంలోని అనేక ప్రాంతాలు కలుషిత నీటితో కుళ్ళిపోతున్నాయి. ఈ నీటిని తాగి ఏటా ప్రాణాలు పోగొట్టుకునేవారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఈ ఇక్కట్లు చాలవన్నట్లు, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా, నీటిలో ఫ్లోరైడ్‌ శాతం కలవడం ద్వారా ఆ నీరు అనేకమంది ప్రజలనకు మరింతగా బాధిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయం లేక ఫ్లోరైడ్‌ శాతం కలగలసిన నీటిని తాగాల్సి రావడంవల్ల దేశంలోని అనేక ప్రాంతా ల్లోని ప్రజలు అనేకానేక వ్యాధులకు బాధలకు గురై శాపగ్రస్తుల్లా, జీవితాంతం జీవచ్ఛవాల్లా బతుకు తున్నారు. వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్ళే జలజలా రాలుతాయి. అయినా, వారి ఆర్తిని.. దాహార్తిని తీర్చే వారెవరూ?.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఫ్లోరైడ్‌ రక్కసి ఇంకా ఇంకా విరుచుకుపడుతూనే ఉందని నిపుణులు ఎన్నిసార్లు ఎంత స్పష్టంగా హెచ్చరిస్తున్నా పాలకుల చెవికెక్కకపోవడం ఎంతైనా విచారకరం. మనకు లభించే నీటి వనరులు కాలుష్యంతో ఉంటున్నాయి. భూగర్భంలో ఉండే స్వచ్ఛమైన జల

వనరులు అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితిని అందరూ వెంటనే గ్రహించాలి.

ప్రభుత్వాలు, పాలకులు, మేథావులు అందరూ కలసి ఇకనైనా నీటిని సంరక్షించుకునేందుకు బృహత్తర ప్రయత్నాలు చేయాలి. వాననీటిని పొదుపుగా వాడుకోవాలి. వాననీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయడం ద్వారా భూగర్భజల వనరుల్ని రక్షించుకోవాలి. అడవులు, చెట్టుచేమలు పెంచడం ద్వారా వర్షపాత సాంద్రతను పెంచుకోవాలి. వానలు.. వరదల ద్వారా సముద్రాలకు వృధాగా వెళ్లిపోతున్న అపార జలరాశిని కాపాడుకోవాలి. ఈ బాధ్యతలు విస్మరిస్తే జీవితాలు చివరికి ఎండిన మోడులే అవుతాయి. జలం

ఉంటేనే జాతికి బలం. ఆ జలమే అందరికీ శ్రీరామరక్ష!.. కనుక ఆ జీవజలాన్ని కాపాడుకోవాలి. పచ్చదనాన్ని, పర్యావరణాన్నీ పరిరక్షించుకోవాలి. అదే మనందరి తక్షణ కర్తవ్యం!....Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter