03 April 2018 Written by 

బీజేపీ బలపడేనా?

bjp leadersభారతీయ జనతాపార్టీకి సంబంధించి నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత వుంది. జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయి, అద్వాని, మురళీమనోహర్‌ జోషి వంటి సీనియర్‌ల తర్వాత పార్టీలో అంతటి సీనియార్టీ కలిగిన నాయకుడు, బీజేపీని ఆసాంతం చదివిన నేత, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు నెల్లూరుజిల్లా వారు కావడమే ఆ ప్రాధాన్యత.

వెంకయ్యనాయుడు సొంతజిల్లాలో బీజేపీ పరిస్థితి గతంలో ఏంటి? ఇప్పుడెలావుంది? రేపు ఎలా వుండ బోతోంది? అన్నది ప్రశ్న! బీజేపీ పార్టీని స్థాపించాక ఈ రాష్ట్రంలో ఆ పార్టీ తొలిసారి పోటీ చేసిన 1983 ఎన్నికల్లో వెంకయ్యనాయుడు ఉదయగిరి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈ జిల్లాకు సంబంధించినంత వరకు బీజేపీకి అదే తొలిగెలుపు. ఇప్పటివరకు చివరి గెలుపు కూడా! ఎందుకంటే ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ బీజేపీ గెలవలేదు. ఒంటరిగా పోటీ చేసిన ఎన్నికల్లోనే కాదు, తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలవలేదు. ఒకరకంగా చెప్పాలంటే 1980 దశకంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఎంతో కొంత బలం ఉండేది. పటిష్టంగా పనిచేసే కార్యకర్తలుండేవాళ్ళు. వెంకయ్యనాయుడు లాంటి నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, పార్టీలో అంతర్గత విభేదాలు, తెలుగుదేశంతో పొత్తు ఆ పార్టీ బలాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. 1985 ఎన్నికల నుండి కూడా ఆ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ విడిపోవడం... ఇలాంటి చర్యల మూలంగా ఆ పార్టీ బలహీన పడింది. సొంతంగా ఎదగలేకపోయింది. చాలావరకు బీజేపీ కేడర్‌ ఇతర పార్టీలవైపు వెళ్ళిపోయింది. జిల్లాలో కేవలం కొద్దిమంది నాయకుల పార్టీగా మాత్రమే ఆ పార్టీ మిగిలిపోయింది.

ఇప్పుడు మరోసారి తెలుగుదేశంతో పొత్తు తెగిపోయింది. ఆ పార్టీతో పొత్తున్నప్పుడల్లా బీజేపీ నాయకులకు ఒకటి అరా సీట్ల నుండి మాత్రమే పోటీకి అవకాశమొచ్చేది. ఇప్పుడు రెండు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయొచ్చు. దీనికితోడు స్థానిక సంస్థల పదవులకు సంబంధించి బోలెడు సీట్లున్నాయి. కనీసం ఎన్నికలను ఎదుర్కొనేంత సైన్యమన్నా బీజేపీలో వుందా? మనకు నిద్రలేస్తే సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, కందుకూరి సత్యనారాయణ, దువ్వూరు రాధాకృష్ణారెడ్డి... ఒక మాదిరి నాయకులుగా కనిపిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా పోటీలో నిలిచి సొంతంగా ఎన్నికలను ఎదుర్కొనే సామర్ధ్యం బీజేపీకి ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశాలున్నాయా అన్నదే పెద్దప్రశ్న?Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter