Tuesday, 03 April 2018 15:15

మైనార్టీకా? మహిళకా?

Written by 
Rate this item
(0 votes)

tdpచంద్రబాబునాయుడు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక జరిగిన అన్ని ఎన్నికలలోనూ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానాన్ని మహిళలకు ఇస్తూ వచ్చాడు. 1999లో వెంకట గిరిని సినీ నటి శారదకు, 2004లో గూడూరును ఉక్కాల రాజేశ్వ రమ్మకు, 2014 ఎన్నికల్లో గూడూరు సీటును డాక్టర్‌ బి.జ్యోత్స్న లతకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆ కాన్సెప్ట్‌ను అమలు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒక సీటును మహిళలకు గాని లేదంటే మైనార్టీలకు గాని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన గూడూరు సీటును ఈసారి వైకాపా నుండి జంప్‌ చేయించిన సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌కే ఇవ్వొచ్చు. కాబట్టి అక్కడ ఆశ లేదు. వున్న అవకాశమల్లా నెల్లూరుసిటీ లేదంటే సూళ్ళూరుపేట! ఈ రెండు సీట్లలోనే ప్రయో గాలు చేయగలరు! మహిళలకు నెల్లూరుసిటీ లేదా సూళ్లూరుపేట లలో దేనినైనా ఇవ్వొచ్చు. సూళ్ళూరుపేట అయితే ఎస్సీ మహిళను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పరసా రత్నం మీద వ్యతిరేకత బలంగా వుంది. స్థానికంగా వున్న టీడీపీ నాయకులు ఈసారి అభ్యర్థిని మార్చాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా అభ్యర్థి పోటీకి అవకాశముంది. ఇక రెండోది నెల్లూరు నగరం. ఇక్కడ జనరల్‌ మహిళ లేదంటే మైనార్టీలకు సీటివ్వడానికి అవకాశముంది. మహిళలకే సీటివ్వాలనుకుంటే మాజీమున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధతో పాటు పార్టీలో ఇటీవల కీలకంగా మారిన వసంత లక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మెన్‌ శ్రీమతి వసంతలక్ష్మి లాంటి వాళ్ళున్నారు. నెల్లూరు నగరంలో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి ఆ వర్గానికి చెందిన వారికి కూడా అవకాశముంది. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఈ ప్రయత్నాల్లోనే వున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వున్న 10సీట్లలో టీడీపీ నుండి ఒక సీటు మైనార్టీలకు గాని మహిళలకు గాని గ్యారంటీ అని చెప్పొచ్చు.

Read 277 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter