బత్తిని విజయకుమార్... ఈ పేరు గూడూరు నియోజకవర్గంలో తెలియనివారుండరేమో! వైసిపి ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభివృద్ధి కోసం నేటివరకు సేవ చేస్తూ చిన్నపదవిని కూడా పొందని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయకుమారే! మరి ఈయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడంపై వైసీపీలోనే పలు వురు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలు స్తోంది. వైసిపి అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి ఒక గుర్తింపు ఉం టుందని, ఆ గుర్తింపు ఇచ్చేది కేవలం వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ మాత్రమేనని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. 2014లో వైసిపి ఎమ్మెల్యే టిక్కెట్‌కు పాశం సునీల్‌కుమార్, బత్తిని విజయకుమార్ పేర్లు వినపడ్డాయి. ఆ ఎన్నికల్లో వైసిపి టికెట్టు పాశం సునీల్‌కు ఇవ్వడం జరిగింది. ఆనాడు నిరాశకు లోనైనా కూడా బత్తిని విజయకుమార్ పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావించి పార్టీకోసం పని చేసాడు. దివంగత నేత వై.యస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన సమక్షంలోనే బత్తిని విజయకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత వై.యస్.జగన్మోహన్రెడ్డి నాయ కత్వంలో వైసిపిలో పనిచేస్తూ గూడూరు నియో జకవర్గంలో వైయస్సార్పార్టీ తలపెట్టిన బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలలో ఆనాటి నుండి ఈనాటి వరకు పాల్గొంటున్న నాయకుడు బత్తిని విజయ కుమార్.
2014లో టీడీపీలోని కొంతమంది పెద్దలు తెలుగుదేశం పార్టీ తరపున గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమని బత్తిని విజయకుమార్‌పై ఒత్తిడి తెచ్చినా అతను మాత్రం వై.యస్. జగన్మోహన్రెడ్డిని వీడిరానని అన్నారు. 2019లో అయినా గూడూరు వైసిపి టిక్కెట్ జగన్మోహన్రెడ్డి కరుణించి ఇవ్వక పోతాడా అనే ఆశతో పార్టీలో ఉంటూ అందరితో కలసి పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు బత్తిని.
మరి ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి పార్టీ పదవిని ఇస్తారా లేక ఏకంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి.