Tuesday, 03 April 2018 15:17

చంద్రబాబుకు ప్రత్యక్షమైన శ్రీనివాసుడు

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీని వాసుడు కొలువైన తిరుమల క్షేత్రం. అప్పుడే దేవస్థానం ముందు కుయ్‌కుయ్‌ మని శబ్ధం చేసుకుంటూ కొన్ని కార్లు వచ్చి ఆగాయి. కారుల్లోంచి హైటెక్‌ రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌, ఈయన కుమారుడు నారా దేవాన్ష్‌, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ, వసుంధరా దిగారు. వాళ్ళు దిగగానే ఏబిసిడిఎఫ్‌ టీవీ ఛానెల్‌ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం మొదలుపెట్టారు. ఇక్కడ ఆ ఛానెల్‌ ప్రతినిధి పుకార్ల శ్యామల స్టూడియోలో వున్న వంకమూతి శంకర్‌ రావుతో... శంకర్‌ ఇప్పుడే బాబు దిగారు... అని అంది. చంద్రబాబుగారా అని శంకర్‌రావు అడిగాడు. కాదు, శంకర్‌... ఆ బాబు ఇప్పుడు అవుట్‌ డేటెడ్‌... ఈరోజు మన ఫోకస్‌ అంతా దేవాన్ష్‌బాబు మీదే... ఇప్పుడే బాబు అడుగులు వేస్తున్నాడు... అరే పరుగెడు తున్నాడు. ఇదిగిదిగో కూర్చున్నాడు... మళ్ళీ లేచాడు. తాత చంద్రబాబు వద్దకు పరుగెత్తాడు... ఆయన కాళ్ళను చుట్టేసు కున్నాడు. తాత చెయ్యి పట్టుకుని లాక్కు పోతున్నాడు. అదిగో ఏనుగుల వద్దకు వెళ్ళారు. అవి కాళ్ళెత్తి దేవాన్ష్‌బాబుకు నమస్కరించాయి. తొండంతో దీవిం చాయి. ఏనుగు తొండం పట్టుకుని దేవాన్ష్‌బాబు ఆడుకుంటున్నాడు... అని శ్యామలా చెప్పుకుంటూ పోతే... ఏదే మైనా శంకర్‌ ఈరోజు ఒక శుభదినం... దేవాన్ష్‌బాబు అడుగుపెట్టడంతోనే ఇక్కడ వాతావరణం మారిపోయింది. ఎండ తగ్గి చల్లటిగాలులు వీస్తున్నాయి. ఈ బుడ్డోడిని చూస్తుంటే తాతగారిలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనిపి స్తుంది శంకర్‌ అని చెప్పింది. వెంటనే స్టూడియో నుండి శంకర్‌ వుండి... దేవాన్ష్‌బాబు లోకేష్‌బాబు కంటే ముందే సీఎం అవుతారంటారా... లేక ఆయన తర్వాత అవుతారంటారా? అని అడి గాడు. దానికి శ్యామల... దేవాన్ష్‌ స్పీడు, తన తాత చంద్రబాబు గారి అడుగు జాడల్లో నడవడం చూస్తుంటే లోకేష్‌ కంటే ముందే సీఎం అవుతాడేమోనని పిస్తుంది శంకర్‌. మిగతా లైవ్‌ వాళ్ళు గుడి బయటకు వచ్చాక కంటిన్యూ చేద్దాం, ఇప్పుడే చంద్రబాబు ఫ్యామిలీ గుడి లోపలకు వెళ్ళిపోయింది శంకర్‌ అని చెప్పి ముగించింది.

చంద్రబాబు గుడిలోకి వెళ్ళి శ్రీవారి ముందు నిలబడ్డాడు. రెండుచేతులు జోడించి పది నిముషాలపాటు కళ్ళు మూసుకుని నిలబడిపోయాడు. తర్వాత అందరితో కలిసి బయటకొచ్చాడు. నిత్యాన్నదాన సత్రంకు వెళ్ళి, దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా అందరికీ అన్నం వడ్డించి వారితోపాటు తానూ తిన్నాడు. ఆ తర్వాత పద్మావతి అతిథిగృహంకు వెళ్లాడు. ఆయన తిరుమలలో వున్నాడన్న మాటేగాని మనసంతా అశాంతి... జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆందోళన... వాటి గురించి ఆలోచిస్తూనే బెడ్‌మీద నడుం వాల్చాడు.

---------------

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నుండి వచ్చిన లేఖను తీసుకుని మంత్రి దేవినేని ఉమ వచ్చాడు. చంద్రబాబుకు ఆ లేఖను అందించాడు. చంద్రబాబు ఆ లేఖ చదవసాగాడు. కావాలనే మీరు మాతో విడిపోయారు. మీ అవినీతి అక్రమాలు బయటపెడతాం, పోల వరంలో వేలకోట్ల అవినీతి జరిగింది. అవినీతిని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు బయటపెడతాం... అని ఆ లెటర్‌లో బెదిరించారు. ఆ లెటర్‌ చదవ గానే చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. కొంచెం మైండ్‌ డైవర్ట్‌ అవుతుందని టీవీ ఆన్‌ చేశాడు. టీవీ ఛానెల్‌ 10.5లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రెస్‌ మీట్‌... అమరావతి పేరుతో చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ప్రపంచంలో ఎక్కడకూడా నిర్మాణ ఖర్చు అడుగుకు రెండువేలకు మించదు. చంద్రబాబు మాత్రం అంతర్జాతీయ రాజధాని అంటూ భూమ్మీద ఎక్కడాలేని రేట్లు వేసి రాజధాని భవనాలు కట్టిస్తు న్నాడు. చంద్రబాబు అవినీతిని తవ్వి తీయాలంటే గడ్డపారలు చాలవు. బుల్‌ డోజర్‌లు, ప్రొక్లెయిన్‌లు కావాలి. ఈ చంద్రబాబుకు ఇక నిద్రలేకుండా చేస్తాం అని ఆవేశంగా హెచ్చరించాడు. చంద్ర బాబు మనసులో వీడు బీజేపీలో కాదు, వైసిపిలో ఉండాల్సినోడు అనుకుంటూ ఎక్స్‌ ఛానెల్‌ మార్చాడు. అక్కడ పోసాని కృష్ణమురళితో డిబేట్‌... ఆ ఛానెల్‌ యాంకర్‌ రాస్కోరా సాంబ వుండి... మీ సినిమావాళ్ళలో బ్రోకర్లు లేరా... లం... ముండలు లేరా... వాళ్లెందుకు ప్రత్యేక హోదాకు మద్దతునివ్వడం లేదు అని అడిగాడు. దానికి పోసాని... మేము గలీజు నా కొడుకులమే... నువ్వు మీ చంద్రబాబు, మీ లోకేష్‌లు మగ పతి వ్రతలు... చంద్రబాబును, లోకేష్‌ను తీసుకురండి, నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు చేయిద్దాం... ఎవరు ఎలాంటి వాళ్ళో బయటపడుతుంది. తప్పులు చేయని వాళ్లెవరో తేలుతుంది అని ఆవేశంగా అన్నాడు. అది చూస్తున్న చంద్రబాబు... వీళ్ళ అభిమానం తగలెయ్యా... వీళ్ళు నా మీద పక్షపాతం చూపుతున్నారా? వీళ్ళ వెర్రి డిబేట్‌లతో నాకు పక్షవాతం వచ్చేలా చేస్తున్నారా అని మనసులో అనుకున్నాడు. అక్కడ టీవీ డిబేట్‌లో పోసాని... వెంటనే ఇక్కడకు చంద్రబాబు, లోకేష్‌ రావాలి... నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు చేయాలి... అప్పటిదాకా నేను ఇక్కడనుండి కదలను అని కూర్చున్నాడు. యాంకర్‌ సాంబ... సార్‌, మేం స్టూడియో మూసి ఇళ్ళకు వెళ్లాలని చెప్పినా పోసాని లేవలేదు. చంద్రబాబు, లోకేష్‌ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటానని, అవసరమైతే నిరాహారదీక్ష చేస్తానని భీష్మించాడు. అప్పుడు రాస్కోరా సాంబ... సరే మీరు డిమాండ్‌ చేసినట్లే చంద్రబాబు, లోకేష్‌ లను పిలిపిస్తాం, నార్కో ఎనాలసిస్‌ పరీ క్షలు చేయిస్తాం, వారు తప్పు చేయలేదని ఋజువైతే మీరు ఈ రాష్ట్రం వదిలి పోవాలి. సరేనా అని ప్రపోజల్‌ పెట్టాడు. పోసాని అందుకు అంగీకరించాడు. మీరెవర్రా మాకు టెస్ట్‌లు పెట్టడానికి అంటూ చంద్రబాబు కేకలు వేయ సాగాడు. అప్పుడే ఆయన భుజాన్ని ఎవరో ఒడిసిపట్టారు. బాబు... బాబు అంటూ తట్టారు. చంద్రబాబు కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యం ఆయన పద్మావతి అతిథి గృహంలో బెడ్‌పైనే వున్నాడు. అప్పటి దాకా జరిగిందంతా కల అని తెలుసు కున్నాడు. మరి తనను తట్టి లేపింది ఎవరు అని ఎదురుగా చూసాడు. ఆశ్చర్యంతో ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ నిలువునామాల వాడు ప్రత్యక్షమై వున్నాడు. స్వామీ, ఈ భక్తుడి కోసం మీరే వచ్చారా అంటూ ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ... ఏంటి స్వామి నాకు ఈ కష్టాలు, ఓ పక్క కేంద్రం దుమ్మెత్తి పోస్తోంది, ఇంకోపక్క పవన్‌ కళ్యాణ్‌... ఇక జగన్‌తో పెద్ద సమస్య వుండనే వుంది. వీటన్నిం టికి పరిష్కారం ఏంటి స్వామి అని అడిగాడు. దానికి స్వామి... ఈ కష్టాలన్నీ ఇంకో ఏడాది మాత్రమే నాయనా అని చెప్పాడు. ఆ తర్వాత తొలగి పోతాయా స్వామి అని చంద్రబాబు ఆత్రుతగా అడి గాడు. లేదు నాయనా అవే అలవాటైపో తాయి అని చెప్పి మాయమయ్యాడు. చంద్రబాబు అలానే నోరు తెరిచాడు.

Read 80 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter