06 April 2018 Written by 

జీవించే హక్కు అందరిదీ!..

supreme courtఆలస్యం అమృతం విషం.. అన్నట్లుగా, ఒక్కోసారి నాన్చుడు ధోరణి వల్ల నానా అనర్ధాలు జరుగు తాయనేందుకు మొన్నటి భారత్‌బంద్‌ సందర్భంగా జరిగిన ఘర్షణలు..పలువురు మృతిచెందిన సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న సాచివేత వైఖరి మరోసారి విమర్శలకు గురైంది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగ మవుతున్నదన్న ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో, ఆ చట్టం నీరు గారిపోతున్నదంటూ దేశంలోని దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయి. ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆ సంఘాలు డిమాండ్‌ చేశాయి. అయితే, అప్పుడు కేంద్రం స్పందించలేదు. వారి విన్నపాలను పట్టించుకోలేదు. ఫలితంగా

ఉత్తర భారతదేశంలో ఆగ్రహజ్వాలలు అంటుకున్నాయి. పలు రాష్ట్రాల్లో ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత..కేంద్రం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ చేసేదేదో గత వారమే చేసివుంటే దేశంలో ఇంత ఆగ్రహజ్వాలలు పెల్లుబికేవి కాదు. సమస్యను వెంటనే పట్టించుకోక తాత్సారం చేసినందు వల్ల అలా ఘర్షణలు చెలరేగడమే కాక, పలువురు మృతిచెందే పరిస్థితి కూడా దాపురించింది. ఎస్సీఎస్టీల వేధింపుల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నా లను సహించేది లేదంటూ దళితసంఘాలు నిర్వ హించిన బంద్‌ హింసాత్మకగా మారింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి రాష్ట్రాలను అప్రమత్తం చేయాల్సిన కేంద్రం వైఫల్యం చెందిందనే అనవచ్చు. ఇక్కడ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించక నాన్పుడు ధోరణి అవలంభించడం వల్ల పరిస్థితులు చేయిదాటిపోయాయి. తీరా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది పరిస్థితి. ఇదిలా వుంటే సమాజంలో కులం పేరిట నిరాదరణకు గురికావడం, వివక్షకు, వేధింపులకు, అత్యాచారాలకు గురువుతున్న వర్గాలకు బాసటగా నిలిచేందుకు 1989లో ఎస్సీఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. అయితే, ఆ చట్టంలోని కొన్ని కఠిన నిబంధనలను సడలిస్తూ గతనెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచల నాత్మకమైంది. ఈ చట్టం తరచుగా దుర్వినియోగానికి గురవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడుతూ, తాజాగా ఆ చట్టంలోని కొన్ని కఠిన నిబంధనలు సవరిస్తూ కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. అయితే, ఈ మార్గదర్శకాల వల్ల మొత్తం చట్టమే నీరుగారిపోయే ప్రమాదం ఉందని, ఇది చట్ట స్ఫూర్తికి విఘాతమని నిరసనలు వ్యక్తం చేస్తూ దళితసంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఎస్సీఎస్టీ చట్టం కింద కేసు నమోదైతే తక్షణమే అరెస్టులు చేయాలని, అనంతరం జుడిషియల్‌ రిమాండ్‌కు పంపాలన్నది ఈ చట్టంలోని ఒక కీలక నిబంధన. అదేవిధంగా నిందితులు ముందస్తు జామీను పొందే ఆస్కారం ఉండదు. అయితే, ఈ చట్టం తరచుగా దుర్వినియోగమవుతోందని, వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు, స్వప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, తరచూ అమాయకులను కేసుల్లో ఇరికిస్తూ ఈ చట్టం కింద కేసులు పెడుతుండడం కూడా జరుగుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అమాయకులను నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొనేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. కేసులు నమోదైనప్పుడు సంబంధిత జిల్లా సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ అనుమతించిన తర్వాతే అరెస్ట్‌ చేయాలని సూచించింది. ఆరోపణలు దురుద్దేశంతోగానీ, మరేదైనా కారణంతో గానీ చేసినవని ప్రాధమిక దర్యాప్తులో తేలిన పక్షంలో..ముందస్తు జామీను ఇవ్వకూడదన్న ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇలాంటి తాజా మార్గదర్శకాలు చట్టాన్ని నిర్వీర్యం చేసేవిగానే ఉన్నాయంటూ పలు రాజకీయపక్షాలు, దళితసంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఆ తర్వాత కేంద్రం రంగంలోకి వచ్చి ఆ తీర్పును మరోసారి సమీక్షించుకోవాలని సుప్రీంకోర్టులో సమీక్షా పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, తామేమీ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చలేదని, సుప్రీంకోర్టు తాజాగా మళ్ళీ స్పష్టం చేస్తూ, గత నెల 20న తామిచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేయ డానికి నిరాకరించింది. బాధితులకు పరిహారం చెల్లించడానికి, వారికి ఆశ్రయం కల్పించడానికి, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు దోషులకు శిక్షలు అమలు చేయడానికి తమ ఆదేశాలు ఆటంకం కానేకాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టంలోని ఏ నిబంధ ననూ తాము నీరుగార్చలేదని, నిర్దోషుల ప్రాధమిక హక్కులను పరిరక్షించేందుకు అదనపు రక్షణలను మాత్రమే జోడించామని పేర్కొంది. అంతేకాదు, సవరణలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్న వారు బహుశా తమ తీర్పును సరిగా చదివి ఉండక పోవచ్చని కూడా వ్యాఖ్యానించింది. అయితే, తీర్పుపై పునరాలోచించాలని కోరుతూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన సమీక్షా పిటిషన్‌ను పదిరోజుల తర్వాత సమగ్రంగా పరిశీలిస్తామని వెల్లడించింది.

''నిర్దోషులకు శిక్ష పడకూడదని మేం చెప్పాం.. ఎస్సీ ఎస్టీ చట్టంలోని నిబంధనలతో వారు భయభ్రాంతులకు గురికాకూడదు. జీవించే హక్కుకు ఎవరూ దూరం కావొద్దన్నదే మా అభిమతం. ఇక్కడ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ చట్టానికి గానీ, ఫిర్యాదుదారులకు గానీ మేం వ్యతిరేకం కాదు''.. అని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటుచేసిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం.

ఏదేమైనా దళితులకు.. ఎస్టీలకు.. బడుగు బలహీనవర్గాల ప్రజలకు చట్టాలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా అన్నివిధాల రక్షణ ఇవ్వాల్సిందే. వారిపై వేధింపులకు, అన్యాయాలకు, అఘాయిత్యాలకు పాల్పడే దోషులు ఎంతటివారైనాసరే..వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఇందులో ఎవరికీ ఎలాంటి ఆక్షేపణా ఉండనక్కరలేదు. అయితే, ఏ నిరపరాధి కూడా ఎలాంటి అన్యాయానికీ గురికాకూడదు. వందమంది దోషుల్లో ఒక్క నిర్దోషి ఉన్నా.. ఆ ఒక్కరినీ రక్షించుకోవడం న్యాయం. అదే ధర్మం.. అదే మానవత్వం కూడా!..Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter