06 April 2018 Written by 

ఆదాల ఏ పార్టీ ఆటగాడో?

adalaఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కొన్ని సెంటిమెంట్లున్నాయి. దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసినోళ్ళు తర్వాత ఎన్నికల్లో గెలవరని. ఎన్నికలకు ముందు శ్రీకాళహస్తికి వెళితే ఓడిపోతారని... ఇలా కొన్ని సెంటిమెంట్లున్నాయి. అలాగే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌ కూడా వుంది.

ఆదాల రాజకీయ ప్రవేశం జరిగింది 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా! ఆ పార్టీ అభ్యర్థిగా అల్లూరు నుండి పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. సర్వేపల్లి నుండి కాంగ్రెస్‌ అభ్య ర్థిగా నిలిచి గెలిచాడు. అప్పుడే కాంగ్రెస్‌ కూడా అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికల్లోనూ అదే సీన్‌ రిపీట్‌! ఆయన సర్వేపల్లి నుండి రెండోసారి గెలిచాడు. కాంగ్రెస్‌ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2014కు ముందు రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి తెలిసిందే! రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా పతనమైన నేపథ్యంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశంలో చేరాడు. ఆరోజు వైసిపి అధిష్టానం నుండి పిలుపు వచ్చుంటే ఆయన ఆ పార్టీలో చేరుండే వాడే! కాని, అప్పటికే వైసిపిలో వున్న నాయకులు తలో సీటు మీద కర్చీఫ్‌ వేసుకుని ఉండడం, ఆదాలకు ఎక్కడ సీటు ఇస్తామన్నది స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన తెలుగుదేశంలో చేరాడు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి టీడీపీ అభ్యర్థిగా దిగాడు. గట్టిపోటీనిచ్చి ఓడిపో యాడు. ఆయన ఓడినా కూడా ఆ ఎన్ని కల్లో తెలుగుదేశం గెలిచింది. ఆదాల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌ బలపడింది.

ఈ సెంటిమెంట్‌ నేపథ్యంలో వచ్చే ఎన్నికలప్పటికి ఆయన ఏ పార్టీలో వుంటా డన్నది ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తు తానికైతే ఆయన నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వుంటున్నారు. ఈసారి లోక్‌సభకు పోటీ చేయడని, నెల్లూరు రూరల్‌ నుండే పోటీకి దిగుతాడని టాక్‌. అయితే, ఆయన టీడీపీ అభ్యర్థిగా లోక్‌ సభకు పోటీ చేసినా లేక నెల్లూరురూరల్‌ లేదా ఇంకే అసెంబ్లీకి పోటీ చేసినా గెలుపు గ్యారంటీ లేదు. వైసిపి నుండి తీవ్ర పోటీ తప్పదు.

అదే ఆయన వైసిపిలో చేరి లోక్‌ సభకు పోటీ చేసినా, ఇంకేదన్నా అసెంబ్లీకి పోటీకి దిగినా గెలుపు ఖాయమని రాజ కీయ విశ్లేషకుల అంచనా!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter