13 April 2018 Written by 

ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ

reddysరాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ ఏ పార్టీ ప్రభంజనం కూడా పని చేయలేదు. కేవలం నాయకుడి సమర్ధతకు ప్రజలు పెద్దపీట వేసారు.

ఉదయగిరి నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ బలమైన సామాజికవర్గాలు. ఈ రెండువర్గాల నుండే ప్రధానపార్టీల అభ్యర్థులు రంగంలోకి వస్తుంటారు. ఆ వర్గాలవాళ్ళే ఎమ్మెల్యేలవుతుంటారు. 1978 నుండి తీసుకుంటే వెంకయ్యనాయుడు రెండుసార్లు, మాదాల జానకిరాం ఒకసారి, బొల్లినేని రామారావు ఒకసారి కమ్మ సామాజికవర్గం నుండి గెలిచారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఒకసారి, కంభం విజయరామిరెడ్డి రెండుసార్లు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మూడుసార్లు(2012 ఉపఎన్నికతో కలిపి) విజయం సాధించారు.

రాబోయే ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎలాగూ మేకపాటి కుటుంబం నుండే ఎవరో ఒకరు పోటీలో వుంటారు. టీడీపీ తరపున ఎవరు రంగంలోకి వస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత వుంది. అయితే ఈ వ్యతిరేకత అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్లో, భూకబ్జాలు, దౌర్జన్యాలు చేయించడం వల్లో, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద కమిషన్లు తీసుకోవడం వల్లో వచ్చింది కాదు, ఆయన మహారాష్ట్రలో కాంట్రాక్టర్‌, అక్కడ ఆయనపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. కాని ఉదయగిరి నియోజకవర్గంలో అటువంటి ఆరోపణలు లేవు. కేవలం అతను నిత్యం అందుబాటులో ఉండడు. వారానికి ఒకట్రెండురోజులొస్తాడు... మండలస్థాయి నాయకులకు మాత్రమే కనిపిస్తాడు... నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరగా వుండడు. జనాలకేంటంటే తమ ఇళ్లలో చావయినా, శుభమైనా ఎమ్మెల్యే వచ్చిపోవాలి. ఈ నియోకవర్గంలో ప్రజల ఆలోచనా ధోరణి ఆ విధంగా ఉంటుంది. దీనికి బొల్లినేని రామారావు విరుద్ధం. అతను దొరకడం కష్టం. దీనివల్లే అతని మీద వ్యతిరేకత! అందుకనే బొల్లినేని ప్రత్యామ్నాయంగా 'రెడ్డి' సామాజికవర్గం నుండి ఈసారి అభ్యర్థిని గాలిస్తున్నట్లు తెలుస్తోంది. 'రెడ్డి' అభ్యర్థి అయితే అదే సామాజికవర్గం వారిలో చీలిక తేవొచ్చు. కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఎలాగూ చంద్ర బాబుకే ఓట్లేస్తారు. కాబట్టే ఈసారి తెలుగుదేశంలో ఈ సామాజికవర్గం వారికే అవకాశం చిక్కొచ్చు. ఈ నేపథ్యంలోనే మాజీఎమ్మెల్యే కంభంపాటి విజయరామిరెడ్డి పేరుతో పాటు వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి పేరు కూడా ప్రచారంలో వుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
    రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…

Newsletter