13 April 2018 Written by 

నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...

sridhar reddyప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది మొదలు ఆయనకు ప్రజల మధ్య ఉండడమే ఇష్టం. ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడమంటే ఇష్టం. వారి సమస్య లపై పోరాడడం అంటే ఇష్టం. ప్రజలకు దూరంగా ఉండాలంటే మాత్రం ఆయనకు చాలా కష్టం.

2014 ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేగా లేక ముందే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 141రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరినీ పలుకరించి, వారి సమ స్యలు తెలుసుకున్నాడు. 2017 అక్టోబర్‌లో ఎమ్మెల్యేగా 'మన ఎమ్మెల్యే మన ఇంటికి' పేరుతో 105రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టి రూరల్‌ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్ళారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆయన 105 రోజుల పాదయాత్ర ఈ ఏడాది జనవరి 12వ తేదీన ముత్యాలపాలెం వద్ద ముగియడం తెలి సిందే! ఈ పాదయాత్ర ముగిసి గట్టిగా మూడు నెలలు కాలేదు. ఇప్పుడు ఏకంగా 366రోజుల మహా ప్రస్థానం యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 5.37 గంటలకు రామలింగాపురం సెంటర్‌ నుండి ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించనున్నారు. 366రోజులంటే కరెక్ట్‌గా సంవత్సరానికి ఒక రోజు ఎక్కువే! ఏడాది పాటు ఇల్లు వాకిలి భార్యా బిడ్డలను, తన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన మనవరాలిని కూడా వదిలేసి ప్రజల మధ్య తిరగనున్నారు. 366రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 150రోజులు ప్రజల మధ్యనే పల్లెనిద్ర నిర్వహించనున్నారు. 303 సామూహిక సహపంక్తి భోజనాలు నిర్వహిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీ, మహిళ, యువత, విద్యార్థి, రైతులతో వాడవాడలా 1005 చోట్ల ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తారు. నియోజకవర్గంలోని ప్రతి స్కూలు, ప్రతి కాలేజీకి వెళతారు. విద్యార్థు లతో ముచ్చటిస్తారు. గుడి, మసీదు, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహిస్తారు. మత పెద్దల ఆశీస్సులు తీసుకుని వారి సూచనలు సలహాలు స్వీకరిస్తారు. పాదయాత్ర మధ్యలో ఇంట్లో శుభ కార్యాలకు, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుం టారు. ఈమధ్యలో ఎన్నికలొచ్చినా ప్రజాప్రస్థానం పాదయాత్ర నుండే వెళ్ళి నామినేషన్‌ వేస్తారు. ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయన 12వతేదీ మూలా పేట అరుంధతీయవాడకు వెళ్ళి 1005 మంది మహిళల ఆశీర్వాదం తీసుకున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు ఈ 14రోజుల పాటు కూడా ఆయన రూరల్‌లో వివిధ ప్రాంతాల ప్రజలను కలిసి ఆశీస్సులు తీసుకోనున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter