Friday, 13 April 2018 07:54

ప్రత్యేకహోదా కోసం లోకేష్‌ ప్రపంచ యాత్ర

Written by 
Rate this item
(0 votes)

galpikaఉండవల్లిలోని హైటెక్‌రత్న ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నివాసం... ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, జేసీ దివాకర్‌రెడ్డి, మురళీమోహన్‌, రామ్మో హన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, అశోక్‌ గజపతిరాజు, మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్పలు అక్కడ వున్నారు. మురళీమోహన్‌ వుండి... సార్‌, వైకాపా ఎంపీలు రాజీ నామాలు చేసి నిరాహారదీక్షకు కూర్చు న్నారు. ప్రత్యేకహోదా ఉద్యమం క్రెడిట్‌ వాళ్ళకు పోకుండా డైవర్ట్‌ చేయడానికి ఏదో ఒక మార్గం చెప్పండి, మమ్మల్ని రాజీనామాలు చేయమనకుండా అని అడిగాడు. అందుకు చంద్రబాబు... మీరు రాజీనామాలు చేస్తానన్నా నేను చేయ నివ్వనులే... మీరందరూ ప్రధాని నివాసం ముందు ధర్నాకు పోతున్నామని ప్రెస్‌కు చెప్పి బయలుదేరండి... ఈలోపు మన మీడియాలో దీని మీద వార్తలొస్తాయి. అలాగే ప్రధాని ఇంటి వద్ద టీడీపీ ఎంపీలకు ఉగ్రవాదుల నుండి పొంచి వున్న ముప్పు అని మన మీడియానే డప్పు కొడుతుంది. ఆటోమేటిగ్గా మీరు ధర్నా చేసే పని లేకుండానే పోలీసులు అరెస్ట్‌ చేసి మిమ్మల్ని మీ ఇళ్ళల్లో వదిలిపెడ తారు. అటు ధర్నాకు వెళ్లినట్లు ఉంటుంది, ఇటు మోడీ ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితి తప్పుతుంది. మీరు ధర్నాకు కూర్చుని అతన్ని రెచ్చగొడితే, దాని ప్రభావం నా మీద పడుతుంది అని చెప్పాడు. ఇంతలో 'అంబే' అనే అరుపు వినిపించింది. అందరూ అటువైపు చూసారు... 'మామగారు' సినిమాలో అడుక్కునే బాబూమోహన్‌లా ఓ వ్యక్తి చేతిలో బొచ్చె, ఇంకో చేతిలో కర్ర పట్టు కుని వున్నాడు. చంద్రబాబు కోపంగా... ఎవర్రా అడుక్కునేవాళ్ళను లోపలకు పంపించింది ఇంత సీరియస్‌గా మీటింగ్‌ జరుగుతుంటే అని అడిగాడు. ఈలోపు భువనేశ్వరీదేవి లోపల నుండి అన్నం గిన్నెతో వచ్చి అతని బొచ్చెలో అన్నం వేసింది. అప్పుడా వ్యక్తి మూతి మీద వున్న మీసం, బుగ్గ మీద వున్న పులిపిరి కాయ తీసాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అరె మా ఎంపీ శివప్రసాద్‌... అని ఒక్క సారిగా అన్నారు. ఏంటీ గెటెప్‌ అని చంద్రబాబు నవ్వుతూ అడిగాడు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు చివరి ప్రయత్నం సార్‌, ప్రత్యకహోదాను అడుక్కుంటున్నట్లు ఈరోజు ఈ వేషం కట్టాను అని చెప్పాడు. అంతలో అక్కడకు మంత్రి లోకేష్‌ వచ్చాడు. నాన్నారు మీరు ప్రత్యేకహోదా కోసం ఢిల్లీ యాత్ర చేసొచ్చారు కదా అని అడిగాడు. అవును అని చంద్రబాబు చెప్పాడు. హేమమాలిని ఆంటీని కలి సొచ్చారు కదా అని మళ్ళీ లోకేష్‌ అడి గాడు. అవును అని మళ్ళీ చంద్రబాబు చెప్పాడు. ప్రత్యేకహోదా కోసం నేను కూడా ఒక యాత్ర చేద్దామనుకుంటు న్నాను అని అన్నాడు. ఆ మాటకు చంద్రబాబు ఆనందంగా... రాష్ట్రమంతా పాదయాత్ర చేద్దామనుకుంటున్నావా... ఇప్పుడే మన మీడియాను పిలిపించి అనౌన్స్‌ చేయిస్తాను అని ఆత్రుతగా అడిగాడు. అది జగన్‌ లెవల్‌... నేను ప్రపంచ యాత్ర చేద్దామనుకుంటున్నాను. అది మన హైదరాబాద్‌ నుండే మొదలు పెడతాను అని లోకేష్‌ చెప్పాడు. ఆ మాటకు చంద్రబాబుకు ఏమీ అర్ధం కాలేదు. ప్రత్యేకహోదాకు ప్రపంచ యాత్రకు సంబంధమేంటని చంద్రబాబు అడిగాడు. దానికి లోకేష్‌ చిరాగ్గా... అందుకే మిమ్మల్ని సినిమాలు, సీరియల్స్‌, టామ్‌ అండ్‌ జెర్రీ, డోరేమాన్‌ వంటివి చూడమనేది. ఇంతవయసుకొచ్చాక కూడా మీకేమీ తెలియదు. ప్రపంచ యాత్ర అంటే ప్రత్యేకహోదా కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం. మీరు ఢిల్లీ వెళ్ళి హేమమాలిని ఆంటీని, అరవింద్‌ కేజ్రీవాల్‌ అంకుల్‌ను మాత్రమే కలిసారు. నేను మొదట హైదరాబాద్‌ వెళతాను, కేసీఆర్‌ అంకుల్‌, కేటీఆర్‌ బ్రదర్‌తో పాటు తమన్నా, అనుష్క, కాజల్‌, శ్రీరెడ్డి వంటి వారిని కలిసి వారి మద్దతు కూడగడతా, అలాగే ముంబై కెళ్ళి అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హాలను కలిసి ప్రత్యేకహోదాకు వారి మద్దతును సమీ కరిస్తా... ప్రత్యేకహోదా పత్రంపై వారం దరి చేత సంతకాలు చేయిస్తా! అలాగే అమెరికా వెళ్లి డోనాల్డ్‌ ట్రంప్‌, ఇవాంకా ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌, బిల్‌ క్లింటన్‌, బ్రిటన్‌కు వెళ్ళి థెరిస్సామే, గోర్డన్‌, రష్యాకు వెళ్ళి పుతిన్‌, గోర్బోచెవ్‌, జపాన్‌కు వెళ్ళి షింజో అబే, చైనాకు వెళ్ళి జిన్‌పింగ్‌, పాకిస్థాన్‌కు వెళ్ళి నవాజ్‌షెరీఫ్‌, శ్రీలంకకు వెళ్ళి రణిల్‌సింఘే, జర్మనీకి వెళ్ళి ఏంజెలా మోర్కెల్‌, ఇజ్రాయిల్‌కు వెళ్ళి నెత న్యాహు... ఇలా అన్ని దేశాలు తిరిగి అక్కడి పాలకుల మద్దతు సేకరించడమే కాక, హాలీవుడ్‌ తారలు మడోన్నా, పాప్‌ స్టార్‌ బ్రిట్నీ, ఏంజిలినా జూలి, కిమ్‌ కర్దాషైన్‌, జన్నీఫర్‌ లారెన్స్‌, ఆర్నాల్డ్‌, లియనార్డో డికాప్రియోల మద్దతు కూడ గడతాను. ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతు తెలిపితే ప్రధాని నరేంద్ర మోడీ చచ్చినట్లు దిగిరావాల్సిందే... ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని లాజిక్‌గా చెప్పాడు. ఆ మాటకు చంద్రబాబు నోరెళ్ళ బెట్టగా అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సార్‌, లోకేష్‌తో పాటు మేం కూడా ప్రపంచయాత్రకు పోతాం సార్‌, ఆయన పోరాట మార్గమే బాగుంది అని హుషారు చూపసాగారు. చంద్రబాబు తేరుకుని... ఎవరక్కడ అని కేకేసాడు. పి.ఏ పరుగెత్తు కుంటూ వచ్చాడు. మనం మొన్న స్వీడన్‌ నుండి ఒక్కోదానికి ఒకటిన్నర లక్ష ఖర్చు పెట్టి తెప్పించిన సైకిళ్ళు తెమ్మన్నాడు. పి.ఏ వెళ్ళి కొద్దిసేపటికి సైకిళ్ళు తెచ్చాడు. లోకేష్‌తో చంద్రబాబు... ప్రపంచయాత్ర తర్వాత ముందు సైకిల్‌యాత్ర మొదలు పెట్టు... ఏదో ఒక కార్యక్రమం చేసి నట్లుంటుంది... పనిలో పనిగా ఒంటికీ మంచిది అని టీవీ 10I5 = 105 ఛానెల్‌కు ఫోన్‌ చేసి మా లోకేష్‌ ప్రత్యేక హోదా కోసం సైకిల్‌ యాత్ర చేస్తున్నాడు. సెవెన్త్‌ పాస్‌ టెన్త్‌ ఫెయిల్‌ అయిన విలేకరి ఎవరన్నా ఉంటే పంపించండి... ఇం టర్వ్యూ చేయడానికి అని చంద్రబాబు చెప్పి పెట్టేసాడు.

్య్య్య్య్య

అమరావతి నుండి లోకేష్‌ సైకిల్‌ యాత్రను చంద్రబాబు పసుపు పచ్చ జెండా ఊపి ప్రారంభించాడు. లోకేష్‌ సైకిల్‌ తొక్కుతుండగా పక్కనే సైకిల్‌ తొక్కుతూ 10I5=105 విలేకరి పర బ్రహ్మం... ఢిల్లీలో జనసేన ఎంపీలు రాజీ నామాలు చేసి నిరాహారదీక్ష చేస్తున్నా రుగా... దీనిపై మీరేమంటారని అడి గాడు. దానికి లోకేష్‌... ఆ తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరా హారదీక్షకు కూర్చుంటే పోరాటం ఇంకా గట్టి పడుతుంది. తెలుగుదేశం ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు, లజ్జ వున్నా వెంటనే రాజీనామా చేసి నిరాహారదీక్షకు కూర్చోవా లని డిమాండ్‌ చేస్తున్నా అని చెప్పాడు. ఆ మాటకు అక్కడున్న తెలుగుదేశం ఎంపీలందరూ తల బాదుకుని ఇతనికి సైకిల్‌యాత్ర కాదు ప్రపంచ యాత్రే కరెక్ట్‌ అని కోరస్‌గా అన్నారు.

Read 69 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter