20 April 2018 Written by 

'చితి'కిపోతున్న చిన్నారి!

childఏదో అనుకుంటే.. ఇంకేదేదో అయిపోతున్నట్లుగా ఉంది మన దేశం పరిస్థితి. ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉంటుందనుకున్న దేశం కాస్తా..అరాచక భారత్‌గా తయారవుతోంది. ఇన్నాళ్ళకైనా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశిస్తే అది కూడా ఆశాభంగమైపోతోంది. చివరికి అడ్డూ అదుపు లేకుండా అరాచకాల దారిలో సాగిపోతోంది. దేశంలో ఎక్కడ చూసినా మానవ మృగాలు సంచరిస్తున్నాయి. ప్రతిరోజూ అరాచకాలు, అకృత్యాలు ప్రబలిపోతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, ఆపై హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

దేశంలో మహిళలకు, బాలబాలికల రక్షణకు ఎన్నో చట్టాలున్నా, మానవమృగాలు మాత్రం వాటిని కనీసం ఖాతరుచేయకుండా బరితెగింపు ధోరణితో అబలలపై తమ దౌష్ట్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చట్టాలు కొరడా ఝళిపించి కఠిన శిక్షలు విధించకుంటే మాత్రం.. దేశంలో అబలల ఆర్త నాదాలు తప్ప ఇక శాంతినాదాలు వినిపించవు. దేశంలో.. ప్రతి రాష్ట్రంలోనూ ఈ అత్యాచారాలు, అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కనీసం మానవత్వం కూడా లేని నరరూప రాక్షసులు అమాయకులైన చిన్నారులు, మహిళలను తమ అఘాయిత్యాలకు గురి చేస్తూ విక టాట్టహాసాలు చేస్తూనే ఉన్నారు. అయినా, పాలకులు మాత్రం ఎన్నికలని, రాజకీయాలని ఇంకా మరిన్ని పదవుల కోసం అర్రులు చాస్తూనే ఉంటున్నారే తప్ప దేశంలో జరుగుతున్న ఈ అకృత్యాలను నిరోధిం చేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో ఎక్కడబట్టినా రోజూ ఏదో ఒకచోట అఘాయి త్యాలు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే

ఉన్నాయి. ఇటీవల కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లలో బాలికలపై జరిగిన అత్యాచారాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్ర హోదగ్రులను చేస్తున్నాయి.

జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగింది. అక్కడి రసానా అనే చిన్న గ్రామంలో గుర్రాలను మేపుకునే ఒక సంచారతెగకు చెందిన బాలికపై మానవమృగాలు సామూహిక అత్యా చారానికి పాల్పడి, ఆ తర్వాత నిర్ధాక్షిణ్యంగా చంపివేశాయి. ఆ బాలిక కుటుంబానికి సన్నిహితులైన కొందరు బంధువులే ఈ పైశాచికత్వానికిి పాల్పడ్డారట!..ఎంత ఘోరం!...ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు స్థానిక పోలీసులు లంచం తీసుకుని కేసులో సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించడం మరెంతో దారుణం. ఆ బాలికపై జరిగిన అత్యాచార ఘటన ప్రజల్ని కంటతడిపెట్టించింది. కశ్మీర్‌నే కాక దేశవ్యాప్తంగా అది తీవ్ర ప్రకంపనలు పుట్టించింది. అయినా, ప్రధాని మోడీ ఆశించిన స్థాయిలో ఆ ఘటనపౖౖె స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదేవిధంగా, లక్నో-కాన్పూర్‌ మధ్య 'ఉన్నవ్‌' అనే నగరంలో ఓ అబలపై జరిగిన పాశవిక సంఘటన దేశప్రజల్ని కలచివేస్తోంది.

ఉద్యోగం కోసం అక్కడి బిజెపి ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌ నివాసానికి వెళ్తే, తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక యువతి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ఆమెకు న్యాయం జరిగేది తర్వాత సంగతి, ఆ తర్వాత ఆమె తండ్రి అనుమానాస్పద మృతి ఘటనతో బాధితురాలు మరింత తల్లడిల్లిపోయింది. ఈ సంఘటనలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా మరింత సంచలనమైంది. న్యాయం చేయమని మొరపెట్టుకుంటున్నా న్యాయం జరగని ఘోర పరిపాలనలో మనం ఉన్నామన్నమాట!..బాధితులను మరింతగా బాధపెట్టే విధంగా ఉన్న యోగి ఆదిత్యనాధ్‌ పాలన నిరంకుశపాలనగా ప్రజల్లో ముద్రవేసుకుం టోంది. దీంతో, మొత్తంగా బిజెపి పాలనపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో రాజనీతిజ్ఞులైన మోడీ, అమిత్‌షా వంటి అనుభవజ్ఞులకు తెలియనిది కాదు. కానీ, వారు కూడా ఇలాంటివాటిని చాలా తేలిగ్గా తీసుకోవడం వల్ల పార్టీకి మరింత నష్టం తప్పదు. మోడీ ఈ దేశాన్ని 'అత్యాచార దేశం'గా మార్చాడంటూ కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా బిజెపి పాలకులు పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తామే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఎవరికి వారు వ్యూహాలు రచించు కుంటున్నారే తప్ప, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఘోరాలను, నేరాలను, ముఖ్యంగా బాలికల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలను అణచి వేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో బిజెపి పాలనా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇలాంటి అఘాయిత్యాలే నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి సవాల్‌ విసురుతున్నాయి. కశ్మీర్‌లో ఒక బాలికపై మానవమృగాలు అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనతో దేశం అల్లకల్లోలంగా ఉంటే, తాజాగా మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఏడేళ్ళ చిన్నారిపై జరిగిన మరో ఘోరం దేశప్రజలను కలచి వేస్తోంది. పెళ్లి పందిరిలోంచి ఓ చిన్నారిని ఎత్తుకెళ్ళిన ఓ దుండగుడు..మద్యం మత్తులో అత్యాచారం చేసి ఆ చిన్నారిని హతమార్చిన ఘటన కలకలం రేకెత్తిస్తోంది. ఈ అత్యాచారాలతో దేశం అట్టుడికినట్లు

ఉడుకుతోంది. దేశంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైన సమయంలో ఆ మానవమృగాలను కఠినంగా శిక్షించకుండా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం మరింత ఘోరం. ప్రధాని మోడీ ఇలాంటి ఘటనల పట్ల వెంటనే స్పందించకపోవడం దేశప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.

మనదేశంలో మోడీ రాకతో హీరో పాలన వచ్చిందనుకున్నాం. అబలలు, మహిళలు, చిన్నారులు..ఎందరో ఇలా నరరూపరాక్షసుల అకృత్యాలకు బలైపోతున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఎలా?..మోడీ వెంటనే మౌనం వీడాలి. ఆ మానవమృగాల అంతుచూడాలి.. అబలలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు జనం. అయినా, పాలకులంటే ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలేగానీ.. ఏమి జరుగుతున్నా పట్టించుకోకుంటే అది హీరో పాలన కాదు.. 'నీరో' పాలనే అవుతుంది. ఇకనైనా కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగాలి!.. దేశంలో ఇలాంటి అకృత్యాలకు, అత్యాచారాలకు వెంటనే చరమగీతం పాడాలి!..Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter