27 April 2018 Written by 

మెట్టలో గట్టెక్కేదెట్లా?

karunuvనెల్లూరు విభిన్న జీవన విధానాల సమూహం. ఈ జిల్లాలో తూర్పు ప్రాంతం గ్రామాలకు వెళితే పచ్చటి పైర్లు... నిటారుగా పెరిగిన కొబ్బరిచెట్లు... నీళ్ళతో కళకళలాడే కాలువలు... అచ్చం కోనసీమను తలపించేలా వుంటుంది వాతావరణం. ఇక గ్రామాలలో చూస్తే పేరుకు పల్లెటూర్లు అయినా అన్నీ మిద్దెలే. ఎక్కువ శాతం మంది ఆస్తిపరులే. ప్రతి ఇంట్లో కారు, కనీసం బైక్‌... విలాసవంతమైన జీవితం. మరి పడమర పల్లెల్లోకి వెళితే బీడుబారిన భూములు, ఎండిపోయిన పైర్లు, ఇంకిన బావులు, బొంతరాళ్ళతో కట్టిన ఇళ్ళు, బీటలు వారిన కాలువలు... ఇదీ పరిస్థితి. పడమర ప్రాంతమైన ఉదయగిరి చుట్టుపక్కల మండలాలకు వెళితే ఈ రోజుకీ మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది.

నెల్లూరుజిల్లాలో ఎక్కువుగా వలసలు పోయే ప్రాంతం ఏదన్నా వుందంటే అది ఉదయగిరి ప్రాంతమే. ఈ ప్రాంతం వాసులు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో వుంటారు. అంతెందుకు నెల్లూరు నగ రంలో సైతం ఈరోజు ఈ ప్రాంతవాసులే అధికం. ఇక్కడ ప్రతిఏటా నెలకొనే కరువు కాటకాలు, నీళ్ళు లేక వ్యవసాయ పనులు తగ్గిపోవడం, ఉపాధి పరంగా ప్రత్యా మ్నాయ మార్గాలు లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఉదయగిరి, సీతారాంపురం, కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, మర్రిపాడు వంటి మండలాల నుండి పెద్దఎత్తున వలసలు పోతుంటారు.

ఈ కరువు ప్రాంతంలో వలసలను నిరోధించడానికి, వ్యవసాయానికి ప్రత్యా మ్నాయంగా ఉపాధి మార్గాలు చూపించ డానికి ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలేదు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి జరిగినా అదంతా కూడా తూర్పు ప్రాంతానికే పరిమితమైపోయింది. ఈ ప్రాంతంలో కనీసం వందమందికిఉద్యోగాలిచ్చే పరిశ్రమ ఒక్కటీ లేదు.

''అంగట్లో అన్నీ వున్నా అల్లుడినోట్లో శని'' అన్నట్లు సోమశిల నుండి 200 కిలోమీటర్ల దూరంలో వున్న చెన్నైకు నీళ్ళు పారుతుంటాయి. గట్టిగా పాతిక కిలోమీటర్ల దూరంలో కూడా లేని ఈ మెట్ట మండలాలకు సోమశిల నీళ్ళుం డవు. కారణం ఇది ఎత్తు ప్రాంతం కావడం. వెలుగొండ ప్రాజెక్ట్‌ పూర్తయ్యుంటే ఈ మెట్ట ప్రాంతం కొంతవరకన్నా కరువు కోరల నుండి బయటపడి వుండేది. వైయస్సే ఉండుంటే వెలుగొండ పూర్తై ఈ ప్రాంత రూపురేఖలు మారివుండేవి. ఆయన మరణం ఈ ప్రాంతానికి శాపంగా మారిందని చెప్పవచ్చు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా వున్న ఆనం రామనారాయణరెడ్డి సోమశిల నుండి ఈ ప్రాంతానికి సోమశిల హైలెవల్‌ కెనాల్‌ను మంజూరు చేయించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఈ పనుల్లో ఊపులేదు. ఈ కెనాల్‌ పూర్తయినా పెన్న నీళ్ళు అంది ఈ ప్రాంతపు నేలలకు నీళ్ళందుతాయి. వ్యవసాయ పరిస్థితులు మెరుగుపడతాయి.

ఎండాకాలం వచ్చిదంటే ఈ మండ లాలలో తాగునీటి సమస్యలు తలెత్తుతాయి. గత ఏడాది వర్షాలు లేవు. చెరువులు, బావులు నిండ లేదు. భూగర్భ జలాలు పెరగలేదు. అరకొర వర్షాలు పడినా ఇంత కాలం తాగునీళ్ళకు ఇబ్బంది లేకుండా నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఎండలు ముదిరి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఉదయగిరి పల్లెల్లో అప్పుడే నీటిఎద్దడి ఛాయలు కనిపిస్తున్నాయి. సాగునీళ్ళు అంటే ఎలాగూ ఇవ్వడం లేదు. కనీసం తాగునీళ్ళ సమస్యైనా ముందస్తు జాగ్రత్త చర్యలతో తీర్చాల్సివుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter