Friday, 27 April 2018 07:25

నెల్లూరు నగరంలో... జన సేవకుడి వైపు జనసేన చూపు

Written by 
Rate this item
(0 votes)

msrప్రస్తుత రాజకీయాలలో ముఖ్యంగా నవ్యాంధ్ర రాజకీయాలలో, మరీ ముఖ్యంగా నెల్లూరుజిల్లా రాజకీయా లలో రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకపాత్ర పోషించనున్న పార్టీ ''జనసేన''. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా..? అన్న విషయం పక్కనపెడితే జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ప్రభావం ప్రక్క పార్టీల గెలుపు ఓటములను తేల్చగలదన్నది కాదనలేని సత్యం.

రాజకీయాలలో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న జనసేన అభ్యర్థుల విషయంలో తప్పుటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం చాలావుంది. జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ అగ్రజుడు మెగాస్టార్‌ చిరంజీవి దగాపడింది అభ్యర్థుల ఎంపికలోనే. పూర్తిస్థాయిలో చిరంజీవి విఫలమయ్యింది కూడా అక్కడే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పార్టీ స్థాపించి కనీసం రెండు పదుల సీట్లు కూడా పొందలేకపోవడం చిరంజీవి రాజకీయ అనుభవ రాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యం. అలాంటి క్లిష్ట సమయంలో కూడా నెల్లూరులో ప్రజారాజ్యం గెలిచిందంటే ఇక్కడ చిరంజీవికి అతని కుటుంబానికి నెల్లూరుతో వున్న సాన్నిహిత్యం, నెల్లూరీయులతో వున్న అనుబంధం కొంత ఉపయోగపడిందన్నది ఎవ్వరూ ఖండించలేని వాస్తవం.

ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ కూడా నెల్లూరుపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వినికిడి. ఇప్పటికే రాజకీయాలలో వున్న వ్యక్తులని కాకుండా, రాజకీయాలకు పూర్తిగా కొత్తవారై వుండి సేవారంగంలో చిరపరిచితులై వుండాలన్న కోణంలో అభ్యర్థుల వేట కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి స్వార్ధం, స్వలాభం లేకుండా తనకున్న ఆర్ధిక బలం, అంగ బలాన్ని ప్రజాసేవకు ఉపయోగించే యువతరం కోసం ఆ పార్టీ చూస్తోందన్నది సర్వత్రా వినిపిస్తున్న వార్త.

ఈ క్రమంలో నెల్లూరు నగరంలో వారి దృష్టి మాగుంట శరత్‌చంద్రారెడ్డిపై పడ్డట్లు తెలుస్తోంది. జనసేన ద్వారా తన ఇమేజ్‌ని పెంచుకుంటూ మరో వైపు మాగుంట సుబ్బరామరెడ్డి స్ఫూర్తితో ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ సేవకేదీ కాదు అనర్హం అన్నట్లు ప్రజోపయోగ కార్యక్రమమేదైనా తానున్నానని ముందుకొస్తున్న శరత్‌చంద్రారెడ్డి ఇప్పుఢు జనసేన పార్టీకి ఆకర్షణగా నిలిచాడని వార్త. 10వ తరగతి ఇంటర్మీడియట్‌ పిల్లల పరీక్షల సమయంలో విద్యార్థినీ విద్యార్థులకు వారి తల్లితండ్రులకు ఉచిత బస్సు వసతిని కల్పించడం, తమ చిన్నారులు పరీక్షలు రాస్తుంటే వారి కోసం నిరీక్షించే అమ్మానాన్నలకు షామియానాల ద్వారా నీడను కల్పించడం, ఆకలితో అలమటించే పేద కుటుంబాలను ఆదుకోవడం, ప్రతియేటా తన జన్మదినం రోజున వందల యూనిట్ల రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం, చీరలు అందజేయడం, వేలమందికి భోజన సదుపాయాలను సమకూర్చడం వంటి సేవా కార్యక్రమాలతో తానో యువసేనా నక్షత్రంలా మెరుస్తున్నాడు శరత్‌చంద్రారెడ్డి.

కేవలం సేవకే అంకితం కాకుండా సామాజిక స్పృహతో సమాజం పట్ల మన కున్న బాధ్యతలను గుర్తు చేస్తూ ''మన ఊరు మన బాధ్యత'' అంటూ ట్రాఫిక్‌ నియంత్రణ ప్రచారం, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే ''ప్రత్యేకహోదా'' లాంటి ఉద్యమ కార్యక్రమాలను సైతం శరత్‌ చంద్రారెడ్డి తన సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది.

అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలతో పాటు మానసిక వికలాంగుల సంక్షేమ కేంద్రాలలో సైతం మానవీయతను చాటుతూ తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మాగుంట శరత్‌చంద్రారెడ్డి సేవాసమితి.

అక్షరాలా ఇలాంటి జనసేవకుల కోసమే జనసేన వెదుకుతోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా దయార్ధహృదయంతో సమాజసేవ చేసే శరత్‌చంద్రారెడ్డి వంటి యువత కోసం ప్రయత్నిస్తోంది జనసేన పార్టీ. ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు 'శరత్‌చంద్రారెడ్డి' పుట్టుపూర్వోత్తరాలను సేకరించి ఆ కుర్రోడు చేసిన చేస్తున్న చేయబోతున్న సేవా కార్యక్రమాలను పవన్‌కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్ళినట్లు పవన్‌ మిత్రలు కొందరు చెప్తున్నారు.

యువతను చెడుదోవ పట్టనీయకుండా వారికి సామాజిక స్పహను, సమాజం పట్ల వారి బాధ్యత లను గుర్తుచూస్తూ సేవా కార్యక్రమాలవైపు వారి దృష్టిని మరలిస్తూ నేటితరానికి కొత్త భాష్యం చెప్తున్న శరత్‌చంద్రారెడ్డి వంటి జనసేవకులు ఇప్పుడు జనసేనకు కూడా అవసరమే మరి. జన సేవకు బలం, గళం, జీవం ధైర్యం... ఇలాంటి యువ నాయకులే. వేచిచూద్దాం... ఏం జరగబోతుందో...?

Read 293 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter