27 April 2018 Written by 

27-04-2018 రాశిఫలాలు

rasi 27

1Ariesమేషం

ప్రభుత్వ కార్యాలలో పనులు వాయిదా పడవచ్చును. ప్రయాణాల విషయంలో ముందు వెనుకలు ఆలోచిస్తారు. స్థిరాస్తులపై ఆదాయం, షేర్ల వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలుంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఉద్యో గార్ధులకు చిన్న అవకాశాలుంటాయి. అనుకున్న పనులు శ్రమతో సాగిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలలో ఇబ్బం దులు అధిగమిస్తారు. అనుకోని ఖర్చులు పైనబడగలవు.

 

2Taurusవృషభం

వృత్తిపరంగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరకవచ్చును. అనుకున్న పనులు సమర్ధ వంతంగా జరుపుతున్నా అప్పుడప్పుడు టెన్షన్‌ పడుతుం టారు. మీ వ్యక్తిత్వానికి మంచి విలువ గౌరవముంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం సంతృప్తికరం. శరీరానికి గాయాలు తగలవచ్చును.

 

3Geminiమిధునం

ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు లభించగలవు. విద్యార్థులకు చదువు శ్రద్ధ తగ్గి, వ్యాప కాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వ్యవహారాలను జాగ్రత్తగా నడపటానికి, మాటతీరు, తొందరపాటు తగ్గించుకొనడం మంచిది. వ్యాపార వర్గా లకు సామాన్య ఆదాయం ఉంటుంది. కొన్ని మంచి అవకాశాలు వ్యాపార వర్గాలకు చేజారిపోవచ్చును.

 

4Cancerకర్కాటకం

సహచరులను ఆదుకొనడం, బంధుముఖ్యుల అనా రోగ్య వార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయ త్నాలలోనున్న వారికి చిరు అవకాశాలు దొరకగలవు. భూములు, ఇండ్ల స్థలాలు కొనుగోలు ఆలోచన, ప్రయ త్నాలుంటాయి. ముఖ్యమైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త పరచుకొనాలి. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెడతారు. షేర్లు స్వల్ప లాభాలనందిస్తాయి.

 

5Leoసింహం

వ్యాపార భాగస్వామ్యాలు దొరకడం జరుగుతుంది. పనులందు టెన్షన్‌ ఉంటుంది. ఉద్యోగులు సమర్ధవం తంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకా శాలు దొరుకుతాయి. అనవసర వ్యవహారాలలోకి లాగ డానికి ఇతరులు ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్త పడండి. విద్యా ప్రగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్య తలు పెరిగి తీరక లేకుండా శ్రమపడతారు.

 

6Virgoకన్య

బిడ్డల ఉద్యోగ వివాహాల ప్రయత్నాలు ఫలించ గలవు. అనుకోని ప్రయాణాలు, ప్రముఖులను, ఆత్మీ యులను కలుసుకొనడం జరుగుతుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. సమావేశాలలో మీ సూచనలకు ఆమోదం లభిస్తుంది. ఆర్ధికావకాశాలకు ఆఫర్లు లభి స్తాయి. ఆస్తి వ్యవహారాలు, బాకీ వ్యవహారాలు ఒక సర్దు బాటుకు వస్తాయి. షేర్లు లాభాలనిస్తాయి.

 

7Libraతుల

కుటుంబసభ్యులతో సామరస్య ధోరణిలో నడుచు కొనండి. సోదరీ సోదర వర్గాలకు మంచి జరుగుతుంది. వర్కర్లతో యజమానులకు సమస్యలు ఏర్పడవచ్చును. అనుకోని ఆదాయం వస్తు ధన రూపంలో లభించగలదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చిన్న అవకాశాలు దొరక గలవు. అనవసర వివాదాలలో తలదూర్చకుండా జాగ్రత్త పడండి. వ్యాపార వర్గాలకు ఆదాయం పెరుగుతుంది.

 

8Scorpioవృశ్చికం

పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు పాటించండి, మేలు జరుగుతుంది. ఆరోగ్యం స్వల్పంగా లోపించి బాధ పడతారు. ఉద్యోగులకు స్థానమార్పులు, ప్రమోషన్లు వంటివి వస్తాయి. విద్యార్థులకు మంచి ప్రగతి ఉం టుంది. ప్రముఖులతో పరిచయాలు, ఎదుటి వారి సలహాల వల్ల మేలు జరగడం ఉంటుంది.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది మరియు అధికారుల అభీష్టాలకు అనుగుణంగా నడుచుకొనవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసులు, ఆస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. సాహిత్య, కళా, క్రీడా రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఎదుటి వారి ప్రలోభాలకు, ఆశలకు లొంగవద్దు.

 

10Capricornమకరం

అధికారులకు ప్రమోషన్లు, స్థాన చలనం ఉం టుంది. స్థిరాస్తులు, షేర్లపై లాభాలుంటాయి. శుభ కార్యాలు నిర్ణయం చేస్తారు. దూర ప్రయాణాలుంటాయి. ఓర్పు, లౌక్యంతో పనులు సాధించగలరు. సోదర వర్గా నికి మేలు జరుగుతుంది. చిన్న విషయాలపై ఇంట్లో వారితో తగాదాలు రావచ్చును. ఆరోగ్యం బాగుంటుంది. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

కాంట్రాక్టులు, లీజులు పొడిగింపబడటం, ప్రభుత్వ అనుమతులు దొరకడం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్ర వర్గాలు యధోచిత సహాయం అందిస్తారు. అధికారులకు స్థానమార్పు, ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరకడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. క్రొత్త వస్తువులు కొనడం, అను కోని ప్రయాణాలుంటాయి.

 

12Piscesమీనం

దూర ప్రయాణాలుంటాయి. శరీర శ్రమ, విశ్రాంతి లేకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా వుండదు. ఉద్యోగావ కాశాలు లభించగలవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో సమర్ధత, అధికారులతో చనువు లభిస్తుంది. విలువైన వస్తువులు, గృహోపకరణాలు కొంటారు. యజమానులకు వర్కర్లతో సమస్యలుంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆర్ధిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter