04 May 2018 Written by 

04-05-2018 రాశిఫలాలు

rasi 27

1Ariesమేషం

దైవ సేవ కార్యాలలో పాల్గొంటారు. శరీరానికి గాయాలు తగలకుండా జాగ్రత్తపడాలి. ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు, పని భారం అదనంగా ఉం టుంది. ప్రయాణాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుం టుంది. విద్యావృద్ధి కలదు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం బాగుండి ఆదాయం పెరుగుతుంది. త్రోసి పుచ్చలేని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.

 

2Taurusవృషభం

ఉద్యోగులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్త పడండి. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసికొనలేని పరిస్థితులుండవచ్చును. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అనవసర విషయాల జోలికి పోవద్దు. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆర్ధిక సమస్యలతో పాటు బయట వ్యవహార వత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల వల్ల శ్రమ ఉంటుంది.

 

3Geminiమిధునం

సభలు సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేసుకొనాలి. ఆరోగ్యం ఫరవా లేదు. అధికారులకు స్థానమార్పు, ఉద్యోగులకు ఇతర బాధ్యతలు రావడం జరుగుతుంది. విద్యా ప్రగతి బాగుం టుంది. ఉద్యోగార్ధులకు కొంత మేలు జరుగుతుంది. ఇంట్లో వారితో భేదాభిప్రాయాలు రాకుండా చూచు కొనాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడవచ్చును.

 

4Cancerకర్కాటకం

అధికారులకు పెరిగిన బాధ్యతల వల్ల శ్రమ, ఉద్యోగులకు కార్యసామర్ధ్యం బాగుంటుంది. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చవద్దు. వైద్య సాంకేతిక రంగాల వారికి గౌరవ గుర్తింపులుంటాయి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. వృత్తి వ్యాపా రాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగుతుంది. వస్తు, వాహన రిపేర్ల ఖర్చులుంటాయి.

 

5Leoసింహం

పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. అధికారు లకు పెరిగిన బాధ్యతల వల్ల శ్రమ, ఉద్యోగులకు కార్య సామర్ధ్యం బాగుంటుంది. మీకు సంబంధంలేని విషయా లలో తలదూర్చవద్దు. వైద్య సాంకేతిక రంగాల వారికి గౌరవ గుర్తింపులుంటాయి. ధర్మ, దైవ కార్యాలకు సహాయమందిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి.

 

6Virgoకన్య

టెండర్లు, ఏజన్సీలు లభించే అవకాశమున్నది. ఉపాధి, మార్కెటింగ్‌ రంగాల వారికి అభివృద్ధి బాగుం టుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. పెళ్ళి ప్రయ త్నాలు చేసేవారికి అనుకూల కాలం. కొత్త పరిచ యాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని భారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు పెరిగి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

 

7Libraతుల

సమస్యలు పెండింగ్‌లోనున్నవి పరిష్కారం కాగలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. అనుకోని ధన, వస్తు లాభం ఉండవచ్చును. బంధు మిత్రు లతో ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. విద్యాప్రగతి బాగుంటుంది. మంచి ఆర్ధికావకాశాలు, ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం తృప్తికరము.

 

8Scorpioవృశ్చికం

వాహనాలు నడిపేవారు యంత్రాలతో పనులు చేసేవారు జాగ్రత్తగా మెలగాలి. చిన్నచిన్న పొరపాట్ల వల్ల మాటలు పడవలసిరావచ్చును. శుభకార్య ప్రయ త్నాలు ఫలించకపోవచ్చును. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి. సభలు, సేవా కార్యాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి.

 

9Sagittariusధనుస్సు

బంధువర్గంతో ఏదో ఒక రూపంలో విభేదాలు రావచ్చును. విద్యా కృషి బాగుంటుంది. గృహ వస్తు వాహన రిపేర్లపైన, ఆరోగ్యానికై ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఉద్యోగుల సమర్ధతకు సరైన గుర్తింపు లభించదు. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

10Capricornమకరం

పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు ప్రస్తుతానికి విరమిం చండి. ఉద్యోగుల విధి నిర్వహణ సాఫీగా సాగుతుంది. అనుకోని ప్రయాణాలు బంధుమిత్రులను కలుసుకొనడం జరుగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. కొన్ని అనవసర ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. వ్యవ హారాలు, పనుల వల్ల తీరిక ఉండదు.

 

11Aquariusకుంభం

ప్రభుత్వ పర్మిషన్లు, బ్యాంకులోన్లు పొందుతారు. అనవసర విషయాలలో జోక్యం చేసికొనవద్దు. పెట్టు బడులకు అనుకూలం. ఉద్యోగులకు పనిభారం పెరిగినా అధికారుల ఆదరణ బాగుంటుంది. విద్యార్థుల కృషి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఆర్ధికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలు బాగుండి, ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి.

 

12Piscesమీనం

బంధుమిత్రులను కలుసుకొంటారు. కుటుంబ సౌఖ్యం బాగున్నది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలకు ఇత రుల సహకారం ఉంటుంది. విద్యా ప్రగతి బాగుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెట్టుబడులకు పొదుపు పథకాలకు ప్రయత్నాలు చేస్తారు. ఆదాయానికి లోపం రాదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఫలించగలవు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter