14 May 2018 Written by 

నిప్పుకు నోటు ముప్పు

cm'నిను వీడని నీడను నేనే' అంటూ నిప్పులాంటి వాడినని చెప్పుకునే చంద్రబాబును 'ఓటు-నోటు' కేసు వెంటాడుతోంది. మూడేళ్ళుగా వివిధ మలుపులు తిరుగుతున్న ఈ కేసు మళ్ళీ తెరమీదకొచ్చింది. 'మనవాళ్ళు బ్రీఫ్డ్‌మి' అన్న తియ్యని స్వరం చంద్ర బాబుదేనని చంఢీఘర్‌ ఫోరెన్సిక్‌ నిపు ణులు తేల్చిన నేపథ్యంలో ఇక కేసు విచారణకు ముందుకు తీసుకెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇందుకోసమే తెలంగాణ ముఖ్య మంత్రి ఆ రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి తోనూ, ఏసిబి డిజిపి ఏ.కె.ఖాన్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమై ఈ కేసు విష యంపై చర్చించడం జరిగింది.

కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేటెడ్‌ ఎమ్మెల్సీ స్టీఫెన్‌ సన్‌ కొనుగోలుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు. మధ్యవర్తుల ద్వారా ఆయనతో బేరం కుదిర్చారు. అప్పుడు తెలుగు దేశంలో వున్న రేవంత్‌రెడ్డి బ్యాగ్‌లో 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి స్టీఫెన్‌సన్‌కు ఇచ్చాడు. అదే సమయంలో చంద్రబాబు ఫోన్‌లో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడాడు. ఇదంతా కూడా ఓ మీడియా సంస్థ వద్ద నుండి తీసుకున్న ఎక్విప్‌మెంట్‌తో పక్కాగా రికార్డ్‌ చేసిపెట్టారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తున్న వీడియో చిత్రాలు, చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన వాయిస్‌ రికార్డ్‌ను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. దీనిపై చాలాకాలం పెద్ద దుమారమే రేగింది. చంద్రబాబు తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేసారంటూ తన

తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి కూడా సిద్ధమయ్యాడు. ఈ కేసులో రేవంత్‌రెడ్డిని జైలుకు కూడా పంపడం, బెయిల్‌పై ఆయన బయటకు రావడం జరిగింది. చంద్రబాబు మీద కూడా కేసు నమోదు చేస్తారని, ఆయన జైలుకు పోతారని, కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక తప్పదని ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పుడు కేంద్రమే జోక్యం చేసుకుందో, లేక రాజ్యాంగ శక్తులెవరన్నా మధ్యస్థం చేసారో గాని తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబుకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. మద్యస్థంలో భాగంగా చంద్రబాబు హైదరాబాద్‌లో మనకు రావాల్సిన ఆస్తులను, హైదరాబాద్‌పై పదేళ్ళ పాటు మనకున్న హక్కులను అన్నింటిని వదిలేసుకుని కృష్ణ కరకట్టకు వచ్చేసాడు.

ఇప్పుడు ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన వాయిస్‌ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తున్న దృశ్యం సజీవ సాక్ష్యంగా వుంది. ఈ కేసును నీరుగార్చి చంద్రబాబును కాపాడాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. గతంలో కాపాడుదామనుకున్న కేంద్రప్రభుత్వాన్ని చంద్రబాబు శత్రువుగా చేసుకున్నాడు. కర్నాటక ఎలక్షన్‌లలో కలబెట్టి చంద్రబాబు అనవసరంగా బీజేపీతో కయ్యానికి కాలు దువ్వాడు. కాబట్టి కేంద్రం ఒత్తిడి ఎలాగూ వుంటుంది. తనపైకి ఒంటి కాలిమీదకు లేస్తున్న ప్రస్తుత కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డికి ముకుతాడు వేయాలంటే ఈ కేసును మరింతగా బిగించాల్సిన పరిస్థితి కేసీఆర్‌ ముందుంది. కాబట్టి ఆయన ఈ కేసు విషయంలో పి.వి.నరసింహరావు సూచించిన 'చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అనే సిద్ధాంతాన్ని పాటించక తప్పదు. అలా చట్ట ప్రకారం వెళితే చంద్రబాబును చక్రబంధంలో ఇరికించినట్లే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter