14 May 2018 Written by 

కన్నడ నాట.. ఓట్ల ఆట

karnatakaఈ నెలలో జరుగనున్న కర్నాటక ఎన్నికలు ప్రధాన పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. చివరికి ఫలితాలు ఎలా ఉంటాయి?.. అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ ఇదే. ఈ ఎన్నికలు జాతీయస్థాయిలో ప్రభావం చూపుతాయి కనుక, ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటాయా?.లేదా బిజెపికి పట్టం గడతాయా?.. అన్న ఊహాగానాలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు సెమీఫైనల్స్‌గా, రానున్న లోక్‌సభ ఎన్నికలు ఫైనల్స్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కర్నాటకలో గెలుపు.. రేపటి విజయానికి మలుపు అన్నట్లుగా ఆయా పార్టీలు, రాజకీయవర్గాలు భావిస్తూ ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. అయినా.. ఎవరి ఊహాగానాలు వారి అన్నట్లుగా దేశవ్యాప్తంగా అటు రాజకీయవర్గాల్లోనే కాక, సామాన్య జనంలోనూ కర్నాటక ఎన్నికల ఫలితాల మీదనే ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి, జేడిఎస్‌ పార్టీలదే ప్రధాన పాత్ర. ఈ పార్టీల నాయకులంతా ఎన్నికల రణరంగంలో ఆరితేరిన యోధులే. ఎవరూ ఎవరికీ తీసిపోరు. ఎత్తులకు పైఎత్తులు, వ్యూహరచనల్లో ఎవరికి వారే ఘనాపాటీలు. తామే గెలుస్తామంటూ ఎవరికి వారు ధీమాగా పోటీ పడుతూ ఈ మండే ఎండల్లో అలుపూ సొలుపూ లేకుండా మొన్నమొన్నటిదాకా భారీగా ప్రచార యుద్ధాలు చేశారు. ఓట్లు రాబట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికల ప్రణాళికల్లో ప్రజలకు రక రకాల వాగ్దానాలు కుమ్మరించారు. ప్రజల ఓట్ల కోసం, అత్యధికంగా ఉన్న లింగాయత్‌ల ఓట్ల కోసం ఆయా పార్టీల వారు ఎవరికి వారు రాజకీయ వ్యూహా లతో పెద్దఎత్తున ప్రచారాలు చేసుకున్నారు కూడా. బిజెపి తరఫున రంగంలోకి దిగిన ప్రధాని మోడీ, అమిత్‌షాలు కాంగ్రెస్‌ తీరుపై మండిపడుతూ ముమ్మ రంగా ప్రచారాలు చేశారు. కర్నాటక అంతా సుడి గాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్‌ను ఓడించాలంటూ ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్‌ది విభజించి పాలించే రాజకీయమని, తమది ప్రజాసంక్షేమం కోసం దేశభక్తితో దేశాన్ని పాలించే విధానమని మోడీ స్పష్టం చేశారు. కర్నాటకలో గెలుపు తమదేనని ఆయన ధీమాగా ఉన్నారు. అంతేకాక, ప్రస్తుత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గ సభ్యుల్లో అవినీతి ఆరోపణలకు గురికాని మంత్రి ఒక్కరూ లేరంటూ మోడీ తన ప్రసంగాల్లో దుయ్యబట్టారు. సమాజాన్ని చీల్చి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్‌ తాపత్రయపడుతోందని, ఎట్టి పరిస్థితిలోనూ కర్నాటకలో కాంగ్రెస్‌ గెలవదని అన్నారు. రాహుల్‌ తమను గెలిపిస్తాడని కాంగ్రెస్‌పార్టీ నేతలకు కూడా నమ్మకం లేదన్నారు. వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్‌ దేశాన్ని నాశనం చేసిందంటూ మోడీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మరోవైపు సిద్ధరామయ్య తరఫున కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ చాలాకాలం తర్వాత మళ్ళీ ఈనెల 8న ఎన్నికల ప్రచారసభలో పాల్గొనడంతో కాంగ్రెస్‌వర్గాల్లో ఉత్సాహం రేకెత్తింది. ఈ సందర్భంగా మోదీ పాలనాతీరును సోనియాగాంధీ తీవ్రంగా విమర్శించారు. మోడీ మాటల గారడీ తప్ప ఈ నాలుగేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ లేని భారత్‌ను మోడీ కోరుకుంటున్నారని, అయితే ఒక్క కాంగ్రెసే కాదు, తనకు ఎదురుగా ఎవరున్నా మోడీ సహించలేరని ఆమె విమర్శించారు. అవినీతి నిర్మూలనకు

ఉద్దేశించిన లోక్‌పాల్‌ బిల్లు ఏమైందని సోనియా ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల కంటే కర్నాటకకు చాలా తక్కువ నిధులిస్తూ సహాయ నిరాకరణ చేసినందుకు ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలంటూ ఆమె పెద్దఎత్తున ప్రచారం సాగించారు. సోనియా ప్రచారానికి రావడంతో కాంగ్రెస్‌శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తింది.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్నాటకలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. కర్నాటక ఎన్నికలు స్వచ్ఛ రాజకీయాలకు, మురికి రాజకీయాలకు మధ్య సమరమన్నారు. ముఖ్యంగా మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దనరెడ్డి బృందాన్ని బిజెపి ఎన్నికల బరిలోకి దింపడాన్ని రాహుల్‌ సూటిగా ప్రశ్నించారు. వేలకోట్లరూపాయల ఇనుప ఖనిజాన్ని దోచుకున్న గాలి సోదరుల కోటాలో కొంతమందికి బిజెపి టిక్కెట్లు ఇవ్వడం ఏమి టని రాహుల్‌ ప్రశ్నించిన తీరు బిజెపిలోని అసంతృప్తి వాదులను సైతం ఆలోచింపజేసిందనడంలో అతి శయోక్తి లేదు. అవినీతి, కుంభకోణాల నేతలను బిజెపి రంగంలోకి దించిందంటూ రాహుల్‌ బిజెపిని ఎద్దేవా చేయడమే కాక, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లు సాధిస్తే ప్రధాని అయ్యేందుకు తాను సిద్ధమని రాహుల్‌ మరోసారి స్పష్టం చేయడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచిఫలితాలు సాధిస్తే కాబోయే ప్రధానిని తానేనంటూ రాహుల్‌ ధీమా వ్యక్తం చేయడం కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తేజపరుస్తోంది. మళ్ళీ మోడీ ప్రధాని కావడం కల్ల అని, విపక్షాలన్నీ కలిసి బిజెపి ఓటమికి గట్టిగా కృషిచేస్తున్నాయని రాహుల్‌ ఆశాభావంతో ఉన్నారు. ఇలా.. ఇరుపార్టీలవారు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ... ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరిపోసుకుంటూ ప్రచారం గడువు ముగిసేదాకా ప్రచారాలు సాగించారు. మరోవైపు అదే సందర్భంలో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం కూడా సాగిపోయిందని, ఎన్ని కోట్లు ఖర్చయినా సరే తాము గెలిచి తీరాలంటూ బలమైన అభ్యర్థులంతా డబ్బు ఖర్చుకు వెనుకాడలేదనే ఆరోపణలు కూడా సర్వత్రా వెల్లువెత్తాయి. ఇదిలావుంటే, కాంగ్రెస్‌-బిజెపిలపై విసుగెత్తిన ప్రజలు తమనే గెలిపిస్తారని జేడీఎస్‌ ఆశాభావంతో ఉండడం కొసమెరుపు. ఎట్టకేలకు ప్రచార హోరు జోరుగానే ముగిసింది. పోలింగ్‌ తేదీ సమీపించడంతో ఇక ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఈ నెల 12న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 224 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఎలా ఉందో తేలనుంది. ఈనెల15న ఫలితాలు వెలువడే దాకా ఆయా పార్టీల అభ్యర్థుల అదృష్టాదృష్టాలు ఎలా ఉన్నాయో.. ఓటర్లు ఏ పార్టీకి విజయం అందిస్తారో..ఎవరిని అందలం ఎక్కిస్తారో వేచిచూడాల్సిందే!...Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter