14 May 2018 Written by 

బీదకు... కత్తిమీద సాము!

beedaనెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్ష పదవి అంటే ఎవరికైనా కత్తిమీద సాములాంటిదే! ఈ పదవిలో రాణించాలంటే అలివయ్యే పని కాదు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు మూడు పర్యాయాలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాడు. ఆ కాలంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రాజకీయంగా అనుభవం వున్నోడు కాబట్టి కష్టంగానైనా నెట్టుకొచ్చాడు.

2014 ఎన్నికలకు ముందే బీద రవిచంద్రకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రెడ్ల డామినేషన్‌ వుండే జిల్లా ఇది. బీద రవిచంద్ర బలహీనవర్గాలకు చెందిన నాయకుడు. అయినా కూడా అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడిదాకా బాగానే నెట్టుకొచ్చాడు. జిల్లా తెలుగుదేశంపార్టీలో నాయకులు తలోదిక్కు చూస్తుంటారు. ఒకరంటే ఒకరికి పడదు. జిల్లాలో ఇద్దరు మంత్రులు సోమిరెడ్డి, నారాయణలుంటే ఇద్దరూ సీతయ్యలే! ఎవరిదారి వారిదే! ఎవరి రాజకీయ ధోరణి వారిదే! ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఒకప్పుడు రాజకీయ గురువే కాబట్టి ఆయనతో సమన్వయం బాగానే వుంది. కాకపోతే ఆనం వాళ్ళ విషయంలోనే కొంత ఫెయిలైనట్లుగా కనిపిస్తుంది. పార్టీపై వాళ్లెప్పటి నుండో అసంతృప్తితో వున్నారు. ఆ విషయాన్ని పసిగట్టి అధిష్టానానికి చేరవేయడంలోనూ, ఆనంను బుజ్జగించడంలోనూ జిల్లా పార్టీ నాయకత్వం సరైన సమయంలో స్పందించలేకపోయింది. ఇలా పార్టీలో నాయకుల మధ్యే సమన్వయం లేనప్పటికీ, అందరినీ కలుపుకునిపోవడంలో రవిచంద్ర తనవంతు కష్టం బాగానే చేసాడు.

ఇంతవరకు బాగానే వుంది. కాని, 2019 ఎన్నికలే జిల్లా అధ్యక్షుడికి పెద్దపరీక్ష కానున్నాయి. రాష్ట్రంలోనే తెలుగుదేశంపార్టీ అత్యంత బలహీనంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. రేపు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కూడా చాలా క్లిష్టంగా వుండొచ్చు. 2014 ఎన్నికల్లో 10సీట్లకు గాను టీడీపీకి మూడు సీట్లే వచ్చాయి. జిల్లాలో ఈసారి టీడీపీ పరిస్థితి అంతకన్నా ఘోరంగా వుండొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి పని కుంటి గుర్రంపై యుద్ధానికి వెళ్ళినట్లే కాగలదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter