14 May 2018 Written by 

ఆంధ్రాకు అసలైన ద్రోహులెవరు?

conge bjpఆంధ్రప్రదేశ్‌ అనే వ్యక్తిని కాంగ్రెస్‌ అనే హంతకుడు కత్తితో కిరాతకంగా పొడిచి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదే సమయంలో అక్కడకు బీజేపీ అనే వాడొచ్చాడు. అతను సరిగా స్పందించి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆసుపత్రిలో చేర్చివుంటే బ్రతికి వుండేవాడేమో? కాని బీజేపీవాడు ఆ పని చేయలేదు. కొన ఊపిరితో వున్నావు కదా అంటూ... గొంతులో తులసినీళ్ళు పోసాడు. మరి ఈ మొత్తం ఎంపిసోడ్‌లో నిందితుడెవరు? పొడిచి పారిపోయిన కాంగ్రెసోడా? లేక కాపాడకుండా ప్రేక్షకపాత్ర పోషించిన బీజేపీ వాడా?

కర్నాటక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ వాళ్ళు నిర్వహించిన ప్రచారం తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలే రాకమానవు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కొందరు మంత్రులు బీజేపీని ఓడించాలంటూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ కోసం ఆర్ధిక సహకారం కూడా అందించినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే అది చంద్రబాబు సత్తానేనని ప్రచారం చేసుకోవచ్చని వీరి ప్లాన్‌. అందుకే గతంలో సమైక్యాంధ్ర

ఉద్యమాన్ని తాకట్టుపెట్టి చంద్రబాబుకు బిళ్ళబంట్రోతుగా పనిచేస్తున్న ఎన్జీఓల నాయకుడు అశోక్‌బాబును కూడా కర్నా టకా ఎన్నికల ప్రచారానికి పంపించారు.

కర్నాటకలో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం ప్రచారం చేసింది. అక్కడి తెలుగుప్రజల్లో విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేసింది. సరే, అక్కడ బీజేపీని ఓడించాలంటే ఎవరిని గెలిపించమని అర్ధం... ఒకటి కాంగ్రెస్‌, రెండోది జేడిఎస్‌. ముందు జేడిఎస్‌ను చూద్దాం.. ఇది పక్కా ప్రాంతీయ పార్టీ. ఆంధ్రా ప్రయోజనాల కంటే కర్నాటక ప్రయోజనాలకు ప్రాధాన్యత నిచ్చుకుంటారు. ఒకవేళ కేంద్రం ఏపికి ప్రత్యేకహోదా ఇద్దామనుకున్నా దానిని వ్యతిరేకించే పార్టీలలో జేడిఎస్‌ వుంటుంది. అదీగాక ఈ పార్టీ వ్యవస్థాపకులు దేవేగౌడ ప్రధానిగా వున్న సమయంలోనే కర్నాటకలో ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచి కృష్ణ నీళ్ళు కిందకు రాకుండా ఆంధ్రా నోట్లో మట్టి కొట్టాడు. మరి అలాంటి పార్టీకేమన్నా టీడీపీ నాయకులు ఓట్లేయమంటారా?

ఇక కాంగ్రెస్‌ను చూద్దాం. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో యూపిఏను నిలబెట్టిందే ఏపిలో సాధించిన లోక్‌సభ సీట్లు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాలేదు. అలాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏం చేసింది. విభజన పేరుతో కుక్కలు చింపిన విస్తరి చేసింది. అత్యంత కర్క శంగా, పాశవికంగా, దారుణాతిదారు ణంగా రాష్ట్రాన్ని విభజించింది. ఆస్తుల పంపకం చేయలేదు. హైదరాబాద్‌లో మన వాటాను ప్రస్తావించలేదు. విభజన బిల్లులో కనీసం ప్రత్యేకహోదా అంశాన్ని కూడా చేర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విష యంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేసింది కాంగ్రెస్‌పార్టీ. కనీస కనికరం కూడా ఏపి పట్ల చూపకుండా వ్యవహరించింది. ఆనాటి రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు చూసిన వాళ్లెవరు కూడా వారి జన్మలో కాంగ్రెస్‌కు ఓటెయ్యరు. ఏపి ప్రజల మీద పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నట్లుగా సోనియాగాంధీ విభజనకు పాల్పడింది. ఏపి పట్ల ఇంత రాక్షసత్వంగా వ్యవహరిం చిన కాంగ్రెస్‌కు ఓట్లేయమంటాడా చంద్రబాబు?

ఏపికి బీజేపీ కూడా అన్యాయమే చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మొహం చాటేసింది. అయితే బీజేపీకి ఏపికి న్యాయం చేయడానికి ఇంకా అవకాశం మిగిలేవుంది. ఈరోజు కాకపోతే రేపు ప్రత్యేకహోదా ఇచ్చి, విభజన హామీ లను అమలు చేసినా బీజేపీ తన పాపానికి ప్రాయశ్చితం చేసుకున్నట్లే! కాంగ్రెస్‌కే ఆ అవకాశం లేదు. ఏపి ప్రజల దృష్టిలో ఆ పార్టీ ఎప్పటికీ హంతకుడిగానే మిగిలి పోద్ది. కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ గెలవా లని కోరుకుంటున్న చంద్రబాబు కూడా కాం గ్రెస్‌ సహనిందితుడిగానే మిగిలిపోతాడు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter