Monday, 14 May 2018 06:26

బ్రిటీష్‌ సేనలను చిత్తుచేసిన చంద్రసైన్యం!

Written by 
Rate this item
(0 votes)

galpikaజనచైతన్య యాత్రలో సైకిల్‌ తొక్కి తొక్కి అలసిపోయిన సింహపురి చాణక్య సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అల్లీపురం లోని తన ఇంటికి చేరుకున్నాడు. తన సతీమణి జ్యోతమ్మ పెట్టిన రెండు పుల్కాలు తిని మంచం ఎక్కి ఏసి ఆన్‌ చేసుకుని ముసుగుతన్నాడు. తిరుపతి సభలో 'బ్రిటీష్‌ వారిపై పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ' అన్న చంద్రబాబు మాటలే ఆయన బుర్రలో తిరగసాగాయి. ఆ మాటల గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు.

----

ప్రపంచంలోని పాతిక మేటి నగరా లను మిక్సీలో వేసి తిప్పి తీసినటువంటి అమరావతి నగరమది. ఉండవల్లిలో హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. తన గదిలో చంద్రబాబు కూర్చుని వుండగా టీడీపీ నాయకులు అశోక్‌ గజపతిరాజు, యనమల రామ కృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కె.ఇ. కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు తది తరులొచ్చారు. చంద్రబాబు వారినందరినీ కూర్చోమని సైగ చేసాడు. అందరూ కూర్చున్నారు. ఏమి ఇలా వచ్చారని చంద్ర బాబు అడిగాడు. మీరు మా దగ్గర చాలా పెద్ద విషయం దాచిపెట్టార్సార్‌ అని నిమ్మ కాయల చినరాజప్ప అన్నాడు. ఏంటా విషయం అని బాబు అడిగాడు. అదే... స్వాతంత్రోద్యమంలో మన తెలుగుదేశం పార్టీ పోరాడిందనే విషయం. స్వాతంత్య్రం తెచ్చామని చెప్పే కదా ఇంతకాలం కాంగ్రెస్‌వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. మీరు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచబట్టే రాజకీయంగా లబ్ది పొందలేకపోయాము. ఆ తిరుపతి సభలో చెప్పారు కాబట్టి సరి పోయింది. లేకపోతే ఈ చారిత్రక సత్యం సమాధైపోయి ఉండేదని సీఎం రమేష్‌ అన్నాడు. వెంటనే సోమిరెడ్డి... సార్‌, స్వాతంత్య్ర పోరాటంతో మన పార్టీ పోరా టాన్ని గురించి అందరూ తెలుసుకోవాలను కుంటున్నారు. కాస్త చెబుతారా... రేపు ఎన్నికల్లో మేం ప్రచారానికి కూడా వాడు కోవచ్చన్నాడు. అప్పుడు బాబు... చెప్పడం కాదు చూపిస్తాను పదండి అంటూ అంద రినీ అక్కడ నుండి లేపి ఒక పెద్ద హాల్‌లోకి తీసుకెళ్లాడు. ఆ హాల్‌లో గ్లోబ్‌ లాంటి పెద్ద వస్తువు వుంది. చంద్రబాబు దానిని చూపిస్తూ... ఇదే టైం మిషన్‌... నా బావమరిది 'ఆదిత్య 369' సినిమాలో వాడింది కూడా ఇలాంటి మిషనే! ఇప్పుడు దీంట్లోకి ఎక్కి మనం స్వాతంత్య్రానికి ముందు కాలంలోకి వెళదాం అని చెప్పి అందరినీ దాంట్లోకి ఎక్కించాడు. చంద్ర బాబు ఒక సీట్లో కూర్చుని ఇంజన్‌ ఆన్‌ చేసి టైమ్‌ బటన్‌ను 1857-1947ల మధ్య కాలంలో తిప్పాడు. మిషన్‌ పెద్ద శబ్ధంతో గాల్లోకి లేచింది. కాలం 2018 నుండి మొదలై రివర్స్‌లోకి వెళ్ళసాగింది. మిషన్‌ ఆకాశంలోకి పోతుంటే వివిధ గ్రహాలు, అస్టరాయిడ్స్‌ కనిపించసాగాయి. వాటిని చూసి టీడీపీ నాయకులు సంభ్ర మాశ్చర్యాలకు గురికాసాగారు. అలా 1857 కాలానికి వచ్చేసరికి టైం మిషన్‌ ఒకచోట ల్యాండయ్యింది. అందరూ మిషన్‌ల నుండి బయటకొచ్చారు. ఆ ప్రాంతం నిర్మాణుష్యంగా వుంది. అప్పుడే అక్కడ గుర్రపు డెక్కల చప్పుడు వినిపిం చింది. కొద్దిసేపటికి దాదాపు వంద గుర్రాల మీద బ్రిటీష్‌ సైనికులు వేగంగా వస్తున్నారు. అలా వస్తున్న వారిపై ఒక్క సారిగా చుట్టుపక్కల నుండి బాణాల వర్షం కురవసాగింది. ఆ బాణాలు గుచ్చు కుని బ్రిటీష్‌ సైనికులు నేలకొరగసాగారు. కొందరు పలాయనం చిత్తగించారు. అలా బ్రిటీష్‌ సైనికులు కొందరు చనిపోగా, ఇంకొందరు పరారయ్యాక అక్కడున్న చెట్ల మీద నుండి కొందరు కిందకు దూకారు. అలా దూకిన వారిలో ఇద్దరిని చూసి తెలుగుదేశం నాయకులు ఆశ్చర్యపో యారు. కారణం వారిలో ఒకరు చంద్ర బాబు లాగాను, ఇంకో చిన్నపిల్లోడు లోకేష్‌లాగాను వున్నారు. వారిద్దరి చేతుల్లో తెలుగుదేశం జెండాలున్నాయి. చంద్ర బాబు అల్లూరి సీతారామరాజు గెటప్‌లో చేతిలో విల్లు పట్టుకుని వున్నాడు. విల్లు పట్టుకున్న వ్యక్తి విజయోత్సాహంతో ''తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా'' అని పాట పాడుతూ ముందుకు కదులుతుంటే అందరూ ఆయనను అను సరిస్తూ అడవుల్లోకి పోయారు.

ఇది చూసిన తర్వాత చంద్రబాబు టీమ్‌ నడుచుకుంటూ ఒక గ్రామంలోకి వెళ్ళింది. ఆ గ్రామంలో పోలీస్‌స్టేషన్‌ భవనంపై బ్రిటీష్‌ జెండా రెపరెపలాడు తోంది. పోలీసులు స్వాతంత్య్రపోరాట యోధులను తీసుకొచ్చి థర్డ్‌ డిగ్రీ ప్రయో గిస్తున్నారు. అంతలో పోలీస్‌స్టేషన్‌పై మెరుపుదాడి. కొంతమంది యువకులు గుర్రాలపై దూసుకొచ్చారు. వారిలో ఒక యువకుడు అచ్చం లోకేష్‌ లాగానే వున్నాడు. అతను రావడంతోటే స్టేషన్‌లోకి బాంబులు విసిరాడు. బ్రిటీష్‌ పోలీసులను హతమార్చి స్టేషన్‌పైన వున్న బ్రిటీష్‌ జెండాను కూల్చేసాడు. దాని స్థానంలో తెలుగుదేశం జెండాను పాతిపెట్టి వెళ్ళి పోయాడు. ఆ సీన్‌ చూసి స్వాతంత్య్ర పోరాటంలో మన లోకేష్‌బాబు ఎంత సాహసం చేసాడు అని టీడీపీ నాయకు లంతా మనసులో అనుకున్నారు. తర్వాత వీరందరూ ముందుకు కదిలారు. ఉప్పు సత్యాగ్రహం మీద చర్చించడానికి గాంధీ, నెహ్రూ, పటేల్‌, బాలగంగాధర తిలక్‌, ఝాన్సీలక్ష్మీభాయ్‌ వంటి నాయకులంతా ఒక హాల్‌లో సమావేశమయ్యారని తెలి సింది. టీడీపీ నాయకులందరూ అక్కడకు వెళ్లారు. అక్కడ చూస్తే గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి యోధుల మధ్య చంద్రబాబు, లోకేష్‌లు కూడా వున్నారు. రేపటి నుండే ఉప్పు సత్యాగ్రహం మొదలుపెడదాం. నా దేశ ప్రజలకు పిలుపునివ్వండి... అని గాంధీజీ చెప్పాడు. వెంటనే లోకేష్‌... దాంతోపాటు పప్పు సత్యాగ్రహం కూడా చేద్దాం తాతయ్య అని సలహా ఇచ్చాడు. పనిలో పనిగా 'నిప్పు' సత్యాగ్రహం కూడా చేద్దాం పెద్దయ్యా... ఉప్పు... పప్పు... నిప్పు కాంబినేషన్‌ బాగా ఉంటుంది... సత్యాగ్రహం కూడా ఉదయం టిఫిన్‌ తిన్నాక 8గంటల నుండి మొదలుపెట్టి రాత్రి భోజనం టైంలోపు ముగించేద్దాం... భారీగా వేదికనేర్పాటు చేద్దాం. సాంస్కృ తిక కార్యక్రమాలు పెడదాం... గుర్రపు బండ్లు, రైళ్ళ ద్వారా ప్రజలను తర లిద్దాం.. ఎండసెగ తగలకుండా చలివిడి యంత్రాలు పెట్టించి స్టేజీమీద కూర్చుందాం అని చంద్రబాబు సలహా ఇచ్చాడు. అది విని గాంధీ జుట్టు పీక్కుందామని నెత్తి మీద చేయి పెట్టబోయి... మళ్ళీ ఏదో గుర్తుకువచ్చినట్లు ఆగాడు. అదంతా చూస్తున్న టీడీపీ నాయకులు మాత్రం... చూడండి, అప్పట్లోనే మన చంద్రబాబుకు ఎంత విజన్‌ వుందో అని సంబరపడసా గారు. అంతలో కొందరు వేగులు పరుగెత్తు కుంటూ వచ్చి... బాపుజీ, జలియిన్‌వాలా బాగ్‌ దుర్మార్గుడు డయ్యర్‌ వస్తున్నాడు. మీరిక్కడ సమావేశమైన విషయం ఆ దుర్మార్గుడికి తెలిసింది. సైన్యాన్ని తుపాకు లను వెంటబెట్టుకుని వస్తున్నాడని అరి చాడు. గాంధీ, పటేల్‌, నేతాజీలు... వస్తే రానీయండి, చావోరేవో అని లేచి నిలబడగా, చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం... ఈరోజే వాడి అంతు చూస్తాం అంటూ చెరో గుర్రమెక్కి... డయ్యర్‌ ఏ వైపు నుండి వస్తున్నాడు అని వేగులను అడిగారు. వాళ్ళు పడమరవైపు నుండి అని చెప్పారు. అట్లాగైతే మేము తూర్పు వైపుకు వెళ్ళి పోరాడుతాం... వాస్తు ప్రకారం అదే కరెక్ట్‌ అంటూ ఆ దిక్కువైపు గుర్రాల మీద వెళ్ళిపోయారు. అంతలో డయ్యర్‌ సేనలు అక్కడికొచ్చి తుపాకులు ఎక్కుపెట్టి కాల్చ సాగారు. ఆ దెబ్బకు టీడీపీ నాయకులకు కాళ్ళలో వణుకొచ్చి పరుగులు తీయ సాగారు. అలా పరుగెడుతూ పరుగెడుతూ సోమిరెడ్డి ఒక చోట పడిపోయి... కెవ్‌ మంటూ అరిచాడు... అతని కేకల దెబ్బకు క్రింద గదిలో నిద్రిస్తున్న కొడుకు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉలిక్కిపడి లేచి తన తండ్రి గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. టెన్షన్‌తో వున్న తన తండ్రికి నీళ్ళిచ్చాడు. నీళ్ళు తాగి కొద్దిసేపటికి తేరు కున్నాక గాని సోమిరెడ్డికి అర్ధం కాలేదు... అప్పటిదాకా వచ్చింది కల అని!

Read 29 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter