14 May 2018 Written by 

11-05-2018 రాశిఫలాలు

rasi 11

1Ariesమేషం

వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. వృత్తి జీవనం సామాన్యంగా ఉంటుంది. ఒక పక్కా ప్రణా ళికతో ఆర్ధిక కార్యక్రమాలు చేపడుతారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంది. అధికారులకు స్థాన మార్పులు, ప్రమోషన్లు ఉంటాయి. అనుకున్న పనులు నిరాటంకంగా సాగుతాయి. రావలసిన బాకీలు సర్దు బాటు కాగలవు. ఆరోగ్యం బాగుంటుంది.

 

2Taurusవృషభం

ఇంటా బయట వ్యవహారాలను సొంతంగా నిర్వ హించండి. గొడవలు లేకుండా మీ నిర్ణయాలను లౌక్యంగా బయటపెట్టండి. వృత్తివ్యాపారాలు సామా న్యంగా జరుగుతాయి. మొగమాటపు ఖర్చులు, ఆడంబ రాలు తగ్గించుకొనండి. కొత్త బాధ్యతలు మీపై ఇతరు లుంచుతారు. దూర ప్రయాణాలుంటాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి.

 

3Geminiమిధునం

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆర్ధిక అవకాశాలు గాని, లౌకిక అవకాశాలు గాని చేజారిపోతాయి. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. పనులన్నీ హడావిడిగా పూర్తి చేస్తుంటారు. బంధువుల సహకారం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగున్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉన్నత విద్యావకాశాలుంటాయి.

 

4Cancerకర్కాటకం

వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆర్ధిక ప్రయత్నాలు ప్రారంభించే పనులు చేపడుతారు. అనుకున్న పనులు టెన్షన్‌ కలిగిస్తూ జరుగుతాయి. తొందరపాటు మాటలు, ప్రవర్తనను తగ్గించుకొనండి. అధికారులకు స్థానమార్పులుంటాయి. క్రీడా కళా సాంస్కృతిక సాంకేతిక రంగాల వారికి మంచి అవకాశాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

5Leoసింహం

ఆర్ధికంగా ఇబ్బందులుండినా రెండు నెలల తరువాత సర్దుబాటు కాగలవు. ఖర్చులు ఏదో ఒక రూపంలో పెరుగుతాయి. వృత్తి జీవనం కలవారికి సామాన్యంగా ఆర్ధిక స్థితి ఉంటుంది. వ్యాపారవర్గాలకు ఆదాయం సంతృప్తికరం. పనులు సవ్యంగా నిదానంగా జరుగు తాయి. క్రయ విక్రయాలు వాయిదా వేయండి. శుభకార్య ప్రయత్నాలు తీవ్రంగా సాగుతాయి.

 

6Virgoకన్య

ఖర్చులు పెరుగుతాయి. వృత్తివ్యాపారాలలో ఆశిం చిన రాబడి ఉండదు. కొత్త వ్యాపార పథకాలు, కొత్త పెట్టుబడి అవకాశాలు దొరకడం జరుగుతుంది. ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వ ఆదరణ, స్థానమార్పులుంటాయి. పరి చయాలు ఎక్కువ కావడం, బంధుత్వాలు బలపడటం, శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. అను కున్న పనులు సానుకూలం కాగలవు.

 

7Libraతుల

అనుకున్న పనులు జరగడానికి అన్ని అవకాశా లున్నను ఆలస్యం కాగలవు. వృత్తి వ్యాపారాలలో అవకా శాలు సరిగా లేక, రాబడి తగ్గుతుంది. వస్తు వాహన గృహ రిపేర్ల ఖర్చులుంటాయి. ముఖ్య వస్తువులు, రికా ర్డులు జాగ్రత్త. శుభకార్య ప్రయత్నాలు నిరాశాజనకం. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చును. కోర్టు కేసులు వాయిదా పడతాయి.

 

8Scorpioవృశ్చికం

నిర్ణయాలు తీసుకొనేముందు ఎదుటివారి సలహా కూడా తీసికొని పనులు జరుపుకొనండి. వృత్తి వ్యాపార ములలో ఆదాయం సామాన్యం, ఖర్చులు కూడా పెరుగు తాయి. అనుకోని ఇబ్బందులు ఎదురుకావచ్చును. పరోక్ష విమర్శనలుంటాయి, వాటిని ఎదుర్కొంటారు. శుభ కార్యాలు నిర్ణయం కాగలవు. పరీక్షలలో విజయం పొందుతారు. వ్యాపారవృద్ధికి ప్రయత్నాలు జరుగుతాయి.

 

9Sagittariusధనుస్సు

వ్యాపార విస్తరణ అవకాశాలు, వృత్తిపరంగా అవ కాశాలు లభించగలవు. ఆదాయానికి తగ్గ ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. రావలసిన బాకీలు కొంత మేరకు అందుకొనడం, కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఓర్పుతో నేర్పుతో అనుకున్న పనులను జరుపు కొనండి. కొత్త పరిచయాలు కలుగుతాయి. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి.

 

10Capricornమకరం

కొత్త ఆర్ధిక ప్రయత్నాలు ఆలోచనలు కలుగుతాయి. వ్యాపార పెట్టుబడులకు అవకాశాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల లావా దేవీలు అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో కొద్ది భేదాలుండినా సమస్యలు సర్దుబాటు కాగలవు. అనుకున్న పనులు టెన్షన్‌తో జరుగుతాయి. కొత్త వస్తువులు సమకూర్చుకొంటారు.

 

11Aquariusకుంభం

ఆర్ధిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, లౌకిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత బాగుంది. స్థిరా స్తుల లావాదేవీలు వాయిదా పడతాయి. విద్యార్థులకు పైకోర్సులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖు లను కలుసుకొంటారు. దూరప్రయాణాలుంటాయి.

 

12Piscesమీనం

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కలదు. రావ లసిన బాకీలు, ముఖ్యఅనుమతి పత్రాలు అందుకొం టారు. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, కార్య సామర్ధ్యం బాగుంటుంది. వృత్తివ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలుంటాయి. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. విభేదాలు సర్దుబాటై మానసికంగా స్థిమితపడతారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter