17 May 2018 Written by 

బొక్కబోర్లా పడ్డ బాబు

chandra'అనువుగాని చోట అధిక ప్రసంగం పనికిరాదు' అని పెద్దలు ఒక సామెత చెప్పారు. తెలుగుదేశం నాయకులకు ఇది సరిగ్గా సరిపోతుందేమో! వీళ్ళకు సంబంధం లేని కర్నాటక ఎన్నికల్లో అతిగా జోక్యం చేసుకుని, అనవసరంగా వేలు పెట్టి పరువు పోగొట్టుకున్నారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగుదేశం నాయకుల ఓవర్‌ యాక్షన్‌కు కన్నడ ఓటర్లు తగిన గుణపాఠం చెప్పినట్లయ్యింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు మన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్‌ను గెలిపించండంటూ ఏపి కాంగ్రెస్‌ నాయకులు కర్నాటకకు వెళ్ళి ప్రచారం చేశారు. తప్పు లేదు. వారంతా ఒకే పార్టీ కాబట్టి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇవి జాతీయ పార్టీలు కాబట్టి ఒక రాష్ట్రంలో నాయ కులు ఇంకో రాష్ట్రంలో తమ పార్టీల గెలుపు కోసం పనిచేయవచ్చు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ పార్టీ. ఆంధ్రా, తెలంగాణలకు పరిమితమైన పార్టీ. వాళ్ళు కర్నాటక ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. ఏ పార్టీకి ఓటేయమని చెప్పలేదు. ఎందుకంటే కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఏపికి ద్రోహం చేసాయి. కాబట్టే జగన్‌ ఆ రెండు పార్టీలకు సమదూరం పాటించాడు. జేడీఎస్‌తో ఎలాంటి పొత్తుగాని, స్నేహం గాని లేదు. కాబట్టే ఆ పార్టీకీ మద్దతునివ్వలేదు. ఇక టీఆర్‌ఎస్‌ అంటే ఫెడరల్‌ ఫ్రంట్‌లో వుంది కాబట్టి జేడీఎస్‌కు మద్దతునిచ్చింది.

మరి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌తో పొత్తు లేదు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వామి కాదు. అసలు కర్నాటక ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదు. కాని కర్నాటకలో బీజేపీని ఓడించాలంటూ తెలుగుదేశం నాయకులు తెగ ప్రచారం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఇదంతా జరిగింది. కొందరు మంత్రులతో పాటు స్వయం ప్రకటిత మేధావులను, ఎన్జీఓల సంఘం నాయకుడు అశోక్‌బాబును కూడా చంద్రబాబు కర్నాటకకు పంపించాడు. తెలుగుప్రజలు అధికంగా వుండే ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఏపికి అన్యాయం చేసిందని తెలుగు ఓటర్లను బీజేపీపైకి రెచ్చగొట్టాలనుకున్నారు.

కర్నాటక ఫలితాలలో బీజేపీ వెనుకబడిపోయి వుంటే చంద్రబాబు ఇప్పటికే జబ్బలు చరుచుకుని వుండేవాడు. ఇది తన ఘనతే నని. తాను చక్రం తిప్పబట్టే కర్నాటకలో బీజేపీ ఓడిపోయిందని ప్రచారం చేసే వాడు. పచ్చమీడియా ఛానళ్ళు కూడా అదే బాకాను ఊదేవి.

కర్నాటక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. ఆయన ప్రచారం కన్నడలోని తెలుగు ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. స్థానిక అంశాల ప్రాతిపదికనే అక్కడి తెలుగు ఓటర్లు ఓట్లేసారు. అనవసరంగా కర్నాటకలో వేలుపెట్టి చంద్రబాబు పరువు పోగొట్టుకున్నాడు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter