18 May 2018 Written by 

'సందిగ్ధం'లో కర్నాటకీయం

karnatakaకర్నాటక ఎన్నికల ఫలితాలు కలకం సృష్టించాయి. ప్రధాన పార్టీలైన మూడు పార్టీల వారికీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ ఎవరు ప్రభుత్వం ఏర్పాటుచేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మే 15న వెలువడిన ఫలితాల్లో బిజెపిదే అగ్రస్థానం. కర్నాటకలో అత్యధికస్థానాల్లో విజయం సాధించి బిజెపి విజయభేరీ మోగించింది. కన్నడనాట కమలం విజయదరహాసంతో వికసించింది. కర్నాటక ప్రజలు అత్యధికస్థానాలతో (104) బిజెపికే పట్టం కట్టారు. అయితే, ప్రభుత్వఏర్పాటుకు అవసరమైన 112 స్థానాలు రాకపోవడంతో, ఇదే అదనుగా ఎలాగైనా సరే బిజెపిని అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్‌ పావులు కదపడం, జేడీఎస్‌తో కలయికకు రంగం సిద్ధం చేస్తూ 'హంగ్‌' ప్రభుత్వానికి దారులు తీస్తుండడంతో కన్నడనాట రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.

కర్నాటకలో మే 12న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 222 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడ్డాయి. అయితే ఆ రోజే..ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే కర్నాటకలో రసవత్తర రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కర్నాటకలో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. బిజెపికి ఇది చరిత్రాత్మక విజయం. ఉద్దండులైన కాంగ్రెస్‌ రాజకీయయోధులను సైతం ఓడించి బిజెపి విజయ దుందుభి మోగించింది. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా బిజెపి బలోపేతం అవుతోన్న నేపథ్యంలో తొలిసారిగా ఇప్పుడు దక్షిణాదిలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించడంతో బిజెపి బలం మరింతగా పెరిగింది. ఈ గెలుపు ద్వారా దక్షిణభారతంలోనూ బిజెపి తన హవా చాటుకుంది. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల రాజకీయ వ్యూహాల మధ్య కాంగ్రెస్‌ నిలవలేక చతికిల పడిపోయింది. అయితే, ఫలితాలు వెలువడుతున్న తుదిదశలో జరిగిన అనూహ్య రాజకీయపరిణామాలు బిజెపిని సందిగ్ధతలోకి నెట్టాయి.

ఫలితాలు వెలువడినరోజు సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, మొత్తం 222 స్థానాల్లో 104 స్థానాల్లో బిజెపి విజయపథంలో ఉంది. కాంగ్రెస్‌ 78 స్థానాల్లోనూ, జెడిఎస్‌ 38 స్థానాల్లోనూ లీడింగ్‌లో ఉండగా, మరో రెండు స్థానాల్లో ఇతరులు విజయపథంలో ఉన్నారు. బిజెపి 104 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా తన సత్తా చాటుకుంది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 112 స్థానాలకు అడుగు దూరంలో నిలబడిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 8 స్థానాలు తక్కువ కావడంతో చివరి నిమిషంలో ఏమిచేయాలో బిజెపి నేతలకు అయోమయంగా మారింది. ఇదే అదనుగా కాంగ్రెస్‌ చకచకా పావులు కదిపింది. కేవలం 78 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌, 38 స్థానాల్లో విజయం సాధించిన జెడిఎస్‌ పార్టీతో బయటినుంచే పొత్తుపెట్టుకోవడానికి సిద్ధం కావడంతో, ఈ రెండు పార్టీలు కలిస్తే 116 స్థానాలు అవుతాయి కనుక, ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందనే ధీమాతో కాంగ్రెస్‌ నేతలు పావులు కదపడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కేవలం 38 స్థానాలు దక్కించుకున్న జెడిఎస్‌ (జనతాదళ్‌-ఎస్‌)తో కలవడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉండడం, అందుకు ఆ పార్టీ కూడా అంగీకరించినట్లు సమాచారం రావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీంతో ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు సాయంత్రం దాకా రాజకీయాలు చకచకా మారుతూనే వచ్చాయి.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన సిద్దరామయ్య రాజీనామా చేయడం, ఢిల్లీ నుంచి సోనియాగాంధీ ఆదేశంతో కాంగ్రెస్‌ నేతలు గులామ్‌నబీ అజాద్‌ వంటివారంతా రంగంలోకి దిగి జేడిఎస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు రాజకీయ వ్యూహాలు రచించడంతో పరిస్థితి జేడీఎస్‌ చేతుల్లోకి వచ్చింది. కాంగ్రెస్‌తో కలిస్తే జేడిఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకైనా సిద్ధమని కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేయడంతో, ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో అప్పటిదాకా కేవలం కింగ్‌మేకర్‌ అవుతుందనుకున్న జేడిఎస్‌ ఒక్కసారిగా కింగ్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో, అత్యధిక స్థానాలు సాధించి కర్నాటకలో విజయకేతనం ఎగురవేసినా, ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవసర మైన మ్యాజిక్‌ ఫిగర్‌ 112 స్థానాలు రాకపోవడంతో బిజెపి పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఈ దశలో బిజెపి అగ్రనేతలు అమిత్‌షా తదితరులంతా కలసి కాంగ్రెస్‌ వ్యూహానికి ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేవలం అయిదారు గంటల్లోనే ఈ క్షణక్షణ రాజకీయాలు కర్నాటకనే కాక, దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఫలితాలు వెలువడిన రోజంతా... ఇదే సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న విషయం ఒక కొలిక్కి రానేలేదు. అధికారం లోకి వచ్చేందుకు ఆయా పార్టీల నేతలు ఎవరికి వారు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తుండడంతో కర్నాటక రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారాయి.

అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను ఓడించి అక్కడి ప్రజలు బిజెపికి పట్టం కట్టినా, చివరి దశలో ఏర్పడిన ఈ సంకటస్థితి బిజెపికి సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌-జేడిఎస్‌ ఒకటైతే పూర్తిస్థాయి మెజారిటీకన్నా ఎక్కువ స్థానాలే వస్తాయి కనుక, ఎలాగైనా సరే బిజెపిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ వ్యూహాలు పన్నుతోంది. అయినప్పటికీ కర్నాటకలో అత్యధికంగా 104 స్థానాలు సాధించి కమలం జెండాను రెపరెపలాడించిన బిజెపికి, ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటుతూ అతిపెద్దపార్టీగా అవతరించిన బిజెపికి ఈ పరిస్థితిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇప్పటికే గవర్నర్‌ బీజేపీకి తొలి అవకాశమిచ్చారు. వారంలోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోమన్నారు. జేడీఎస్‌లో చీలిక తెచ్చే దిశగా బీజేపీ నాయకత్వం పావులు కదిపింది. దేవేగౌడ పెద్దకొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం గాలం వేసింది. ఇది సక్సెస్‌ అయితే బల నిరూపణ బీజేపీకి పెద్ద సమస్య కాకపోవచ్చు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter