25 May 2018 Written by 

దేవుడితో దాగుడుమూతలు!

tirumalaతిరుమల తిరుపతి దేవస్థానం... ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. హిందువులకు ప్రధాన ఆథ్యాత్మిక కేంద్రం. ఆథ్యాత్మికతలోనే కాదు, ఆలయ ఆదాయంలోనూ అగ్రస్థానంలో వున్న శ్రీవారి నిలయం. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తుం టారు. శ్రీవారిని దర్శించుకుంటుంటారు. తిరుమలపైనే వేలాదిమంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకు తున్నారు. తిరుమల భక్తి క్షేత్రమే కాదు, ఎంతోమందికి

ఉపాధి మార్గం కూడా! క్రైస్తవులకు వాటికన్‌ సిటి మాదిరిగానే హిందువులకు తిరుమల ప్రత్యేక కేంద్రం. కాకపోతే వాటికన్‌ సిటీకి వున్నట్లు తిరుమలకు స్వయం ప్రతిపత్తి లేదంతే!

తిరుమల అంటే భక్తే కాదు ప్రధానమైన సెంటిమెంట్‌ కూడా! తిరుమలలో వివాదాలు చేసినోళ్ళు, తిరుమలను ఆదాయ వనరుగా చూసినోళ్ళు, ఇక్కడ పిచ్చివేషాలేసి

నోళ్ళు బాగు పడినట్లు చరిత్రలో లేదు. భక్తుల మనోభావాల తోనూ, భగవంతుడితోనూ ఆడుకోవాలని చూసినోళ్ళు అష్టకష్టాల పాలయ్యారు. తిరుమల సెంటిమెంట్‌ ఎంతటిదంటే దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన మొఘలులు గాని, ఆ తర్వాత హిందూ సంస్కృతిపై దాడిచేసిన బ్రిటీషర్లు గాని తిరుమల జోలికి రాలేదు.

కాని, ఇప్పుడు మనవాళ్లే తిరుమల సెంటిమెంట్లతో ఆడుకుం టున్నారు. తిరుమల కేంద్రంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణా మాలను చూస్తూనేవున్నాం. టీటీడీ మెంబర్‌గా వుండి కూడా అన్యమత ప్రచారసభలకు వెళ్ళిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ను టీటీడీ ఛైర్మెన్‌గా నియమించవద్దంటూ ఇటీవల రాష్ట్రంలో పలువురు స్వామీజీలు, పీఠాధిపతులు, హిందూ సంస్థల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అవేవీ పట్టించుకోకుండా పుట్టా సుధాకర్‌యాదవ్‌ను టీటీడీ ఛైర్మెన్‌ను చేసాడు.

రమణదీక్షితుల విమర్శలు...

తాజాగా ప్రధానార్చకులు రమణదీక్షితులతో వివాదం. 65 ఏళ్లు నిండితే అర్చకత్వానికి పనికిరారంటూ ఆయనను విధుల నుండి తప్పించారు. ఆయన ఊరుకుంటాడా? తిరుమల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన నిర్వాకాలన్నింటిని బయటపెడుతున్నాడు. కేవలం బీజేపీ అగ్రనాయకులతో సంబంధాలున్నాయని చెప్పి రమణదీక్షితుల పదవిని ఊడబెరికినట్లయ్యింది. 65ఏళ్ళు నిండితే మేము దేవుడి సేవకు పనికిరామా? మరి 68ఏళ్ళున్న చంద్రబాబునాయుడు మాత్రం ప్రజాసేవకు పనికివస్తాడా? మా పిల్లలకు అర్చక వారసత్వం రాదా? మరి ఏ అర్హతలున్నాయని చెప్పి చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను మంత్రిని చేసుకున్నాడంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ పెద్దలు, అర్చకస్వాములు అడుగుతున్న ప్రశ్నలకు తెలుగుదేశం నాయకుల వద్ద సమాధానాలు లేకుండా పోయాయి. అదేమంటే రమణదీక్షితులకు వందలకోట్ల ఆస్తులున్నాయంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులుంటే మరి ఏసిబి ఏం చేస్తున్నట్లు?..

శ్రీవారి వజ్రం మాయమైనట్లేనా..?

ఇక శ్రీవారి వజ్రం మాయం కావడంపై వివాదం వుంది. ఒకరేమో భక్తులు చల్లిన కానుకలు తగిలి ఈ వజ్రం పగిలి ముక్కలైందంటారు. టీటీడీ ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాత్రం అసలు అలాంటి వజ్రమే లేదంటున్నాడు. రమణదీక్షితులు మాత్రం టీటీడీలో స్వామి వారి ఆభరణాలకు లెక్కలు లేవంటున్నాడు. ఈ వజ్రం వివాదం ఇప్పుడు బాగానే రగుల్కొంది. ఈ మధ్యంతా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఇంకో అడుగు ముందుకేసాడు. శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపారని, ఆభరణాలను చంద్రబాబు ఇళ్ళకు తరలించారని సిబిఐ దాడులు చేస్తే దొరుకుతాయని బాంబు పేల్చాడు. మరోపక్క బీజేపీ ఎంపి సుబ్రహ్మణ్యస్వామి రమణ దీక్షితుల తరపున న్యాయపోరాటం చేస్తానంటున్నాడు.

మొత్తానికి చంద్రబాబు తిరుమలను ఒక రాజకీయ కేంద్రంగా, రాజకీయ చర్చకు ప్రధాన మార్గంగా చేసిపెట్టాడు. తిరుమల వివాదంతో బ్రాహ్మణ సమాజంలో వ్యతిరేకత తెచ్చుకున్నాడు. 2014 ఎన్నికలకు ముందు వైసిపి అధినేత జగన్‌ చెప్పులు విడిచి శ్రీవారి దర్శనానికి వెళ్ళినా చెప్పులతో లోపలకు వెళ్ళినట్లు చూపించి పచ్చమీడియా పెద్ద రచ్చ చేసింది. మరిప్పుడు కొండ మీద ఇంతపెద్ద రాజకీయ గోల జరుగుతోంది. శ్రీవారితో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter