25 May 2018 Written by 

ఆగిన.. నవలా నాడి

yeddanapudiచిత్రం 'జీవన తరంగాలు' జ్ఞాపకానికి వస్తుంది. విచిత్రబంధం, కాంచనగంగ వంటి చిత్రాలు కూడా గుర్తుకొస్తాయి. ఎందుకంటే అవి మన మనసుల్లో అట్టే నిలిచిపోయాయి. అత్యద్భుతమైన కథాకథనంతో, కంటతడిపెట్టించే సెంటిమెంట్లతో నిండిపోయిన చిత్రాలవి. ఆ చిత్రాలకు మూలకథలు కూర్చిన నేర్పరి.. మరెవరో కాదు.. ఆమే యద్దనపూడి సులోచనారాణి. ఆమె రచించిన పలు నవలలు.. తెలుగుచిత్రాలకు కథలుగా మారి, ఆ చిత్రాలు ప్రజల గుండెల్లో నిలచిపోవడం ఎంతైనా విశేషం. మధ్యతరగతి కుటుం బాల్లోని జీవితాలనే ఆమె ఇతివృత్తాలుగా తీసుకునేవారు. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు-అనురాగాలు, స్నేహాలు.. ఆత్మీయతలు ఇలాంటి అంశాల పట్లనే ఆమె ఎక్కువగా స్పందించే వారు. సమాజంలోని సంక్లిష్ట పరిస్థితులను అవగాహన చేసుకుని, బంధాలను అనుబంధాలను కరిగిపోకుండా కాపాడుకోవా లంటూ తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో.. అత్యద్భుతమైన నవలలను సృష్ఠించి తమ రచనలతో జనాన్ని, అశేష పాఠక జనాన్ని ఉర్రూతలూగించారామె. ఆమె రచించిన ప్రతి రచనా ఒక అద్భుతమే. దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు ఆధునిక తెలుగు నవలా లోకాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆమె, తన 79వ ఏట నుమూశారు. ఆమెరికాలో ఉన్న తన కుమార్తె లక్ష్మీశైలజ వద్దకు వెళ్ళివుండగా, గుండెపోటుతో నిద్రలోనే ఈ లోకం వీడి వెళ్ళిపోయారు.

15 ఏళ్ళ వయసులోనే తొలి కథ :

యద్దనపూడి సులోచనారాణి స్వస్థలం కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజ అనే గ్రామం. 1940లో ఆమె జన్మించారు. తల్లిదండ్రులు నెమలికంటి మహాలక్ష్మి-వెంకట చలపతిరావు. ఎక్కడో మారుమూలన ఉన్న ఈ గ్రామం నవలారాణి జననంతో మరింత ప్రఖ్యాతమైంది. ఆమె తొలిరచన 15ఏళ్ల వయసులోనే చేశారు. 'చిత్రనళీయం' అనే ఆ కథ 1956లో ప్రచురితమైంది. ఇక అప్పటినుంచి ఆమె ఎన్నెన్నో కథలు, నవలా రచనల్లో ఇక వెనక్కి చూడలేదు. కృష్ణాజిల్లాకు చెందిన యద్దన పూడి నరసింహా రావుతో ఆమెకు వివాహమైంది. వీరి ఏకైక కుమార్తె లక్ష్మీశైలజ ఇప్పుడు అమెరికాలోని గూగుల్‌ సంస్థలో పని చేస్తున్నారు. 2015లో యద్దనపూడి సులోచనారాణికి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న(హంస) అవార్డును బహుకరించి సత్కరించింది. యద్దనపూడి సులోచనారాణి సోదరి గోవిందరాజు సీతాదేవి కూడా నవలా రచయిత్రే కావడం విశేషం.

70 దాకా నవలలు.. వాటిలో కొన్ని చలనచిత్రాలు:

సాధారణంగా ఒకటి రెండు నవలలు రాయాలంటేనే ఎంతో కష్టం. అందుకు ఎంతో ఓర్పు, నేర్పుతో పాటు రచనల పట్ల ఎనలేని ఆసక్తి ఉండాలి. యద్దనపూడి సులోచనారాణి ఏకంగా 70 దాకా నవలలు రాశారంటే ఎంతో అద్భుతమైన విషయం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అమరహృదయం, అమృత ధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, ఆశల శిఖరాలు, దాంపత్యవనం, హృదయగానం, జలపాతం, జీవనసత్యాలు, జీవన సౌరభం, జీవనతరంగాలు, జీవనగీతం, కలల కౌగిలి, మధురస్వప్నం, మీనా, ప్రేమదీపిక, ప్రేమలేఖలు, ప్రేమపీఠం, ప్రేమసింహాసనం, సహజీవనం, సెక్రటరీ, స్నేహమయి, సుకుమారి... ఇలా ఎన్నో నవలలు..అన్నీ అద్భుతాలే. ఆ నవలల పేర్లే హైలైట్‌గా ఉండేవి. నవలలకి తగ్గట్టుగా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న ఆ పేర్లంటే పాఠకులకెంతో ఇష్టం. అందుకే ఆ నవలలన్నీ సూపర్‌హిట్‌లయ్యాయి. అందులో కొన్ని సినిమా లుగా కూడా వచ్చాయి.

అనుబంధాలు ఆత్మీయతలే.. కథావస్తువులు:

'చదువుకున్న అమ్మాయిలు' చిత్రంతో ఆమె సినీ కథా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1965లో మనుషులు-మమ తలు, ఆ తర్వాత 'మీనా' వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. సెక్రటరీ, జీవనతరంగాలు వంటి చిత్రాలు పెద్ద సంచలనాలు సృష్టించాయి. జైజవాన్‌, విజేత, అగ్నిపూలు, గిరిజా కల్యాణం, రాధా కృష్ణ, ఆత్మగౌరవం, బంగారు కలలు, ప్రేమలేఖలు, చండీప్రియ వంటి చిత్రాలకు ఆమె నవలలే మూలకథలు. అవి కూడా సూపర్‌హిట్లే. బుల్లితెరలోనూ ఆమె ప్రఖ్యాతి సాధించింది. ఆగమనం, అగ్నిపూలు, సుకుమారి, రుతురాగాలు, నీరాజనం, రుతుగీతం, రాధా మధు తదితర ధారావాహికలు ఆమె రచనల ఆధారంగా తెరకెక్కాయి.

ఆమె నవలలకు మధ్యతరగతి కుటుంబాల్లోని సజీవమైన బంధాలే ప్రేరణ. అందుకే అవి పాఠకుల హృదయాల్లోకి చొచ్చుకు పోయాయి. సమాజంలో మానవీయబంధాలు మాసిపోకూడద న్నదే ఆమె భావన. అదే ఆమె రచనలకు శాశ్వతత్వం సంపా దించిపెట్టింది. ఎక్కువగా యువతీ యువకులు ఆమె నవలలు బాగా చదివేవారు. వారి కలలకు, ఆశలు.. ఆకాంక్షలకు ఆ నవలలు దర్పణాలుగా ఉండేవి. అందుకే యద్దనపూడి సులోచనా రాణి నవలలు పాఠకులకు ఒక పెద్ద క్రేజ్‌గా మారాయి. స్త్రీ పురుష సంబంధాలు ప్రేమమయంగా, ఆత్మీయంగా, స్వచ్ఛంగా ఉండాలని కోరుకునే ఆ నవలలు అందరికీ ప్రీతిపాత్రమయ్యాయి. నవలా రచనలో సుదీర్ఘ కాలం గడిపిన ఆమె ఇటీవల రాయ దలుచుకున్న కథ 'ఔనా' పూర్తికాక ముందే ఆమె నిద్రలోనే గుండెపోటుతో ఈ నెల 21న అమెరికాలో శాశ్వతనిద్రలోకి వెళ్ళిపోయారు. అక్షర సుగంధాలు విరజిమ్మిన ఓ సాహితీసుమం నేలరాలి పోయింది. ఒక 'మధుర స్వప్నం' నిద్రలోనే జారి పోయింది. ఒక 'జీవనసౌరభం' వాడిపోయింది.. ఆమె హృదయం.. 'అమర హృదయ'మైంది!.. ఆ 'అనురాగ తోరణానికి'...ఆ మహా నవలామణికి 'లాయర్‌' కన్నీటి నివాళి అర్పిస్తోంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter