25 May 2018 Written by 

ఫ్రంట్‌... మరో స్టంట్‌!

frontశత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సూత్రం ప్రాతిపదిక మీదే భారత రాజకీయాలు నడుస్తుంటాయి. కత్తులు దూసుకున్న పార్టీలు ఒకటవుతుం టాయి. కౌగిలించుకొన్న పార్టీలు విడిపోతుంటాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతం ప్రాతిపదిక మీదే దేశ రాజకీయాలలో మరో ఫ్రంట్‌ పురుడు పోసుకోబోతోంది. బెంగుళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవమే దీనికి అంకురార్పణగా మారింది.

తన ప్రమాణస్వీకారోత్సవ సభలో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పినట్లు బీజేపీ అశ్వమేధయాగం గుర్రాన్ని కర్నా టకలో కట్టేసారు. గత నాలుగేళ్ళుగా బీజేపీ అశ్వమేధ యాగ గుర్రం ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటూ వచ్చింది. కర్నాటకలో కూడా జెండా పాతబోయారు కాని కాంగ్రెస్‌-జెడి(ఎస్‌)లు తేరుకుని బీజేపీ జైత్రయాత్రకు అడ్డుకట్టవేయగలిగాయి.

కర్నాటక పరిణామాలు బీజేపీ వ్యతి రేక శక్తులకు ఎనలేనిఉత్సాహాన్ని తెచ్చాయి. గత నాలుగేళ్ళుగా బీజేపీ సాగిస్తున్న దండ యాత్ర, జైత్రయాత్రలతో జాతీయ స్థాయి పార్టీలైన కాంగ్రెస్‌, వామపక్షాలే కాదు, బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌జెడి, ఆర్‌ఎల్‌డి, జెఎంఎం, శివసేన, ఎన్‌సిపి వంటి పార్టీలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక డిఎంకె, టిఎంసి, టీడీపీ వంటి పార్టీలు కూడా బీజేపీ నుండి తమకు ముప్పు పొంచివుందని భయపడుతున్నాయి. కాం గ్రెస్‌తో సహా ఇతర పార్టీలకున్న భయమే వారందరినీ ఏకతాటి పైకి వచ్చేలా చేసింది. కుమారస్వామి ప్రమాణస్వీకా రోత్సవ సభను వారి ఐక్యతకు వేదికగా మలచింది.

ఈ సభకు యూపిఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌, డిఎంకె నుండి కని మొళి, సిపిఎం నుండి సీతారాం ఏచూరి, సిపిఐ నుండి సురవరం సుధాకర్‌రెడ్డి, బిఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్‌జెడి నాయకుడు తేజస్వియాదవ్‌, ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌సింగ్‌, లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అధినేత శరద్‌యాదవ్‌, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌యాదవ్‌, జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌లు ఈ వేదికపై చేతులు కలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ ఏర్పాటుకు ఇక్కడ ఓ అడుగుపడింది.

అయితే ఈ ఫ్రంట్‌ స్వరూపం ఎలా వుంటుందన్నది తెలియాల్సివుంది. కాం గ్రెస్‌ ఇప్పటికే యూపిఏలో వుంది. దాంతో కొన్ని ప్రాంతీయ పార్టీలున్నాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు బీజేపీతోనే వుంటు న్నాయి. రేపు ఏర్పడే ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలి, ఎవరు మెడలో గంట కట్టుకోవాలన్న ప్రశ్న కూడా రావచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలనూ సంప్రదించి వున్నాడు. ఆయన నిన్నటి ప్రమాణస్వీకారోత్సవానికి రాకుండా అంతకు ముందురోజే బెంగుళూరొచ్చి కుమారస్వామిని అభినందించి వెళ్ళారు. ఎక్కడ తన అవినీతి అక్రమాలపై సిబిఐ చేత దాడులు చేయిస్తారోనని భయపడు తున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో అన్ని పక్షాల మద్దతు కోసం తానే ఫ్రంట్‌ ఏర్పా టుకు నడుం కట్టొచ్చు. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన అనుభవం ఆయనకుంది.

కాకపోతే ఈ ఫ్రంట్‌ బీజేపీకి వ్యతి రేకంగా కాంగ్రెస్‌ను కలుపుకుని ఏర్పడు తుందా? లేక బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతి రేకంగా ఏర్పడుతుందా? అన్నది చూడాలి. కాంగ్రెస్‌తో కలవకుండా ఏర్పడితే మళ్ళీ ఏ రాష్ట్రంలో అయినా యధాపరిస్థితే! బీజేపీ వ్యతిరేక ఓటును ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఫ్రంట్‌ పార్టీలు చీల్చుకోవాల్సిందే! అప్పుడు తిరిగి లాభపడేది బీజేపీనే!

దేశ రాజకీయాలలో గతంలో పలు సార్లు సంకీర్ణ ప్రయోగాలు జరిగాయి. 1977లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ జనతా కూటమి ఏడాదికే విచ్ఛిన్నమైంది. 1989లో ఏర్పడ్డ నేషనల్‌ ఫ్రంట్‌ ఆయుష్షు కూడా అర్ధాంతరంగానే ముగిసింది. 1996లో ఏర్పడ్డ యునైటెడ్‌ ఫ్రంట్‌ కూడా ఎక్కువకాలం నిలవలేదు. అసలు దేశ రాజకీయాలలో ఫ్రంట్‌ అనే పేరే కలిసి రాలేదు. ఏదైనా కాంగ్రెస్‌ సారధ్యంలోని యూపిఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణాలే సుస్థిర ప్రభుత్వాలను అందించ గలిగాయి.

ఒక లక్ష్యం, ఒక సిద్ధాంతం, ఒక జాతీయ వాదం లేకుండా కేవలం బీజేపీ పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఏర్పడే ఇలాంటి స్వార్ధ రాజకీయ ఫ్రంట్‌లు టెంట్‌లు మాదిరిగా కూలిపోతాయి తప్పితే ఎక్కువకాలం నిలబడలేవు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter