25 May 2018 Written by 

ఈ రోడ్డు భలే డేంజర్‌ గురూ...

cement roadనెల్లూరు-ఆత్మకూరు మధ్య రోడ్డు... ఒకప్పుడు తారురోడ్డు. ముంబై రహదారిగా పేరు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రా లకు వెళ్ళే వాహనాలకు ప్రధాన మార్గం. గతంలో కృష్ణపట్నంపోర్టు నుండి ముడి ఇనుపఖనిజం ఎగుమతి జరుగుతున్న రోజుల్లో ప్రతిరోజూ కొన్ని వందల లారీలు ఈ రోడ్డు మీద తిరుగుతుండేవి. ఈ లారీల క్రింద పడే ఒక్క నెల్లూరు జిల్లాలోనే వందమందికి పైగా మరణించారు. ఈ లారీల దెబ్బకు అప్పట్లో రోడ్డు కూడా బాగా పాడైపోయింది. దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణపట్నం నుండి పొద్దుటూరు దాకా ముంబై రహదారిని నాలుగులైన్లుగా విస్తరించాలని నిర్ణ యించారు. అయితే ఆయన హఠాన్మరణంతో ఈ ప్రతిపాదన మరుగునపడిపోయింది.

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నెల్లూరు నుండి ఆత్మకూరు సమీపం వరకు సిమెంట్‌ రోడ్డును వేసారు. దాదాపు 300కోట్ల వ్యయంతో ఈ రోడ్డు వేయడం జరిగింది. సిమెంట్‌ ఫ్యాక్టరీలకు ఆదాయం సమకూర్చడానికి తప్పితే ఇలాంటి సిమెంట్‌ రోడ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వేసిన సిమెంట్‌రోడ్డు నాలుగులైన్లు కాదు, గతంలో వున్న డబుల్‌ రోడ్డును ఇంకొంచెం పెంచారంతే. వాహనాలు ఎదురెదురుగా పోవాల్సిందే! ప్రమాదాలు షరా మామూలే! ముఖ్యంగా సిమెంట్‌రోడ్డు మీద వాహనాలలో వెళుతుంటే బండి వూగడంతో పాటు ఒకటే శబ్దం. దీనికితోడు ఈ రోడ్డుపై బండికి పట్టుండదు. ఏదన్నా అడ్డమొచ్చి సడెన్‌ బ్రేక్‌ కొడితే బండి తిరగబడే పరిస్థితి. ఈమధ్య కొన్ని వాహనాలు అలాగే తిరగబడ్డాయి. ఈ సిమెంట్‌రోడ్డు వేయడానికి పెట్టిన ఖర్చుతో శుభ్రంగా నాలుగులైన్ల తారురోడ్డు వచ్చుండేది. భూసేకరణ కూడా జరిపి వుండొచ్చు. తారురోడ్డు మీద వున్న ప్రయాణ సుఖం సిమెంట్‌ రోడ్డు మీద లేకుండాపోయింది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter