01 June 2018 Written by 

బంధం బలపడినట్లే!

telugu congressభారత రాజకీయాలలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. బద్ధశత్రువులు ఏకం అవుతుంటారు, స్నేహితులు విడిపోతుంటారు. గత మూడు దశాబ్దాల కాలంలోనే ఎన్నో విచిత్ర రాజకీయ బంధాలను చూసాం. కాంగ్రెస్‌తో కమ్యూనిష్టులు కలవడం చూసాం... కమ్యూనిష్టులతో బీజేపీ కలిసి పనిచేయడం చూసాం... అగ్రవర్ణాల బీజేపీ, దళిత వర్గాల బిఎస్పీ పొత్తును చూసాం... లౌకికవాద కాంగ్రెస్‌ - మతోన్మాద ముస్లింలీగ్‌ల బంధం చూసాం... హిందుత్వ బీజేపీ - ముస్లిం అనుకూల పిడిపిల మధ్య భాగస్వామ్యాన్ని చూసాం... ఒక్క భారతదేశంలోనే ఇలాంటి చిత్రాతిచిత్రమైన రాజకీయ సంబంధాలను చూడగలం.

రా జకీయ పరిశీలకుల ఊహలకు సైతం అందని ఓ రాజకీయ బంధం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వేదికపై ఏర్పడబోతుందా? తెలుగువారి ఆత్మగౌరవంలో నుండి పుట్టిన పార్టీ ఆ ఆత్మగౌరవాన్ని హత్య చేయాలని చూసిన పార్టీతో చేతులు కలపబోతుందా? గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో వినిపిస్తున్న ప్రశ్నలివి? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ఊహలకు బలం చేకూరుస్తున్నాయి.

ప్రత్యేకహోదా సొడ్డు పెట్టి ఎన్డీఏ నుండి బయటకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త తోడు కోసం వెదుకుతున్నట్లనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కాంగ్రెస్‌కు చేరువవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ముందుచూపుతో వ్యూహాత్మకంగానే బీజేపీని వదిలించుకున్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు రాష్ట్ర ప్రజలలో బీజేపీపై వ్యతిరేకత వుంది. నోట్ల రద్దు, పెట్రోల్‌ ధరలు, జిఎస్టీ వంటివి ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్‌ను తగ్గించాయి. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల అదృష్టం కలిసొచ్చింది. కానీ, 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే నష్టం తప్పదని గ్రహించిన చంద్రబాబు ఆ పార్టీకి దూరమయ్యాడు.

ఇప్పుడు బీజేపీ స్థానంలో ఎవరో ఒకరు తోడు కావాలి. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది రెండుసార్లు. అది కూడా ఒకసారి వాజ్‌పేయి సానుభూతితో, రెండోసారి మోడీ ఇమేజ్‌తో!

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా వెళ్లే సాహసం చేయలేడు. ఏదో ఒక పార్టీ తోడు కావాలి. బీజేపీ, జనసేనలు దూరంగా వున్నాయి. ఇక రాష్ట్రంలో మిగిలింది కాంగ్రెస్‌. ఎలాగూ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా వుంది. ఇక ఎలాగూ కోలుకోదు. 2014ఎన్నికల్లోనే కొంత కాంగ్రెస్‌ కేడర్‌ తెలుగుదేశంలోకి వెళ్ళింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు ఇది కూడా కలిసొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీపై వున్న వ్యతిరేకత కాంగ్రెస్‌పై లేదు. కాబట్టి కాంగ్రెస్‌ను కలుపుకుని ఎన్నికలకు వెళ్ళే దిశగా కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తున్నా రాష్ట్రంలో పది, పదిహేను సీట్లకు వాళ్ళను పరిమితం చేయొచ్చు. దాని వల్ల 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కేడర్‌ను వాడుకోవచ్చు. అదీగాక తెలంగాణ లోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవచ్చు. ఆ రాష్ట్రంలో పార్టీ మనుగడను కాపాడుకోవచ్చు.

వీటన్నింటికి మించి చంద్రబాబు కాంగ్రెస్‌ పట్ల సానుకూల వైఖరి చూపించడానికి ఇంకో కారణం కూడా వుంది. ఆ కారణం 2019 ఎన్నికల తర్వాత ప్రధాని రేసులో నిలవడమే! కర్నాటక వేదికగా చంద్రబాబు నేతృత్వంలో తృతీయ ఫ్రంట్‌ నిర్మాణానికి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలు నడుంకట్టడం తెలిసిందే! 1996లో మాదిరిగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో హంగ్‌ఫలితాలు వస్తే ప్రధాని పీఠం ఛాన్స్‌ తృతీయ ఫ్రంట్‌కే రావచ్చు. 1996లో ప్రధాని అయ్యే అవకాశాన్ని చంద్రబాబు వదులుకున్నాడు. ఆరోజు ప్రధాని అయ్యుంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ఎందుకూ కాకుండా పోయుండే వాడేననుకోండి, ఆరోజు ఆయన తీసుకున్నది తెలివైన నిర్ణయమే! కాని రేపు ఛాన్స్‌ వస్తే మాత్రం వదులుకోకూడదనేది చంద్రబాబు ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో వారసుడున్నాడు కాబట్టి ఆయన ప్రధాని కుర్చీపై ఆశ పెట్టుకోగలడు. ఒకవేళ హంగ్‌ ఫలితాలే వచ్చి తృతీయఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్‌ మద్దతు తప్పనిసరి! ప్రధాని అభ్యర్థి ఎంపికలో కూడా కాంగ్రెస్‌ ప్రధాన పాత్ర పోషించవచ్చు. ఈ దూరదృష్టితోనే చంద్రబాబు ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు చాలా దగ్గరవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ ఆయనలో వుండేది కాంగ్రెస్‌ రక్తమే! ఆ పార్టీ ఓల్డ్‌ స్టూడెంటే! కాబట్టి కాంగ్రెస్‌తో కలవడం, వారితో ఇమిడిపోవడం పెద్ద సమస్య కాదు. అదీకాక ఇప్పుడు రాష్ట్రంలో వుండే తెలుగుదేశం పార్టీ సగానికిపైగా కాంగ్రెస్సే!

కాబట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌లో తెలుగు కాంగ్రెస్‌ పార్టీగా మారినా ఆశ్చర్యపోబల్లేదు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter