01 June 2018 Written by 

పెరుగుతున్న నమ్మకం

modi- ''ప్రజల్ని నేను విశ్వసించాను. నన్ను ప్రజలు విశ్వసించారు.

ఈ పరస్పర విశ్వాసమే దేశానికి చోదకశక్తి''

- 'నేను ప్రధాన మంత్రిని కాదు..దేశానికి ప్రధాన సేవకుణ్ణి' - ప్రధాని నరేంద్రమోడీ

భారత దేశ ప్రధానిగా నరేంద్రమోడీ పదవీ ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లయింది. 2014 మే 16న ఆయన ప్రధానిగా పదవిని అధిష్టించారు. మొన్న మే 26వ తేది నాటికి నాలుగేళ్ళు పూర్తయి, ప్రధానిగా మోడీ అయిదవ వసంతంలోకి అడుగుపెట్టారు. దేశప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు దేశప్రధానిగా మోడీ అత్యంత వేగంగా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. మరెన్నో ప్రజాసంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అవే మోడీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రజల ఆశలు..ఆకాంక్షలు నెరవేర్చాలన్న తాపత్రయంతో ఆయన చేపడుతున్న పథకాలే..ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని నిలబెడుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్రప్రభుత్వం ఈ నాలుగేళ్ళ పాలనలో తొలిదశలో ప్రగతిపథంలో పరుగులు తీసినా, ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి విమర్శలకు గురికావడం, పెద్దనోట్ల రద్దుతో ప్రజలు బాగా ఇబ్బందులు పడడంతో మోడీ పాలన కొంత మేరకు కుదుపులకు లోనైంది. అందుకే ఇప్పుడు ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయినా, దేశంలో ఏదైనా కొత్తగా సంస్కరణలు లేదా అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. ఇంత పెద్ద దేశంలో అన్ని పనులూ, అనుకున్న సమయానికి క్రమబద్ధంగా జరగాలంటే ఎంతో సమయం పడుతుంది కూడా. ఆ దశలోనే తప్పటడుగుల్ని, బాలారిష్టాల్ని దాటుకుని నడవడానికి ఉపక్రమించాలి. దేశ ఆర్ధిక పరిస్థితి, దేశభద్రత, ప్రజాసంక్షేమం..అన్నీ చూసుకుని, ఇక పర్వాలేదనుకున్నప్పుడే ప్రగతిపధంలో పరుగులు తీయాలి. నాలుగేళ్ళ చిరుప్రాయంలోనే పరుగులు తీయాలంటే..మనిషికైనా, దేశానికైనా కష్టమే.

60 ఏళ్ళ కాంగ్రెస్‌ పాలనలో భ్రష్టుపట్టిపోయిన దేశాన్ని కేవలం నాలుగేళ్లలోనే బాగుచేయాలంటే చిన్న విషయమేమీ కాదు. అయినా, ప్రధాని మోడీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ కర్తవ్యనిర్వహణలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతుండడం విశేషం. ప్రధానిగా మోడీ పాలనలోకి వచ్చేనాటికి కాంగ్రెస్‌ హయంలో దేశంలోని అన్ని వ్యవస్థలూ నీరసంతో అడుగంటిపోయి ఉన్నాయి. చిత్తం వచ్చిన రీతిలో పాలన సాగించడం, నల్లధనం పెరిగిపోవడం, నిరుద్యోగం పెరగడం, సామాన్యప్రజల జీవనప్రమాణాలు అడుగంటిపోవడం, మరోవైపు అవినీతి అక్రమాలు, కుంభకోణాలు విజృంభించడం... ఇలా అన్నిరకాలుగా దేశం భ్రష్టుపట్టి పోవడంతో ప్రజలు కాంగ్రెస్‌తో విసిగిపోయారు. పెద్దఎత్తున బిజెపికి ఓట్లేసి గెలిపించారు. ప్రధాని మోడీ పట్ల ఎంతో విశ్వాసంతో ఆ పార్టీని అందలమెక్కించారు. మోడీ వచ్చీ రావడంతోనే అవినీతిపై యుద్ధం ప్రకటించారు. ఇప్పటికే 73వేల కోట్ల నల్లధనాన్ని వెలికితీశారు. తిరిగి దేశం అంతర్జాతీయస్థాయిలో సగర్వంగా ఉండేలా దేశప్రతిష్టను ఇనుమడింపజేశారు. అంతేకాదు, దేశంలో మోడీ పాలనలో జిడిపి వృద్ధి రేటు 7.2 శాతానికి చేరుకుంది. నేటికీ ద్రవ్యలోటు 3.5 శాతానికి దిగివచ్చి నియంత్రిత స్థాయిలోనే ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. పారిశ్రామికోత్పత్తి పెరిగింది. విదేశీమారక నిల్వలు గణనీ యంగా పెరిగి, తాజాగా అవి 41,700కోట్లకు చేరుకున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాబట్టు కునేందుకు సరళీకృతవిధానాలు అవలంభించడంతో దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఆ పెట్టు బడులు పెరిగాయి గత ఏడాది నాటికి వీటి విలువ 4350 కోట్ల డాలర్లుకు చేరుకున్నాయి. గ్రామీణ విద్యుద్దీకరణ, గ్రామీణ రోడ్లు గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి. మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, జన్‌ధన్‌ యోజన, స్వచ్ఛభారత్‌ వంటి పథకాలు ప్రజలకు బాగా చేరువవుతున్నాయి.

వీటన్నిటికీ మించి ఈ నాలుగేళ్ళలో అవినీతిరహిత పాలనతో ప్రజల్లో మోడీ పట్ల ఉన్న విశ్వాసం మరింత పెరుగుతూనే ఉంది. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి ప్రారంభదశలో కొంత ఇబ్బందులకు గురి చేసినా ప్రజల్లో మాత్రం మోడీపై ఉన్న విశ్వాసం నేటికీ ఏమాత్రం తరగలేదు. అంతేకాదు, ఆ నమ్మకం.. ఇప్పుడు క్రమంగా పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం తగ్గ లేదన్నది వాస్తవం.

నేను ప్రధానమంత్రిని కాదు, దేశానికి ప్రధాన సేవకుణ్ణి అంటూ ప్రజల ముందుకు వచ్చి సగర్వంగా ప్రకటించుకుని, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, అవినీతి రహిత.. విశుద్ధపాలనే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోండడం ఎంతో విశేషం. కనుకనే కొన్ని ఒడిదుడుకులున్నా.. మోడీ పట్ల ప్రజలకున్న నమ్మకం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరడం లేదు. అట్టడుగుస్థాయి ప్రజలకు సైతం మోడీ సంక్షేమ పథకాలతో తద్వారా దేశప్రజలకు తన పట్ల ఉన్న విశ్వాసాన్ని మోడీ నిలబెట్టుకుంటూనే ఉన్నారు. అయితే, చేసింది తక్కువే. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆకాశాన్నంటుతున్న ఆయిల్‌ ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల బాధలు అన్నిన్ని కావు. నిరుపేదల అవస్తలు ఇంకా వర్ణనాతీతం. ఈ విషయాలన్నిటినీ కేంద్రం మరోసారి సమీక్షించుకోవాల్సివుంది. ముఖ్యంగా వెంటనే ధరలను బాగా నియంత్రించి సామాన్యుల జీవనప్రమాణాలను పెంచాల్సివుంది. నిరుద్యోగులకు, రైతులకు, కార్మికులకు బాసటగా పథకాలు ప్రవేశపెట్టి, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సి వుంది. యువతకు, మహిళాభ్యున్నతికి పెద్దఎత్తున చేయూతను అందించాల్సి ఉంది. ఆర్ధిక వ్యవస్థను మరింతగా పరిపుష్టం చేయాల్సివుంది. వృద్ధి శాతాన్ని బాగా సాధించాల్సివుంది. అప్పుడే దేశం మరింతగా పురోగమిస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రగతి మార్గం చేరువైనప్పుడే, అందరికీ అభివృద్ధి ఫలాలను అందించినప్పడే 'శ్రేష్ఠ్‌ భారత్‌' సాకారం అవుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter