01 June 2018 Written by 

ఈ ముగ్గురిలో... ఎవరు బెటర్‌?

3ఆనం రామనారాయణరెడ్డిపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశలు వదులుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనను ఇక పార్టీలో నిలబెట్టలేమని వారికి అర్ధమై పోయింది. ఈ జిల్లాలో తెలుగుదేశంపార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్న నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి! అది కూడా ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థి అయితే! ఆయనే లేకుంటే గట్టిపోటీ ఇవ్వడం కష్టం. ఆయనే అవతల వైసిపి అభ్యర్థి అయితే పోటీ ఇంకా కష్టం.

ఏ నియోజకవర్గంలో ఎవరు మేటి అభ్యర్థి కాగలరు? అని నియోజకవర్గాల వారీగా తెలుగుదేశంపార్టీ సర్వే నిర్వహిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి నిర్వహిస్తున్న సర్వేను ముగ్గురు నాయకుల మీదే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు కాగా, ఇంకొకరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మూడో నాయకుడు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గూటూరు కన్నబాబు! ఆనం రామనారాయణరెడ్డి నూటికి నూరు శాతం తెలుగుదేశంలోనే ఉంటా డనుకుంటే అసలు ఇక్కడ సర్వేనే అవసరం లేదు. ఆనం రామనారాయణరెడ్డి పేరు తప్ప ఇంకో పేరుతో పనేలేదు. ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోతాడనే నమ్మకంతోనే ఆత్మకూరుకు ప్రత్యామ్నాయ అభ్యర్థి అన్వేషణ మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ కోణంలోనే నాలుగేళ్ళ నుండి రాజకీయాలకు దూరంగా వుంటున్న కొమ్మి లక్ష్మయ్యను మళ్ళీ తెరమీదకు తెచ్చారు. ఈయన ఆత్మకూరులో ఒకప్పుడు గట్టి నాయకుడే! పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచి సత్తా చాటుకున్న నాయకుడు. కాకపోతే నియోజకవర్గంలో అప్పుడున్నంత క్రేజ్‌ ఇప్పుడు లేదు. గతంలో సహకరించిన 'రెడ్డి' వర్గం ఇప్పుడు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. గూటూరు కన్నబాబు కూడా సరిపోడని 2014 ఎన్నికల్లోనే తేలింది. ఎన్నికల తర్వాత ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా వుంటూ కొంత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుండగానే కన్నబాబును చంద్రబాబే పక్కన పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా పెట్టినా పుంజుకోవడం కష్టం. వీళ్ళిద్దరిదీ ఒకే సామాజికవర్గం. అభ్యర్థి ఏ వర్గం వాళ్ళయినా కమ్మ సామాజిక వర్గీయుల ఓట్లు 90శాతం తెలుగుదేశంకే పడతాయి. ఇక్కడ 'రెడ్ల'లో చీలిక ముఖ్యం. ఈ కోణంలోనే ఆ సామాజికవర్గానికి చెందిన మెట్టుకూరు ధనుంజయరెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరుకు ఫ్రెష్‌ క్యాండేట్‌, ఆర్ధికంగా నిలబడగలడు, స్థానికుడు, వివాద రహితుడు. ఇరు పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలున్నాయి. కొంతవరకైనా 'రెడ్ల' ఓట్లను తెచ్చుకోగలడు. కాబట్టి ఈ ముగ్గురిలో మెట్టుకూరువైపే మొగ్గు కనపడవచ్చు. అయితే వైసిపి అభ్యర్థి ఎవరనేదానిని బట్టే ఈ ముగ్గురిలో ఎవరు బెటర్‌ అనేది ఫైనల్‌గా తేలుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter