01 Jun
Written by 

నోరుజారి దిద్దుకున్న సోమిరెడ్డి

somiredరాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే! అయితే రాజకీయ నాయకులకు మధ్యే ఈ విమర్శలు పరిమితమైతే ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద ఆరోపణలు చేయడం, అతను ప్రత్యారోపణలు చేయడం సర్వసాధారణం. కాని రాజకీయాలతో సంబంధంలేని, అదీగాక ఒక గౌరవప్రదమైన వృత్తిని నిర్వహిస్తున్న వ్యక్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణే వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న నాయకుడు. రాజకీయంగా ఎందరిపైనో విమర్శలు చేస్తుంటాడు. ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్‌ను అయితే సోమిరెడ్డి విమర్శించినంతగా టీడీపీలో ఇంకెవరూ విమర్శించరు. అయితే విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా సబ్జెక్ట్‌ వారీగానే పోతాడనే పేరుంది. మరీముఖ్యంగా ఆనంవాళ్ళలాగా వ్యక్తిగత విమర్శలకు దిగకుండా తన స్థాయిని కాపాడుకుంటూవచ్చాడు. ఎక్కడ ఏ సమావేశంలో అయినా చాలాజాగ్రత్తగా మాట్లాడే సోమిరెడ్డి విజయవాడలో జరిగిన మహానాడు ముందురోజు విలేకరుల సమావేశంలో మాత్రం తొందరపడి నోరు జారాడు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న టీటీడీ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణదీక్షితులను బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయంటూ మాటదొర్లాడు. ఈ మాటలు నాయకుడిగా ఆయన ప్రతిష్టకు కూడా మచ్చతెచ్చాయి. బ్రాహ్మణ కమ్యూనిటీలో వ్యతిరేకతను తెచ్చింది. పార్టీపరంగా రమణదీక్షితులతో ఏదన్నా సమస్యవుంటే వుండేది తెలుగుదేశం ప్రభుత్వమే! ఆయన ఆస్తుల మీద, ఆయన ఆదాయం మీద విచారణ చేయించండి, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోండి, అంతేగాని చట్ట పరిధిని మించి మాట్లాడడం కరెక్ట్‌ కాదు. అసలు రాజకీయాలను దాటి ఎప్పుడూ విమర్శలు చేయని సోమిరెడ్డి టైం బాగాలేక రమణదీక్షితులపై ఫైర్‌ అయినట్లుంది. చేసింది పెద్ద పొరపాటే... వెంటనే ఆయననే క్షమాపణ కోరి సోమిరెడ్డి జరిగిన పొరపాటును కొంతవరకు సరిదిద్దుకోవడం మంచిదైంది.

Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter