08 June 2018 Written by 

పంచతంత్రం

panchatantramతర్వాత ఎటువంటి ఆధారం లేని రాష్ట్రా నికి అదే సంజీవని. ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తు, భద్రత అదే! విభజన బిల్లులో ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చకుండా నాటి యూపిఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను వంచనకు గురిచేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశాలు లేవని ప్రణాళికా సంఘం చెప్పిందంటూ చేతు లెత్తేసింది. కేంద్రం ఇవ్వకుంటే, ఎందు కివ్వరు, ఇది మా హక్కు అంటూ కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హోదా కంటే ప్యాకేజీయే మేలంటూ సరిపెట్టు కుంది. ఈ విధంగా పై మూడు ప్రభు త్వాలు ఆంధ్రా ప్రజానీకానికి తీరని ద్రోహం చేసాయి.

ప్రత్యేకహోదా అంటే జైలుకే అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా బెదిరింపులకు దిగినా ఈ రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది, నాలుగేళ్ళుగా నడిపింది, జనం గుండెలను తాకేలా చేసింది, కేంద్రాన్ని కదిలించేలా చేసింది ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డే! నాలుగేళ్ళుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ దీని కోసం నిరంతర పోరాటం చేస్తూనేవుంది.

ప్రత్యేకహోదా కోసం దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, బంద్‌లు... వైసిపి ఆధ్వర్యంలో జరిగాయి. హోదా ఉద్యమంలో జగన్‌ వేసిన మరో ముందడుగే తన పార్టీ లోక్‌సభ సభ్యుల చేత రాజీనామాలు చేయించడం. వైసిపి లోక్‌సభ సభ్యులు 5మంది గత నెలలోనే రాజీనామాలు చేసారు. లోక్‌సభ స్పీకర్‌ ఫార్మాట్‌లోనే చేసారు. ఈ 5మంది మళ్ళీ ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ ఒకటికి రెండుసార్లు ఎంపీలను వివరణ అడిగారు. మొన్న ధృవీకరణ పత్రాలు కూడా తీసుకున్నారు. ఈ ఐదుగురి రాజీనామాలను ఇక ఆమోదించినట్లే! దీంతో ఆరు నెలలలోపే ఆ ఐదు స్థానాలకు తిరిగి ఉపఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది.

అయితే లోక్‌సభ గడువు ఏడాది కాలమే వుంది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం కూడా గడువు లేని తరుణంలో వ్యయప్రయాసలు తప్ప, ఇంకోటి లేని ఈ ఉపఎన్నికలు అవసరమా అనే చర్చ కూడా నడుస్తోంది. వాస్తవ దృష్టితో చూస్తే ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు వుండగా ఇంతలోపే మళ్ళీ ఎన్నికలు అనవసరం. ఇప్పుడు ఈ ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించినా తిరిగి సార్వత్రిక ఎన్నికలలోనూ మళ్ళీ ఎన్నికలు తప్పవు. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా కావడంతో పాటు, రాజకీయ పార్టీలకు కూడా అనవసరమైన ఖర్చు.

ఒకవేళ లోక్‌సభ స్పీకర్‌ రాజీనామాలు ఆమోదించి ఎన్నికలు వచ్చాయే అనుకుందాం. వైసిపి ఎంపీలు తమ స్థానాల నుండే పోటీ చేస్తారు. టీడీపీ కూడా ఉపఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టే అవకాశముంది. అయితే ఇక్కడ లాజిక్‌ ఏంటంటే వైకాపా ఎంపీలు 5మంది కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సవాల్‌ విసురుతూ రాజీనామా చేయలేదు. ప్రత్యేకహోదా ఇవ్వనందుకు కేంద్ర వైఖరికి నిరసనగానే రాజీనామా చేసారు. రేపు ఉప ఎన్నికలలో ప్రత్యేకహోదా నినాదంతోనే వాళ్ళు పోటీ చేస్తారు. మరి తెలుగుదేశం తమ అభ్యర్థులను పోటీలోకి దించి వైసిపి ఎంపీలను ఓడించాలని చూసినా, ఓడించినా అది వారిని ఓడించినట్లు కాదు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఓడించినట్లు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకహోదా అవసరం లేదని కేంద్రానికి తెలియపరిచినట్లు. మరి ఇప్పటికే ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగార్చిన తెలుగుదేశం మరోసారి అటువంటి పనికి పాల్పడుతుందా?

ఉపఎన్నికలు రాకుంటే తెలుగుదేశంతో పాటు వైసిపికి కూడా మేలే! ఉపఎన్నికల వల్ల ఇరుపార్టీలకు ఒరిగేదేమీ లేదు. ఇద్దరికీ దండగ ఖర్చే! కేంద్రం కూడా ఇదే ఆలో చిస్తుండొచ్చు. ఒకవేళ లోక్‌సభ స్పీకర్‌ ఇప్పుడే రాజీనామాలు ఆమోదించినా కూడా

ఉపఎన్నికలకు అవకాశం తక్కువ. ఎన్డీఏ ప్రభుత్వం నవంబర్‌, డిసెంబర్‌లలోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళే అవకాశాలున్నాయి. త్వరలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రా లకు ఎన్నికలున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆ రాష్ట్రాల ఎన్నికలను కలిపి పెట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ముం దస్తు ఎన్నికలు ఆలోచన వున్నా వైసిపి ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించవచ్చు. ఉపఎన్నికలు రాకపోయినా ప్రత్యేకహోదా కోసం పదవులు వదులుకున్న త్యాగమూర్తులుగా వాళ్ళకు గుర్తింపు లభిస్తుంది.

ఎంపీల రాజీనామాలు రాజకీయంగా వైకాపాకు ఎంతోకొంత ప్రయోజనం చేకూర్చేవే! ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఇప్పటికే సొంతం చేసుకున్న వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే ఉపఎన్నికలు వచ్చినా, రాకున్నా ఈ ఉద్యమంలో మరో మైలురాయిని దాటినట్లే!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter