08 June 2018 Written by 

ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?

anam ramఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మంత్రి నారాయణ స్వయంగా ఫోన్‌ చేసి ఆత్మకూరులో నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని కోరినా రామనారాయణ రెడ్డి వినలేదు. నేనుండడం లేదు, మీ పాటికి మీరు చేసుకోండని చెప్పినట్లు తెలుస్తోంది. 8వ తేదీ చంద్రబాబు పర్యటనకు హాజరు కావాలని కోరినా తాను ఆరోజు నెల్లూరులో ఉండడం లేదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన టీడీపీని వీడనున్నాడనే విషయం అర్ధమైపోయింది. ఆయనను పార్టీలో నిలబెట్టాలని నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫల మయ్యాయి. అయితే ఆత్మకూరులో జరిగిన రాజకీయ పరిణామాలను చూసి స్థానికంగా వున్న ఓ వర్గం వాళ్ళు మాత్రం తెలుగు దేశం పార్టీ వాళ్ళకు ఇలా జరగాల్సిందేలే అని చంకలు గుద్దుకుంటున్నారు.

ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరిన తర్వాత అప్పటి వరకు ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహ రించిన గూటూరు కన్నబాబును పక్కనపెట్టారు. ఇన్‌ఛార్జ్‌గా కన్నబాబు అప్పుడప్పుడే ఆత్మకూరులో వర్గాన్ని పెంచుకుంటున్నాడు. 2014 ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ఇన్‌ఛార్జ్‌గా వుంటూనే పార్టీ అధికారంలో వుంది కాబట్టి అన్ని శాఖలపై అజమాయిషీ చేసాడు. అనుచరులకు పనులు చేసిపెట్టాడు. కొంతవరకు వర్గాన్ని కూడగట్టాడు. సడెన్‌గా ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడం, ఇన్‌ఛార్జ్‌గా ఆయనను నియమించడంతో కన్నబాబు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

ఇప్పుడు ఆత్మకూరులో తెలుగుదేశం బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే ప్రశ్న వస్తోంది. కన్నబాబుకు బాధ్యతలు ఇచ్చినా మళ్ళీ మొదటి నుండి పరుగు మొదలుపెట్టాలి. మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును రంగంలోకి దించినా పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. ఆయన ఆత్మకూరుకు దూరమై పదేళ్ళు కావస్తోంది. ఇక్కడ మునుపటి హవా వుండకపోవచ్చు. మొత్తానికి ఆనం వెళితే ఆత్మకూరు టీడీపీలో రాజకీయ శూన్యత ఖాయం.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter