Tuesday, 04 March 2014 07:11

వేడుకలు

Written by 
Rate this item
(0 votes)

పాఠకదేవ్వుళ్ళ పండుగ

పత్రికకు పాఠకులే దేవుళ్ళు. పాఠకుల ఆదరణ, ఆశీస్సులే కొండంత అండ. అందుకే లాయర్ నిర్వహించే ప్రతి వేడుక ఓ పండుగే. పాఠకదేవుళ్ళను ఆరాధించే పవిత్రమైన పండుగ.

కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డి గారి జన్మదినమైన నవంబర్ 8వ తేదీన 1996లో తొలిసారిగా నిర్వహించిన తుంగా పండుగ మొదలు 1997లో స్థానిక పత్రికా ప్రపంచంలోనే ఓ సంచలనంగా జరుపబడిన పాఠకుల పండుగ, నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన నవ్వుల పండుగ, పాత క్రొత్త పాటల మేలికలయికతో అలరించిన పాటల పండుగ, సాక్షూత్తూ నాటి రాష్ర్ట ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి గారే స్వయంగా అరుదెంచి అభినందించి, ఆశీర్వదించిన రజతోత్సవ పండుగ, సరిగమప అంటూ చిట్టి చిన్నారులు తమ గాన మాధుర్యంతో పరవశింపజేసిన సంగీత పండుగ... ఈ పండుగలన్నీ పాఠక మహాశయులను దైవాలకు ప్రతిరూపాలుగా భావించి లాయర్ వారికి అంకితమిచ్చిన ఆనంద సంబరాలే.

లాయర్ పత్రికను అత్యంత అందంగా రూపొందించి అపురూపంగా పాఠకులకు అందించే లాయర్ సిబ్బందికి వస్ర్తాలను బహూకరించడం ఈ పండుగలో ఓ సత్సంప్రదాయం. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఓ జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ప్రతి వార్షికోత్సవ పండుగలో ఓ ప్రత్యేకం. 

 

చిరస్మరణీయం రజతోత్సవం

 

పాతికేళ్ళ నిర్విరామ ప్రయాణం, మూడువందల నెలల నిరంతరశ్రమ, పదమూడు వందల వారాల నిస్వార్థకృషికి తార్కాణంగా హృదయోల్లాస ఆనంద సంరంభంగా జరిగింది లాయర్ రజతోత్సవం. ఈ యుగానికే గొప్ప వ్యక్తిగా యావత్ ప్రపంచం కీర్తింపబడిన ఆరణాల అచ్చ తెలుగు బిడ్డ ఆంధ్రరాష్ర్ట ముఖ్యమంత్రి, జనహృదయవిజేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యఅతిథిగా ఈ వేడుక జరిగింది.

 

లాయర్ తో ఆయనకున్న అనుబంధం, లాయర్ ఆయనకిచ్చిన సలహాలను, పాటించిన సందర్భాల మాటలు ఆయన నోట ముత్యాలలా జారుతుంటే లాయర్ ఆత్మీయుల హృదయం పులకించిపోయింది. ఆంధ్ర సాహితీ ప్రపంచంలోనే ఓ చిన్న పత్రిక చేసిన అతిపెద్ద సాహసంగా చరిత్రకెక్కిన లాయర్ రజతోత్సవ ప్రత్యేక సంచిక వారి అమృతహస్తాలతో ఆవిష్కరించబడి, లాయర్ ని ప్రముఖ వారపత్రికల స్థాయిలో అగ్రగామిగా నిలిపింది. తనకంటూ ఓ సొంత గూటిని ఏర్పాటు చేసుకున్న లాయర్ కార్యాలయాన్ని వై.యస్ సువర్ణహస్తాలతో ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి లాయర్ శ్రేయోభిలాషుల గుండె ఉప్పొంగి పోయింది. లాయర్ చరిత్రలో ఇది ఓ మరపురాని మరువలేని రోజు. లాయర్ ప్రస్థానంలో ఇది ఓ చిరస్మరణీయమైన ఘట్టం.

 

Read 2569 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter