21 March 2014 Written by 

వినాశకర విధానం

ediదేశం మరో సార్వత్రిక ఎన్నికల సమారాంగానికి ముస్తాబయ్యింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా యుద్ధ వేదిక దూకడానికి కత్తులు నూరుతున్నాయి. అన్ని పార్టీలు కూడా దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. యూపీఏ, ఎన్డీఏ, థర్డ్ ఫ్రంటే కూటములు కేంద్రంలో అధికార సాధన దిశగా కసరత్తులను ముమ్మరం చేసాయి. ఎన్నికల తర్వాత ఏదో ఒక కూడమి అధికారంలోకి వస్తుంది. అయితే ఇలాంటి కూటములు ఎంతకాలం నిలుస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతుంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకే అది సవాల్ గా మారుతుంది.

ఇంకెన్ని సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినా కూటములు తప్ప సొంతంగా ఒక పార్టీ కి సంపూర్ణ మెజార్టీ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల స్థాయి కి దిగజారిపోవడమే ఇందుకు కారణం. కేంద్రంలో ఒకే ఒక పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడమన్నది 1992లో పి.వి.నరసింహ రావుతోనే ఆగిపోయింది. అప్పుడు కూడా ఆయన ఎన్నో పార్టీలను చీల్చి కాంగ్రెస్ కు మద్దతు కూడగట్టడం ద్వారా ప్రభుత్వాన్ని నడపగలిగిగాడు. తర్వాత కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో ఒకే పార్టీ అధికారంలోకి రావడమన్నది కలగా మారింది. రేపటి సార్వత్రిక ఎన్నికలకు 30 వేల కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా! ఇది ప్రభుత్వ ఖర్చు. ఇక అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చును చూస్తే లక్షలకోట్లలోన్ ఉంటుంది. ఐదేళ్లకోసారి ఖర్చును భరించడానికి దేశవ్యవస్థ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తప్పని ఖర్చును భరించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ అంత పటిశ్టంగా లేదంటే మూడుసార్లు ఖర్చును భరించాలంటే దేశ ఆర్థిక అగ్రదేశాలైనా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్నమీలలో మనమెప్పుడైనా మధ్యంతర ఎన్నికలను గురించి విన్నామా? వాళ్లకు మధ్యంతర ఎన్నికల ప్రశ్నే వుండదు. వాళ్ల రాజకీయ వ్యవస్థ అంత స్థిరత్వం కలిగి ఉంది.

కాని భారత పార్లమెంట్ వ్యవస్థే నానాటికి బలహీనపడుతూ వస్తుంది. పార్లమెంట్ బలహీన పడసాగాకే మూడు దశాబ్దాల కాలంలో నాలుగు సార్లు దేశం మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశానికి ఇది ఆర్థికంగా ఎంత భారం? 1999లో కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఒకే ఒక సీటు తగ్గినందు వల్ల పడిపోయింది. ఒక్క సీటు తగ్గిన పాపానికి మధ్యంతర ఎన్నికల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థ పై వేల కోట్ల భారం పడింది. మంచి కైనా, చెడుకైనా కేంద్రంలో సుస్థిర, సమర్థవంతమైన ప్రభుత్వాలు ఏర్పాటు కావడం దేశానికే మంచిది. వారాలలో, నెలల్లో కూలిపోయే ప్రభుత్వాలను ఎన్నుకుంటే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కూడా కుప్ప కూలడం ఖాయం.

కాని రేపు జరగబోతున్న ఎన్నికలు, తర్వాత ఫలితం తూరును గమనిస్తే భారత పార్లమెంటుకు మధ్యంతర భయం తొలిగిపోలేదనిపిస్తుంది. లోక్ సభలో 272 టార్గెట్ దాటడం అనుమానమే. కూటమి టార్గెట్ దాటితే ఇబ్బంది లేదు. 5 ఏళ్లు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వమే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కూటమికి పూర్తి మెజార్టీ రాకపోతే మరికొన్ని చిన్నాచితకా పార్టీల మద్దతు అవసరమవుతుంది. అప్పుడు రెండు సీట్లున్న ప్రాంతీయ పార్టీలు కూడా కీలకంగా మారుతాయి. రెంటు సీట్లున్న పార్టీలు 200 సీట్లు కలిగిన పార్టీని శాసిస్తుంటారు. ప్రాంతీయ పార్టీలు గొంతెమ్మ కోరికలతో కేంద్రం గొంతు మీద కూర్చంటాయి. ివి తీర్చలేక, అలాగని వ్యతిరేకించలేక కేంద్ర పాలకలకు సమస్యలతోనే సరిపోతుంది. ఒక వేళ ఎన్డీఏ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, థర్డ్ఫ్రంట్ లు కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇదే పరిస్థితి, కాంగ్రెస్ మూడో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే దేశానికి మరో సారి మధ్యంతర ఎన్నికల ప్రమాదమున్నట్టే ! చర్రితలో ఇప్పటి వరకు మూడు సంకీర్ణ ప్రభుత్వాలను కూల్చి మధ్యంతర ఎన్నికలను దేశం పైరుద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీదే! అధికారంలో కాంగ్రెస్ లేకుండా పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడడమనేది ప్రమాదకర చర్య.

దేశంలో చీటికిమాటికి ప్రభుత్వాలు కూలిపోవడం, మధ్యతర ఎన్నికలు రావడం అనే   ప్రహసనానికి స్వస్తి పలకాలి. తంతు ఆగిపోవాంటే కేంద్రంలో సమర్ధవంతమైన పార్టీలు, శక్తివంతమైన, నాయకత్వాలు రావాలి. జాతీయ రాజకీయాలపై ప్రాతీయ పార్టీల ప్రభావం కూడా తగ్గాలి. ఒకసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఐదేళ్ల వరకు అది స్థిరంగా నిలిచేలా ఉండలి. ఏక పార్టీ పాలనతోనే ఇది సాధ్యమవుతుంది. కాని ఒకే పార్టీకి మెజార్టీ కష్టమనుకున్న పక్షంలో కవీసం ఎన్నికల ముందే పార్టీల సమూహంగా మారిన కూటములలో మంచి కూటమికన్నా సంపూర్ణ మెజార్టీ ఇవ్వగలిగితే కొంత మంచి వాతావరణమన్నా ఏర్పడగలదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter