01 May 2014 Written by 

చెన్నయ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో జంట పేలుళ్లు

bombblastsచెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో తొమ్మిదో నెంబర్ ప్లాట్ ‌ఫామ్‌పై గురువారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పదిమంది గాయపడినట్లు సమాచారం, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన యువతి గుంటూరుకు చెందిన స్వాతి(22)గా పోలీసులు భావిస్తున్నారు. ట్రైన్‌లో దాక్కుని ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు ఘటనకు అతనికి ఏమైనా సంబంధం ఉందా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

రైల్వే స్టేషన్లోని 9వ నెంబర్ ఫ్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న (త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న) గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్-5 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు.  ఈ పేలుడు ఉదయం 7.20 నిమిషాలకు జరిగింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  రైల్వే పోలీసులు అంబులెన్స్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుడు ఫలితంగా రెండు బోగీలతో పాటు ప్లాట్ఫారం కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్లాట్ఫారాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రైల్లో మరిన్ని బాంబులు ఏమైనా ఉన్నాయేమోనని పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. చెన్నై వస్తున్న పలు రైళ్లను ఇతర స్టేషన్లలో ఆపేశారు. తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు.chennaicentral



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter