28 May 2014 Written by 

తెలుగు యువత పగ్గాలు లోకేష్‌కే ?

lokeshbabu1టిడిపి వారసత్వ రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశే వారసుడని గుసగుసలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి పోటీ నుంచి తప్పుకున్నట్లేనని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన లోకసభ, శాసనసభ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏ మాత్రం లేదు. అయినప్పటికీ టిడిపి సీమాంధ్రలో ఘన విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. రాజకీయాల్లో నారా లోకేష్ తన సత్తా చాటుకున్నట్లయింది. దీంతో నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మహానాడు పోస్టర్లపై చంద్రబాబుతో సమానంగా నారా లోకేష్ చిత్రం చోటు చేసుకుంది. తెలుగు యువత పగ్గాలను నారా లోకేష్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి నందమూరి హరికృష్ణ నుంచి కూడా ఏ విధమైన వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చునని అంటున్నారు. ఎన్నికల్లో నారా లోకేష్ నిర్వహించిన పాత్ర వల్ల అడ్డంకులను అధిగమించినట్లు భావిస్తున్నారు. నిజానికి నారా లోకేష్ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. అయితే, ఆయన పోటీ చేయలేదు. ఆయన పోటీ చేయకపోవడం వల్ల నందమూరి హరికృష్ణకు టికెట్ నిరాకరించడానికి చంద్రబాబుకు వీలైందని అంటున్నారు. ఏమైనా, టిడిపిలో నారా లోకేష్ ఆధిపత్యం ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter