Friday, 30 May 2014 06:29

వార్త – వ్యాఖ్య

Written by 
Rate this item
(0 votes)

వార్త     -        రాష్ర్టాల అభివృద్ధికి పాటుపడదాం. – ఏపిఎన్ జిఓ, టిఎన్ జిఓ నేతల పిలుపు.

వ్యాఖ్య  -        తెలంగాణ సరే, సీమాంధ్ర అభివృద్ధికి పాట్లు పడక తప్పదు.

వార్త     -        ఎన్నికల్లో బాగా పనిచేసారు. – కలెక్టర్లతో సిఎస్.

వ్యాఖ్య  -        ఇదే పనితీరు మిగతా విషయాల్లో కూడా చూపిస్తే ఎంతో బాగుండు.

వార్త     -        పార్టీ ఫిరాయింపులు నీవు నేర్పిందే. – జగన్ పై విరుచుకుపడ్డ రఘువీరా.

వ్యాఖ్య  -        ఎవరు నేర్చుకున్నా ఆదిగురువు మీ కాంగ్రెస్ పార్టీయే లేండి.

వార్త     -        ఆఁధ్రాలో తక్షణం హైకోర్టు ఏర్పాటు చేయాలి. – సీమాంధ్ర న్యాయవాదుల ఐకాస.

వ్యాఖ్య  -        హైదరాబాద్ లో వుంటే రోజూ తన్నుకోవాల్సి వస్తుందనా.

వార్త     -        నల్లధనంపై రణం. – ప్రధాని మోడీ తొలి నిర్ణయం.

వ్యాఖ్య -        ఆయన పదవీకాలం ముగిసేనాటికన్నా నల్లధనం వెనక్కివస్తుందో లేదో.

వార్త     -        సామాన్యులకు చేరువలో విమానయానం. – కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు.

వ్యాఖ్య  -        పల్లెవెలుగు బస్సుల్లాగా పల్లె వెలుగు విమానాలను కూడా ఏర్పాటు చేస్తారా.

వార్త     -        న్యాయానికీ కులం ఉంది. – చుండూరు కేసు కోర్టు తీర్పుపై కల్యాణరావు ఆవేదన.

వ్యాఖ్య  -        ఇఁకా లోతుకు పోతే మతం కూడా ఉంది.

వార్త     -        పోలవరంపై పోరాడుతాం. – కేసీఆర్.

వ్యాఖ్య  -        మీకు సీఎఁ పోస్టు కంటే ప్రతిపక్షనేత పోస్ట్ కరెక్ట్.

Read 352 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter