Friday, 06 June 2014 12:50

వార్త – వ్యాఖ్య

Written by 
Rate this item
(0 votes)

వార్త     -        రాజధానికి 2లక్షల కోట్లు. – చంద్రబాబుతో సమావేశంలో అధికారుల అంచనా.

వ్యాఖ్య  -        మిగిలిన రాష్ట్రాన్ని అమ్మినా ఇంత రాదేమో.

వార్త     -        అవసరమైతే ఆంధ్రకు రైల్వేజోన్. – రైల్వే మంత్రి సదానందగౌడ్.

వ్యాఖ్య  -        అవసరమైతే ఏంటి... అవసరమే.

వార్త     -        కేసీఆర్ హూందాగా వ్యవహరించాలి. – మాజీఎంపీ కావూరి.

వ్యాఖ్య  -        ముందు హూందా అంటే ఏంటో ఆయనకు తెలియాలిగా.

వార్త     -        కొద్దిరోజులు ఇంటి నుండే పాలన. – సిద్ధంకాని కేసీఆర్ క్యాంపు కార్యాలయం.

వ్యాఖ్య  -        ఇల్లు అలవాటైతే ఇక మారడేమో.

వార్త     -        నవ్యాంధ్రప్రదేశ్ కు మేమిచ్చిన హామీలు పూర్తి చేయండి. – మోడీకి సోనియా లేఖ.

వ్యాఖ్య  -        వాతలుపెట్టి బర్నాల్ పూయమన్నట్లుగా వుంది.

Read 335 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter