Friday, 20 June 2014 11:07

వార్త - వ్యాఖ్య

Written by 
Rate this item
(0 votes)

వార్త     -        కఠిన నిర్ణయాలతోనే ప్రగతి. – ప్రధాని నరేంద్ర మోడీ

వ్యాఖ్య  -        మీరు మరీ అంత కఠినంగా వుంటే ప్రజలు పాలకుల పట్ల ఇంకా కఠినంగా తయారవుతారేమో.

వార్త     -        ఆకాశ హార్మ్యాలతో రాజధాని. – చంద్రబాబుతో రాజధాని కమిటీ భేటీలో చర్చ.

వ్యాఖ్య  -        సింగపూర్ లాంటి రాజధాని అంటే ఇదేనా.

వార్త     -        ఋణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. – సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు.

వ్యాఖ్య  -        ఋణమాఫీ అంటే... కాఫీ తాగినంత సులభం అనుకుంటున్నారా.

వార్త     -        పోలవరం ఆర్డినెన్స్ రద్దుచేయాలి.

వ్యాఖ్య  -        అసలు రాష్ర్ట విభజనే రద్దు చేస్తే పోలా.

వార్త     -        ప్రజలపై పైసా భారం మోపం. – ఆర్థికమంత్రి యనమల.

వ్యాఖ్య  -        అల్లాఉద్దీన్ అద్భుత దీపమేమన్నా దొరికిందా.

వార్త     -        అటవీ సంపదను కాపాడుతాం. – అడవుల మంత్రి బొజ్జల.

వ్యాఖ్య  -        ఇంకేం మిగిలిందని కాపాడ్డానికి.

వార్త     -        తెలుగు భాషాభివృద్ధికి కృషి. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

వ్యాఖ్య  -        ముందు అందరు మంత్రుల చేత సంపూర్ణంగా తెలుగులో మాట్లాడేలా చేయండి.

వార్త     -        ఋణమాఫీకి మేం అనుకూలం కాదు. – ఆర్ బిఐ.

వ్యాఖ్య  -        మీకు ఓట్లతో అవసరం లేదుగా, అలాగే చెబుతారు.

Read 292 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter