Friday, 25 July 2014 16:02

సొమ్మొకరిది... సోకొకరిది

Written by 
Rate this item
(1 Vote)

vpr conveవెంకయ్యనాయుడంటే అజాతశత్రువు. పేరుకి ఆయన బీజేపీ పార్టీ వాడైనా ఆయనకు అందరూ మిత్రులే. ముఖ్యంగా నెల్లూరన్నా, నెల్లూరీయులన్నా ఆయన విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తాడు.

అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వెంకయ్య తొలిసారి నెల్లూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా పౌరసత్కారం పేరుతో విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం వెంకయ్యనాయుడి అభిమతానికి విరుద్ధంగా జరగడం విమర్శలకు దారితీసింది.

వాస్తవానికి నెల్లూరీయుల పక్షాన ఆయనకు పౌరసత్కారం చేయవలసింది మునిసిపల్ కార్పొరేషన్. అయితే పౌరసత్కారం అన్న పేరుని హైజాక్ చేసి కార్యక్రమాన్ని తెలుగుదేశంపార్టీ పక్షాన తాము చేస్తున్నట్లుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్రలు పాత్రికేయ సమావేశంలో ప్రకటించారు.

అయితే కార్యక్రమం జరిగిన విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకపోగా దాదాపు రెండువేల మందికిపైగా పాల్గొన్న అతిథులుకు విందును కూడా తన స్వంత ఖర్చుతో భరించారు. ప్రభాకర్ రెడ్డికి కూడా అజాతశత్రువు అనే పేరుంది. ఆయన వై.యస్.ఆర్.సి.పి కి చెందినవాడైనా అన్ని ఇతర పార్టీల వారికి ఆయనంటే గౌరవం. అదే విధంగా ప్రభాకర్ రెడ్డి కూడా అందరితో సత్సంబంధాలు కలిగి వుంటారు. విపిఆర్ లో జరిగిన సభలో సైతం వెంకయ్యనాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన నెల్లూరుకు అందించిన అమోఘమైన కన్వెన్షన్ సెంటర్ ని సభాముఖంగా కొనియాడారు. అయితే ఈ కార్యక్రమం తలపెట్టిన రోజు నుండీ పౌరసత్కార సంఘం సమన్వయకర్తలుగా వ్యవహరించిన వారు కానీ, ఈ సంఘంలోని ఇతర సభ్యులు కానీ విపిఆర్ పేరును ప్రస్తావించకపోవడం, అంతేకాకుండా అజాతశత్రువుగా పేరున్న వెంకయ్యనాయుడి సత్కార కార్యక్రమానికి తమకు గిట్టని వారిని ఆహ్వానించకపోవడం వెంకయ్య అభిమానులను సైతం బాధించింది.

కార్యక్రమ భారమంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భరిస్తే అంతా తామే చేశామన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఆహ్వాన సంఘం తీరు కూడా వెంకయ్య ఆప్తులకు నచ్చలేదు. సొమ్మొకరిది... సోకొకరిదా... అని వాళ్ళల్లో వాళ్లే చర్చించుకోవడం కనిపించింది. ఏది ఏమైనా వెంకయ్యలాంటి వ్యక్తిత్వం వున్న వ్యక్తులను ఇలాంటి వివాదాలలోకి లాగి ఆయన మనసుకు కష్టం, ఆయనని ఇష్టపడే వారికి బాధ కలిగించడం విచారకరం.

Read 508 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter