జిల్లా వార్తలు


తెలుగుదేశంపార్టీకి సంస్థాగతంగా కీలక విభాగం పోలిట్‌బ్యూరో. ఇందులో సభ్యుడిగా వుండడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు నాయకులు. పోలిట్‌బ్యూరో అంటే పార్టీ అధ్యక్షుడి తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో కీలక వ్యవస్థ. ప్రస్తుతం నెల్లూరుజిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలిట్‌బ్యూరో సభ్యులుగా వున్నారు. ఇప్పుడాయనను మంత్రి వర్గానికి తీసుకున్నారు. కాబట్టి పోలిట్‌బ్యూరోలో ఆయన స్థానాన్ని జిల్లా నుండి ఒకరిద్దరు నాయకులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరారనేగాని ఇంతవరకు ఆనం సోదరులను సంతుష్టపరిచే విధంగా…

Read more...

'ఎర్కపోయి వచ్చాము... ఇరుక్కు పోయాము' అన్నట్లుగా ఉంది తెలుగు దేశంపార్టీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్‌లో వున్నప్పుడు హైమాక్స్‌ లైట్లు లాగా ధగధగ వెలిగారు. తెలుగుదేశం లోకి వచ్చాక కిరసనాయిల్‌ దీపాల్లా మారి పోయారు. కాంగ్రెస్‌పార్టీలో వున్నంత వైభవం ఇక్కడ రాదని తెలుసు... అయితే మరీ ఇంత అధ్వాన్నమవుతారనుకోలేదు. రెండేళ్ల క్రితమే తెలుగుదేశంలో చేరిన ఆనం సోదరులు ఈ పార్టీలో ఎందుకు చేరామా అనే పరిస్థితుల్లో ఇప్పు డున్నారు. కాంగ్రెస్‌లో…

Read more...

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం. కాబట్టే ఈ పార్టీలో ఇప్పుడు అన్ని పార్టీల అవలక్షణాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలలో వుండే చెడు సంస్కృతి అంతా కూడా ఇప్పుడు ఈ ఒక్క పార్టీలోనే కనిపిస్తోంది.…

Read more...

దాదాపు రెండు దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి, నేదురుమల్లి వంటి రాజకీయ యోధులను కూడా దెబ్బతీసిన ఆనం సోదరులకు ప్రస్తుతం రాజకీయాలలో గడ్డు పరిస్థితి కొనసాగుతోంది. వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం జిల్లాలో ఆనం వారి హవా కొన సాగింది. వై.యస్‌. మరణం తర్వాత రోశయ్య, కిరణ్‌ల హయాంలోనూ వారి పెత్తనం ఇంకా ఎక్కువుగానే కొనసాగినా పరోక్షంగా మాత్రం వై.యస్‌. మరణం వారి రాజకీయ జీవితచరిత్రను అనుకోని…

Read more...

జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి. వర్గ రాజకీయాల్లో బాగా రాటుదేలిన నాయకుడు. అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు, ఇటు సొంత పార్టీలోని ప్రత్యర్ధులకు ఒకే టైంలో ఒకే నోటితో ఒకే మాటతో సమాధానం…

Read more...

వైకాపా సీనియర్‌ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాను పార్టీ మారుతు న్నానన్న వదంతులకు తెరదించారు. తన రాజకీయ జీవితం చివరి క్షణం వరకు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వెంటే తన పయనమంటూ కుండబద్ధలుకొట్టారు. ఇటీవలకాలంలో ప్రసన్న తెలుగు దేశం పార్టీలో చేరుతున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ లలోనూ పోస్ట్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనకు సీటు ఇవ్వలేదని ప్రసన్న అలిగాడని వార్తలొచ్చాయి. అసలు ప్రసన్న స్థానిక…

Read more...

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి 87 ఓట్ల తేడాతో గెలిచాడు. వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి గట్టి పోటీనే ఇచ్చి ఓడిపోయాడు. ఓ దశలో వైకాపా గెలుస్తుందనే పరిస్థితి కూడా కల్పించారు. అసలు నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా? అనే మీమాంస పరిస్థితి నుండి వైకాపా ఈ స్థాయి పోటీనివ్వడం గొప్ప విష యమే!…

Read more...


తూర్పు రాయలసీమ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలు 9వతేదీ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6గంటలకు ముగిసింది. పట్టభద్రుల నియోజకవర్గం నుండి 13మంది, ఉపా ధ్యాయ నియోజకవర్గం నుండి 9మంది బరిలో నిలిచారు. మూడుజిల్లాలకు సంబంధించిన ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విఠపు బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ మద్దతుదారుగా పోటీ చేసిన…

Read more...

బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా సమావేశాలు... నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం, పార్టీ కండువాలు మార్చినవారికి లక్షల్లో డబ్బు... ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్ది నెల్లూరుజిల్లా స్థానిక శాసనమండలి ఎన్నిక వేడెక్కుతోంది. గెలుపు…

Read more...


Page 1 of 27

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • దాహార్తికి మూగజీవాలు విలవిల
    తాగడానికి గుక్కెడు మంచినీరు దొరక్క జనం అల్లాడిపోతుంటే, దాహార్తికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు అడుగంటి ఎటుచూసినా ఎడారే కనిపిస్తోంది. దీంతో దాహంతో మూగజీవాలు గిలగిల కొట్టుకుంటూ వేలసంఖ్యలో మృత్యువాత…
  • కలుస్తారా... కలసి నడుస్తారా?
    టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
  • తిరుగుబాట్లతో తలపోటు
    కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…

Newsletter