జిల్లా వార్తలు
జిల్లాలో వై.యస్.జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర విజయ వంతమైంది. 20రోజుల పాదయాత్రలో ఆయన జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌చేశాడు. జగన్ తన పాద యాత్రలో కర్నూలు జిల్లాలో ఇద్దరికే సీట్లు కన్ఫర్మ్ చేసాడు. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఏ సీటు ఎవరికీ కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు నెల్లూరుజిల్లాలోనూ అదే జరిగింది. ఫలానా సీటు ఫలానా నాయకుడికే అని ఆయన చెప్పలేదు. సూళ్లూరుపేట సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్యకు చెప్పాడని,…
2015లో కురిసిన వర్షాలు తప్ప అంతకుముందు మూడేళ్ళుగాని, గత రెండేళ్లలో గాని జిల్లాలో పెద్దగా వర్షాలు పడింది లేదు. ప్రతి ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితులే! శ్రీశైలం నుండి వస్తున్న నీళ్ళతో డెల్టాలో పంటలు పండించుకుంటున్నారు తప్పితే జిల్లాలో కురిసిన వర్షాలను ఆధా రంగా చేసుకుని పంటలు పండించడం చాలా తక్కువ. డెల్టాకు కనీసం శ్రీశైలం నుండన్నా నీళ్లొస్తున్నాయి. మెట్ట మండ లాలకు ఆ భాగ్యం కూడా లేదు. కేవలం…
రైతు దేశానికి వెన్నెముక. రైతేరాజు, జై కిసాన్, అన్నదాత లేనిదే ఈ దేశం లేదు... ఈ మాటలన్నీ వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. కాని ఆచరణలోకి వచ్చేసరికి రైతు పరిస్థితి నైట్‌వాచ్‌మెన్ కంటే ఘోరంగా ఉంటుంది. రైతుకు సరైన ఆదరణ, సముచిత ప్రాధాన్యత లేక, వ్యవసాయం చేసేవారికి సరైన హోదా, గౌరవం లేక రానురాను వ్యవసాయం చేసేవాళ్లే తగ్గిపోతున్నారు. రైతులకు ఏ ప్రభుత్వంలోనూ న్యాయం జరక్కపోతుండడం మూలంగా అసలు వ్యవసాయం…
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇంత వరెస్ట్ రికార్డ్ ఉండదేమో! 1984లో తెలుగుదేశం అభ్యర్థిగా పుచ్చలపల్లి పెంచలయ్య గెలవగా, 1999లో వాజ్‌పేయి సానుభూతి గాలిలో ఉక్కాల రాజేశ్వరమ్మ గెలిచారు. నెల్లూరు లోక్‌సభ టీడీపీకి…
ఇప్పుడు నలభై ఐదేళ్ల వయసులో వున్నోళ్ళు వారి చిన్నప్పటి నుండి ఒక మాట వింటూనే వుండుంటారు. అదే వెంకటగిరి-నడికుడి మధ్య రైల్వేలైన్ వస్తుందని, మన రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, దుత్తలూరుల మీదుగా రైలు పోతుందని. అప్పటి నుండి వింటున్నాం... ఇప్పుడూ వింటున్నాం... ఇంకో పాతికేళ్ల తర్వాత కూడా ఇదే మాటను వింటుంటాం... ఈ రైల్వేలైన్‌కు వాస్తుదోషమో ఇంకేదన్నా లోపమో గాని ఒకడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు వేస్తుంది.…
రాష్ట్రంలోనే వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు లోక్‌సభ స్థానాలతో పాటు పది అసెంబ్లీలో ఏడింటిని వైకాపాకే కట్టబెట్టారు. అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్ మారలేదు. 2014ఎన్నికల తర్వాత పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరారు. కాని, వారి…
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మనుషులను, వారి మాటలను నమ్మడు. ఆయన నమ్మేది కంప్యూటర్లను, డ్యాష్‌బోర్డు సమాచారాన్ని, ఇంటలిజన్స్ నివేదికలను, సర్వే సంస్థల రిపోర్ట్‌లను. రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితి ఎలా వుంది, తమ నాయకుల పనితీరు ఎలా వుంది అన్నదానిపై ఆయన తరచూ సర్వేలు నిర్వహిస్తుంటాడు. ఈ సర్వే ఫలితాలు ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంటాడు. ఇటీవల నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో నెల్లూరు జిల్లా నుండి ఆయనకు…
జిల్లాలో జైత్రయాత్రగా సాగుతున్న వై.యస్.జగన్ పాదయాత్రలో ప్రముఖ సేవాతత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడుగులు కలిపాడు. జగన్‌తో కలిసి నడిచాడు. జిల్లాలో వైకాపాకు మరింత బలాన్ని జోడించాడు. గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుంటున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తిరిగి రాజకీయ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తన ఆలోచనలు, ఆశయాల ఆచరణకు వైకాపానే వేదికగా ఎంచుకున్నాడు. అందుకే తానుంటున్న పార్టీ సేవకే అంకితం కావాలనుకున్నాడు. పార్టీలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలను కున్నాడు. ఇందులో…
ఆయన పొద్దున బ్రేక్‌ఫాస్ట్ రాహుల్‌గాంధీతోనూ, లంచ్ అహ్మద్‌పటేల్‌తోనూ, డిన్నర్ గులాంనబీ ఆజాద్‌తోనూ చేస్తుంటాడు. ఆయన నోటికి జాతీయ స్థాయి నాయకులు తప్పితే రాష్ట్రస్థాయి నాయకులు అసలు ఆనరు. ఆయనను కలిసి మాట్లాడుతుంటే... ఇప్పుడే సోనియాగాంధీ ఫోన్ చేసింది, అర్జంట్‌గా ఢిల్లీకి రమ్మంది... ఈమధ్య నేను ఢిల్లీలో కనిపించడం లేదని దిగ్విజయ్ సింగ్ అలిగివున్నాడు... నెల్లూరు జిల్లాలో ఈ తరహా కోతల రాయుడు... సారీ కోతల నాయకుడు ఎవరయ్యా అంటే ఎవరికైనా…